For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT News: విప్రో, టెక్ మహీంద్రా Q4 ఫలితాలు విడుదల.. IT స్టాక్స్ కొనేముందు నిపుణుల రేటింగ్స్ తెలుసుకోండి.

|

IT News: దిగ్గజ టెక్ కంపెనీలు విప్రో, టెక్ మహీంద్రాలు FY23 Q4 ఫలితాలను ప్రకటించాయి. Wipro YoY వృద్ధి అంచనాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, FY24 గైడెన్స్ మాత్రం తక్కువగానే ఉంది. నికర లాభం భారీగా తగ్గింది. పెరుగుతున్న ఖర్చులు, క్లయింట్ల వ్యయం తగ్గింపుతో టెక్ మహీంద్రా PATలో రెండంకెల క్షీణత నమోదు చేసింది. క్యూ4 గణాంకాల విడుదల తర్వాత రెండు కంపెనీల స్టాక్‌ లు శుక్రవారం ట్రేడింగ్ పై దృష్టి సారించాయి. విప్రో స్టాక్ ధర BSEలో గురువారం 374.35 వద్ద ఫ్లాట్‌ గా ముగిసింది. కానీ టెక్ మహీంద్రా షేరు విలువ 0.8% పెరిగి 1,004.20 వద్ద క్లోజ్ అయింది.

విప్రో:మార్చి 2023 త్రైమాసికంలో విప్రో 3,074 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసింది. అయితే ఏడాది క్రితం ఇదే కాలంలో 3,087.3 కోట్లు మరియు అంతకు ముందు త్రైమాసికంలో 3,052 కోట్లు ఆర్జించింది. Q4FY23లో కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం 23 వేల 190 కోట్లకు చేరి సంవత్సరానికి 11.2 శాతం వృద్ధిని సాధించింది. గురువారం జరిగిన సమావేశంలో విప్రో డైరెక్టర్ల బోర్డు 12 వేల కోట్ల విలువైన బైబ్యాక్‌ కు ఆమోదం తెలిపింది.

Which IT stocks to buy while Tech giants Wipro, Tech Mahindra released Q4 results

విప్రో ఆదాయాలు మరియు స్టాక్ ధరలపై రిలయన్స్ సెక్యూరిటీస్ తమ అభిప్రాయాన్ని తెలియజేసింది. కంపెనీ ఆదాయం అంచనాలకు అనుగుణంగానే ఉన్నట్లు రీసెర్చ్ హెడ్ మితుల్ షా ప్రకటించారు. సరళీకృత ఆపరేటింగ్ స్ట్రక్చర్, స్టెప్-అప్ ఇన్ కేపబిలిటీ అప్‌గ్రేడ్ మరియు టాలెంట్ మేనేజ్‌మెంట్‌, అట్రిషన్ క్షీణత, మార్జిన్ విస్తరణ దిశగా ప్రయత్నిస్తోందని అభిప్రాయపడ్డారు. వీటి ఆధారంగా ప్రస్తుతం BUY రేటింగ్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే IT సర్వీసెస్ విభాగంలో బలహీన మార్గదర్శకత్వం, వ్యాపారంలో సవాళ్లను బట్టి పునఃసమీక్షిస్తామని చెప్పారు.

టెక్ మహీంద్రా:జనవరి-మార్చి త్రైమాసికంలో టెక్ మహీంద్రా 25.8 శాతం YoY మరియు 13.8 శాతం QoQ ఏకీకృత నికర లాభంలో రెండంకెల క్షీణత నమోదు చేసింది. తద్వారా 1,117 కోట్లు సంపాదించింది. ఏకీకృత EBITDA 2,021 కోట్ల వద్ద ఉండగా.. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 13.2 శాతం YoYతో 13 వేల 718 కోట్లకు చేరుకుంది. అయితే QoQ ప్రాతిపదికన మాత్రం తక్కువగానే ఉంది. కాగా FY23కి గాను ఈక్విటీ షేరుకి 32 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది .

ఊహించినట్లుగానే టెక్ మహీంద్రా తన ఆదాయ వృద్ధిలో ఫ్లాట్ సీక్వెన్షియల్ క్షీణతను నమోదు చేసిందని STOXBOX డైరెక్టర్ -రీసెర్చ్ స్వప్నిల్ షా వివరించారు. సంస్థ యొక్క బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ & ఇన్సూరెన్స్ విభాగాల వార్షిక ఆదాయ వృద్ధిలో క్షీణత ఏర్పడినట్లు చెప్పారు. USలో ఇటీవల నెలకొన్న బ్యాంకింగ్ సంక్షోభం మరియు బలహీన IT వ్యయ దృక్పథం కారణంగా అధిక అనిశ్చితి ఏర్పడినట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా, కంపెనీ స్టాకుపై సెల్ రేటింగ్ ఇస్తున్నట్లు రిలయన్స్ సెక్యూరిటీస్ నిపుణులు పేర్కొన్నారు.

English summary

IT News: విప్రో, టెక్ మహీంద్రా Q4 ఫలితాలు విడుదల.. IT స్టాక్స్ కొనేముందు నిపుణుల రేటింగ్స్ తెలుసుకోండి. | Which IT stocks to buy while Tech giants Wipro, Tech Mahindra released Q4 results

Which IT stocks to buy while Tech giants Wipro, Tech Mahindra released Q4 results
Story first published: Friday, April 28, 2023, 8:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X