For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి.. ఎప్పుడు వద్దు, నిపుణులు ఏం చెబుతున్నారు..

|

పర్సనల్ లోన్.. చిటికెలో అప్రూవల్ వస్తోన్నాయి. ప్రీ అప్రూవల్ అని క్షణాల్లో నగదు మీ బ్యాంకు ఖాతాలో పడిపోతుంది. అయితే పర్సనల్ లోన్ ఎప్పుడూ తీసుకోవాలి. దేని కోసం తీసుకోవాలి అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. మెడికల్‌, ఫ్యామిలీ అత్యవసర పరిస్థితుల కోసం లేదంటే ఉద్యోగం కోల్పోయినప్పడు అప్పటికప్పుడు వచ్చే అవసరాల కోసం పర్సనల్‌ లోన్ తీసుకోవచ్చు. డబ్బులు లేక సతమతవుతున్న సమయంలో ఈ లోన్‌ కాస్త ఊరటనిస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్‌ను సమకూర్చుకోవడం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం ఇంకా మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

 రినేవేషన్ ఓకే

రినేవేషన్ ఓకే

ఇంటిని చక్కదిద్దడానికి లేదంటే రినోవేషన్‌కు పర్సనల్‌ లోన్‌ను వినియోగిస్తే దానికి ఆర్థిక పరమార్థం ఉంటుంది. ఇంటిని రినోవేషన్‌ చేయడం వల్ల ఇంటి విలువ పెరుగుతుందనుకున్న సందర్భంలో.. దాని కోసం సరిపడా నిధులు లేనప్పడు వ్యక్తిగత రుణం తీసుకోడంలో తప్పు లేదు. అర్జంటుగా చేయాల్సిన రిపేర్ల వంటి వాటినీ పర్సనల్‌ లోన్‌ సహాయంతో చేయవచ్చు. హౌజింగ్‌ లోన్‌కు టాప్‌ అప్‌ లోన్‌ తీసుకుంటే అతి తక్కువ వడ్డీకే రుణం లభించవచ్చు. కాబట్టి ఆ అవకాశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.

ఎడ్యుకేషన్ కూడా

ఎడ్యుకేషన్ కూడా

ఎడ్యుకేషనల్‌ లేదంటే ప్రొఫెషనల్‌ కోర్స్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ కోసం పర్సనల్‌ లోన్‌ తీసుకోవచ్చు. మీ కోసం లేదా పిల్లల కోసం వాడుకోవచ్చు. దానివల్ల కెరీర్‌ అవకాశాలు మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. ప్రమోషన్లు రావడంలో ఉపయోగపడుతుంది. తీసుకున్న పర్సనల్‌ లోన్‌ ఒక ప్రయోజనాన్ని ఆశించే తీసుకున్నట్టు అవుతుంది. ప్రమోషన్‌ కాకపోతే మరో మంచి ఉద్యోగం అధిక వేతనంతో లభించేందుకు సహాయపడుతుంది. తద్వారా పొందే ప్రయోజనాలు.. మనం పర్సనల్‌ లోన్‌ మీద చెల్లించే వడ్డీని భారం కానివ్వవు. కాబట్టి ఇది మంచి నిర్ణయమే అవుతుంది.

క్రెడిట్ కార్డు పేమెంట్స్..

క్రెడిట్ కార్డు పేమెంట్స్..

క్రెడిట్‌ కార్డుల మీద ఉన్న రుణాలను తీర్చడానికి పర్సనల్‌ లోన్‌ తీసుకోవడంలో మంచిదే. క్రెడిట్‌ కార్డుల మీద చెల్లించే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సంవత్సరానికి సగటున 45 శాతం వరకు క్రెడిట్‌ కార్డు కంపెనీలు వడ్డీని చార్జీ చేస్తాయి. పర్సనల్‌ లోన్లు 18 శాతం అంతకంటే తక్కువ వార్షిక వడ్డీకే లభిస్తాయి. క్రెడిట్‌ కార్డ్‌ రుణాన్ని పర్సనల్‌ లోన్‌ ద్వారా చెల్లిస్తే అధిక వడ్డీ భారం నుంచి తప్పించుకోవచ్చు. అధిక వడ్డీ రుణాలను తీర్చడానికి పర్సనల్‌ లోన్‌ను ఉపయోగించడం వల్ల క్రెడిట్‌ స్కోర్‌ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్‌ కార్డు బకాయిలను పర్సనల్‌ లోన్‌తో తీర్చేస్తే అనేక రుణాలు కాకుండా ఒకే ఒక రుణానికి నెలసరి వాయిదాలు చెల్లించవచ్చు. క్రెడిట్‌ కార్డుల మీద వడ్డీరేట్లను, పర్సనల్‌ లోన్‌ వడ్డీరేట్లతో పోల్చి చూసుకోవడం మంచిది.

సరుకుల కోసం నో

సరుకుల కోసం నో

ఇక నిత్యావసర సరుకుల కోసం, ఇంటి అద్దె చెల్లింపులు వంటి ఖర్చులకు పర్సనల్‌ లోన్‌ తీసుకోవడం సరికాదు. వ్యక్తిగత రుణాలపై వడ్డీ ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తిరిగి చెల్లించకపోతే లేదా ఒక్క ఈఎంఐ ఆలస్యమైనా జరిమానాలు పడడంతోపాటు క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుంది. విహారయాత్ర కోసం, ఫర్నీచర్‌ లేదంటే గాడ్జెట్స్‌ కోసం పర్సనల్‌ లోన్‌ తీసుకోవడం సముచితమే అని చాలామంది భావిస్తారు. కానీ అది తప్పు అవుతుంది. విలాసాలకు, వినియోగానికి సంబంధించిన ఖర్చులన్నీ సొంత సొమ్ముతోనే భరించాల్సి ఉంటుంది. మొదటి నుంచి పొదుపు చేసి వాటిని పొందడం మంచిది.

ఇన్వెస్ట్ మెంట్ కూడా

ఇన్వెస్ట్ మెంట్ కూడా

ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రపంచానికి కొత్త అయితే పర్సనల్‌ లోన్‌ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం అప్పు తీసుకోవడం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని కోరుతున్నారు. తక్కువ రిస్క్‌ ఉండే ఇన్వెస్ట్‌మెంట్ల మీద ట్యాక్స్‌, ద్రవ్యోల్బణం అడ్జస్ట్‌ చేస్తే వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. అవి వడ్డీ చెల్లింపుల కన్నా ఎక్కువ కాదు. ఇక ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్లలో రిస్క్‌ కూడా ఉంటుంది. కాబట్టి అప్పు చేసి మదుపు చేయడం సరైన నిర్ణయం కాదు.

English summary

పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి.. ఎప్పుడు వద్దు, నిపుణులు ఏం చెబుతున్నారు.. | when you take personal loan and how to expenditure

when you take personal loan and how to expenditure in that money financial specialist says some suggestions.
Story first published: Monday, July 19, 2021, 16:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X