భారత్‌లో చమురు వినియోగం భారీగా పడిపోయింది. రెండు దశాబ్దాల తర్వాత 2020-21 ఆర్థిక సంవత్సరంలో వినియోగం పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం ఏకంగా 9.1 శాతం క్షీణించింది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా చమురు వినియోగం తగ్గింది. 1998-99 ఆర్థిక సంవత్సరం తర్వాత వినియోగం తగ్గడం ఇదే మొదటిసారి.
2019-20లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 214.12 మిలియన్ టన్నులుగా ఉండగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది 194.63 మిలియన్ టన్నులకు తగ్గింది. చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) ఈ మేరకు డేటా విడుదల చేసింది.

ఎల్పీజీ వినియోగం జంప్
కరోనా కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ఇతర చమురు వినియోగం భారీగా తగ్గినప్పటికీ, ఎల్పీజీ గ్యాస్ వినియోగం మాత్రం పెరిగింది. మహమ్మారి కారణంగా దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్, ఆ తర్వాత ఆంక్షల నేపథ్యంలో ప్రజలు బయటకు రాలేకపోయారు. దీంతో వినియోగం పడిపోయింది.
డీజిల్ వినియోగం భారీగా 12 శాతం తగ్గిపోయి 72.72 మిలియన్ టన్నులకు, పెట్రోల్ వినియోగం 6.7 శాతం తగ్గి 27.95 మిలియన్ టన్నులకు పరిమితమైంది. వంట గ్యాస్ మాత్రం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 4.7 శాతం నుండి 25.59 శాతానికి పెరిగింది. కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసింది.

జెట్ ఫ్యూయల్ వినియోగం
దాదాపు ఏడాది కాలం మూతపడిన విమాన సర్వీసులు ఆ తర్వాత పాక్షికంగా ప్రారంభమయ్యాయి. దీంతో జెట్ ఫ్యూయల్(ATF) వినియోగం 53.6 శాతం తగ్గి 3.7 మిలియన్ టన్నులు నమోదయింది. కార్యకలాపాలు నిలిచిపోవడంతో డీజిల్ వినియోగమే అన్నింటి కంటే ఎక్కువగా 12 శాతం క్షీణించింది.
నాఫ్తా అమ్మకాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరం స్థాయిలో 14.2 మిలియన్ టన్నులుగా ఉండగా, రహదారుల నిర్మాణంలో ఉపయోగించే బిటుమెన్ వినియోగం 6 శాతం పెరిగి 7.11 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఎకానమీకి ఊతమిచ్చే దిశగా కేంద్రం నిర్మాణ కార్యకలాపాలు పుంజుకునేలా చర్యలు తీసుకోవడం ఇందుకు దోహదపడింది.

క్రమంగా పూర్వస్థితికి
కరోనా నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో భారీగా క్షీణించిన వినియోగం రెండో అర్ధ సంవత్సరంలో పెరిగింది. గతేడాది సెప్టెంబర్‌లో పెట్రోల్ అమ్మకాలు తిరిగి కరోనా పూర్వస్థాయికి చేరుకోగా, ఆ తర్వాత నెలల్లో పండుగ సీజన్ కారణంగా డీజిల్ విక్రయాలు పుంజుకున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఇంధనానికి డిమాండ్ 18 శాతం పెరిగి 18.77 మిలియన్ టన్నులకు చేరుకుంది. డీజిల్ వినియోగం అత్యధికంగా 27 శాతం, పెట్రోల్ డిమాండ్ 25.7 శాతం పెరిగింది. గత మార్చి నెలలో బేస్ స్థాయి తక్కువగా ఉండటం ఇందుకు కొంత కారణం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications