For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Notes Ban: కావాలని తెచ్చిన రూ.2000 నోటు.. ఇప్పుడెందుకు కనుమరుగౌతున్నాయి..?

|

Notes Ban: దేశవ్యాప్తంగా రూ.2000 నోట్ల ఉపసంహరణపై ఇప్పుడు భారీగా చర్చ జరుగుతోంది. పెద్ద నోట్లు వద్దంటూనే గతంలో మోదీ సర్కారు రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కావాలని తెచ్చి.. ఇప్పుడు మళ్లీ వాటిని వద్దనుకోవటం ఏంటని అందరూ అభిప్రాయపడుతున్నారు.

క్లీన్ నోట్ పాలసీ కారణంగా రూ.2000 నోటును ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. అయితే అది ప్రధాన కారణం కాదని చాలా మంది భావిస్తున్నారు. కరెన్సీ ఉపసంహరణ వ్యవస్థలోని మొత్తం కరెన్సీలో 86 శాతంపై ప్రభావం చూపినందున డీమోనిటైజేషన్ సమయంలో అధిక విలువ కలిగిన రూ.2,000 నోటును జారీ చేయడం తప్పనిసరిగా మారింది. త్వరగా ఆర్థిక వ్యవస్థ కుదుటపడేలా చేసేందుకు అప్పట్లో ఈ నోట్లు ఎంతగానో దోహదపడ్డాయని తెలుస్తోంది.

 2000rs-note

అయితే అధిక విలువ కలిగిన రూ.2000 నోట్లను నిల్వ చేయటం, మార్చటం సులభం కాబట్టి బ్లాక్ మార్కెటర్లు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. చాలా కాలంగా మార్కెట్లో ఈ నోట్లు కనిపించటం లేదు. పైగా అన్ని బ్యాంకులు తమ ఏటీఎంలలో రూ.2000 నోట్లను రీకాలిబరేషన్ చేయడంతో సరిపడా రూ.2000 నోట్లు రావడం లేదని ఫిర్యాదు చేస్తున్నాయి.

పెద్ద నోట్లను మార్కెట్ నుంచి తొలగించటానికి ప్రధాన కారణం దొంగ నోట్లను అరికట్టడం. అయితే ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ తీసుకున్న నోట్ల ఉపసంహరణ నిర్ణయం మినీ డీమానిటైజేషన్ అని చెప్పుకోవచ్చు. పెద్ద మొత్తంలో కరెన్సీని కలిగి ఉన్నవారు నోట్లను డిపాజిట్ చేస్తున్నట్లయితే లేదా మార్పిడి చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన మూలాన్ని వారు తప్పకుండా వెల్లడించాల్సి ఉంటుంది. ఒకవేళ నోట్లు తిరిగి బ్యాంకులకు రాకపోతే నిర్ణీత గడువు తర్వాత అవి విలువను కోల్పోతాయి. రిజర్వు బ్యాంక్ వాటికి ఎలాంటి చెల్లింపు చేయదు కాబట్టి RBIకి లాభం కూడా.

అయితే దేశంలోని రాజకీయ పార్టీలు మాత్రం దీనిని ఎన్నికల అస్త్రంగా భావిస్తున్నాయి. బీజేపీ కర్ణాటక ఎన్నికల ఓటమి తర్వాత ఈ నిర్ణయం రావటం కొందరిలో అనుమానాలు కలిగిస్తోంది. కొందరు విశ్లేషకులు మాత్రం ఈ రెండింటికీ సంబంధం లేదని అంటున్నారు.

English summary

Notes Ban: కావాలని తెచ్చిన రూ.2000 నోటు.. ఇప్పుడెందుకు కనుమరుగౌతున్నాయి..? | Why RBI banned 2000 denomination notes after BJP lost in Karnata elections, Know

Why RBI banned 2000 denomination notes after BJP lost in Karnata elections, Know
Story first published: Saturday, May 20, 2023, 11:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X