మీ పీఎఫ్ మొత్తాన్ని తీసుకోవాలా? 5 సింపుల్ స్టెప్స్‌లో.. ఇలా చేయండి
ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకునే ప్రక్రియ ఇప్పుడు మరింత సులభతరమైంది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులు స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి ఉమాంగ్ యాప్ సాయంతో డబ్బును ఉపసంహరించుకోవచ్చునని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ట్వీట్ చేసింది. కరోనా అడ్వాన్స్ రూపంలో నగదును ఉపసంహరించుకోవచ్చునని పేర్కొంది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ రుణాలు ఇస్తూ, అకౌంట్ నుండి కొంతమొత్తంలో డబ్బులు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పిస్తూ ఊరట కల్పించింది. కరోనా చికిత్స కోసం పీఎఫ్ ఖాతా నుండి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ మరింత సరళీకృతం చేసింది.

ఉమాంగ్ యాప్ ద్వారా నగదు ఉపసంహరణ ఇలా
- ఉమాంగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
- సెర్చ్ మెనూలోకి వెళ్లి, లుక్ ఫర్ ఈపీఎఫ్ఓ సర్వీసెస్‌లోకి వెళ్లాలి.
- ఎంప్లాయీ సెంట్రిక్‌ను ఎంచుకోవాలి. రెయిజ్ క్లెయిమ్‌ను పైన క్లిక్ చేయాలి. ఈపీఎఫ్ యూఏఎన్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఉపసంహరణ రకాన్ని పేర్కొని, ఉమాంగ్ యాప్ ద్వారా సబ్‌మిట్ చేయాలి.
- మీకు క్లెయిమ్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. మీ క్లెయిమ్ స్టేటస్‌ను ట్రాక్ చేయడానికి ఈ నెంబర్‌ను ఉపయోగించవచ్చు.

ఇలా అయితేనే...
ఉమాంగ్ యాప్ ద్వారా నగదును ఉపసంహరించుకోవచ్చు. కానీ ఈ కింది క్రెటేరియా అయితేనే ఇది సాధ్యం.
- మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) కచ్చితంగా పాన్ నెంబర్‌తో లింక్ అయి ఉండాలి.
- మీ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉండాలి.
- మీ ఉమాంగ్ యాప్ కచ్చితంగా ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉండాలి.
- దేశంలో మొబైల్ గవర్నెన్స్‌ను ప్రోత్సహించేందుకు ఉమాంగ్ యాప్‌ను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY), నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్(NeGD) డెవలప్ చేసింది.
పాన్-ఇండియా ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ కోసం భారతీయులందరికీ ఉమాంగ్ యాప్ సింగిల్ ప్లాట్‌ఫామ్.

ఈపీఎఫ్ రూల్స్
సాధారణంగా ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరించుకోవడానికి ఇంటి నిర్మాణం లేదా ఫ్లాట్ కొనుగోలు లేదా ఇంటిని కొనుగోలు చేయడానికి కనీసం 60 నెలల అర్హత తర్వాత తీసుకోవచ్చు.
పీఎఫ్ ఖాతాదారు పెళ్లి లేదా కూతురు లేదా కొడుకు లేదా సోదరి పెళ్లి కోసం తీసుకోవచ్చు. అలాగే వీరి విద్య కోసం కూడా తీసుకోవచ్చు. దీనికి కనీసం 84 నెలలు అవసరం. ఈపీఎఫ్ నుండి 50 శాతం వస్తుంది.
రిటైర్మెంట్‌కు ఏడాది ముందు తీసుకోవచ్చు. 54 ఏళ్ల కంటే పైన వయస్సు ఉండాలి. 90 శాతం వరకు తీసుకోవచ్చు.
మెడికల్ ఖర్చులు, నేషనల్ కాలామిటీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అవసర కొనుగోళ్లు, ఫ్యాక్టరీ క్లోజ్ వంటి వాటి కోసం తీసుకోవచ్చు.
అయితే ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో కరోనా అడ్వాన్స్ రూపంలోను అందిస్తోంది.