For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wipro: ఉద్యోగులను కాపాడుకునేందుకు విప్రో పాట్లు.. 73 మందికి వీపీ స్థాయి ప్రమోషన్లు..

By Lekhaka
|

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో.. 73 మంది సీనియర్లకు ప్రమోషన్ కల్పించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను ఉద్యోగుల అట్రిషన్‌ రేటు 23 శాతం ఉండగా.. ఉన్నత స్థాయి ఉద్యోగులను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 12 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి, మరో 61 మంది ఎగ్జిక్యూటివ్‌లను వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ప్రమోట్ చేసింది. ఈ మార్పులతో మొత్తంగా 200 మంది వీపీ మరియు ఎస్‌వీపీ స్థాయి ఉద్యోగుల పర్యవేక్షణలో కంపెనీ కార్యకలాపాలు కొనసాగించనుంది.

ఉద్యోగుల భాగస్వామ్యం పెంచేందుకే..
కంపెనీ ఎదుగుదలలో ఉద్యోగులను భాగం చేసేందుకు, వారిలో నాయకత్వ లక్షణాలను మరింత మెరుగుపరచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. వీపీ ప్రమోషన్లు ఈ స్థాయిలో ఇవ్వడం ఇదే తొలిసారని పేర్కొంది. ఇవి వారి ప్రతిభకు, సామర్థ్యానికి విప్రో గుర్తింపునిస్తుందనడానికి నిదర్శనమని తెలిపింది. వేలాది మంది ఇతర సాధారణ ఉద్యోగులకు సైతం పదోన్నతులు కల్పించినట్లు చెప్పింది.

Wipro promoted 73 executive level employees to vp status.

ఆపరేషన్ ఆకర్ష్:
గత కొంతకాలంగా అధిక అట్రిషన్‌ రేటుతో విప్రో సతమతమవుతోంది. గత రెండు క్వార్టర్‌లలోనూ దాదాపు 20 శాతానికి పైగా ఉద్యోగులు సంస్థను వీడారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల ద్వారా ఉన్న ఉద్యోగులను ఆకర్షించాలని చూస్తోంది. ఈ ప్రయత్నాలు రానున్న కాలంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయో వేచిచూడాలి మరి...!

English summary

Wipro: ఉద్యోగులను కాపాడుకునేందుకు విప్రో పాట్లు.. 73 మందికి వీపీ స్థాయి ప్రమోషన్లు.. | Wipro promoted 73 executive level employees to vp status.

Wipro plans to contain employee attrition
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X