For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wipro: ఆ 300 మందిని కనిపెట్టింది విప్రో కాదు పీఎఫ్ సంస్థట..! ఎలాగంటే..

|

ఒక వ్యక్తి ఒకేసారి రెండు కంపెనీల్లో పని చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారు. ఇప్పుడు ఈ విషయం తెరపైకి ఎందుకు వచ్చిదంటే.. కొద్ది రోజుల క్రితం ఐటీ సంస్థ విప్రో 300 మంది ఉద్యోగులను తొలగించింది. ఎందుకంటే వీరు విప్రోతో పాటు మరో కంపెనీకి పని చేస్తున్నారని ఉద్యోగం నుంచి బయటకు పంపింది. అయితే ఉద్యోగులు రెండు కంపెనీల్లో పని చేస్తున్నారని కంపెనీ ఎలా గుర్తించిందని చాలా మందికి అర్థం కాలేదు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

దీన్ని గురించి ఓ ట్విటర్‌ యూజర్‌ పెట్టిన సుదీర్ఘ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా సమయంలో అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చాయి. దీంతో అందురు ఉద్యోగులు ఇంటి పని చేశారు. ఈ సమయంలో కొంత మంది ఉద్యోగులు రెండు కంపెనీల్లో పని చేశారు. రెండు ల్యాప్‌ట్యాప్‌లు, ఒకే వైఫై, ఇద్దరు క్లయింట్లు.. ఒకే పని ఇలా కొంత ఐటీ రెండు చేతుల రెండు కంపెనీల్లో జీతాలు పొందారు.

పీఎఫ్‌ ఖాతా

పీఎఫ్‌ ఖాతా

కానీ చివరికి కొందరు దొరికిపోయారు. వీరిని ఏదో పెద్ద టెక్నాలజీ వాడి కనిపెట్టలేదు. వీరని పీఎఫ్ పట్టించింది. కంపెనీలు తమ ఉద్యోగులకు పీఎఫ్‌ జమ చేయడం కేంద్రం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. కంపెనీలు శాలరీ అకౌంటర్ల కోసం ఉద్యోగుల నుంచి ఆధార్‌, పాన్‌ నంబర్లు తీసుకుంటాయి. వాటినే పీఎఫ్‌ ఖాతాకు ఉపయోగిస్తాయి. ప్రతీ నెల ఫీఎఫ్ అకౌంట్ లో డబ్బును జమ చేస్తాయి.

డీ-డుప్లికేషన్‌ అల్గారిథమ్‌

డీ-డుప్లికేషన్‌ అల్గారిథమ్‌

పీఎఫ్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు డీ-డుప్లికేషన్‌ అల్గారిథమ్‌ను ఉపయోగించి.. ఎవరి ఖాతాలోనైనా ఎక్కువసార్లు పీఎఫ్‌ జమ అయిందో లేదో చెక్‌ చేస్తూ కంపెనీలను హెచ్చరిస్తుంది. ఇటీవల అలా చేసిన తనిఖీల్లో కొందరు వ్యక్తుల ఖాతాల్లో ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు పీఎఫ్ డబ్బులు జమ చేసినట్లు గుర్తించింది. వెంటనే ఆ సమాచారాన్ని ఆయా కంపెనీలకు పంపింది. దీంతో ఆ ఉద్యోగులను కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది.

English summary

Wipro: ఆ 300 మందిని కనిపెట్టింది విప్రో కాదు పీఎఫ్ సంస్థట..! ఎలాగంటే.. | Wipro found employees moonlighting using PF account

Wipro lays off 300 Moonlighting employees. It seems that they were discovered on the basis of PF account.
Story first published: Tuesday, October 11, 2022, 17:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X