For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డు అంతకు మించి వాడితే ఏమౌతుందో తెలుసా?

|

క్రెడిట్ కార్డు. అత్యవసర సమయంలో నేనున్నానంటూ పనికొచ్చే సాధనం. కానీ అతిగా వాడితే మొదటికే మోసం తెచ్చే ఆయుధం కూడా. ఉద్యోగం లో చేరిన కొత్తలో శాలరీ అకౌంట్ తెరిచినప్పుడే సదరు బ్యాంకు మీకో క్రెడిట్ కార్డును కూడా మంజూరు చేస్తుంది. మీ సాలరీని బట్టి రూ 50,000 నుంచి రూ 5 లక్షల వరకు లిమిట్ తో దీనిని మంజూరు చేస్తుంది. ఇందుకోసం ఒక ఉద్యోగి కనీస నెల జీతం రూ 25,000 ఉంటే చాలు. మొట్ట మొదటి క్రెడిట్ కార్డు పొందిన రోజు ఆ ఆనందానికి అవధులే ఉండవు.

ఎందుకంటే... ఎంఎన్ సి కంపెనీల్లో చేరిన మీ ఫ్రెండ్స్ వారి వారి కార్డులు, వాటి లిమిట్ గురించి గొప్పగా చెబుతుంటే మీకు కూడా ఒక కార్డు ఉంటే బాగుండు అనే అభిప్రాయం కలగటం సహజం. కొందరైతే కేవలం ఇందుకోసం నానా తంటాలు పడీ మరీ ఒక క్రెడిట్ కార్డు ను సంపాదిస్తారు. నాకో కార్డు ఉంది అని గర్వంగా చెప్పుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది కానీ... కార్డు వచ్చిన తర్వాత దానిని ఎలా ఉపయోగించాలి అనే విషయంలో సగం మందికి స్పష్టత ఉండదు.

అయితే అసలు దానిని వాడకుండా అలాగే వాలెట్లో పెట్టేస్తారు. లేదంటే అదే పనిగా మొత్తం గీకేస్తారు. ఈ రెండు కూడా మంచి నిర్ణయాలు కావు. పైగా మీ క్రెడిట్ ప్రొఫైల్ ను దెబ్బతీస్తాయి. తెలిసో... తెలియకో అవసరంకంటే ఎక్కువగా క్రెడిట్ కార్డు ఉపయోగించి, బిల్లులు సకాలంలో కట్టకపోతే వచ్చే తిప్పలు అంతా.. ఇంతా కావు. వాటిలో కొన్నిటి గురించి తెలుసుకునేందుకే ఈ కథనం.

అనిల్ అంబానీకి బ్రిటన్ కోర్టు భారీ షాక్

ఓవర్ లిమిట్...

ఓవర్ లిమిట్...

క్రెడిట్ కార్డును జారీ చేసే బ్యాంకు వినియోగదారుని అర్హతను బట్టి క్రెడిట్ లిమిట్ నిర్ణయిస్తుంది. సాధారణంగా అయితే ఏ బ్యాంకు అయినా సరే తొలుత తక్కువ క్రెడిట్ లిమిట్ తో కార్డులను జారీ చేస్తాయి. సదరు వినియోగదారుడు క్రమంగా తీసుకున్న ఋణం కడుతూ ఉంటే ... లిమిట్ కూడా పెంచుతుంది. ఇది అన్ని బ్యాంకులు పాటించే పద్ధతే. కానీ చాలా మంది వినియోగదారులకు తెలియని విషయం ఒకటి ఉంటుంది. అదే ఓవర్ లిమిట్. అంటే... ఉదాహరణకు ఒక కస్టమర్ కు రూ 1 లక్ష క్రెడిట్ లిమిట్ ఉందనుకుందాం. అతను దానిని పూర్తిగా వినియోగించిన తర్వాత కూడా ఇంకొంత సొమ్మును అదే కార్డు నుంచి పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఓవర్ లిమిట్ ఆప్షన్ ను ఎంచుకోవాలా వద్ద అనే ఆప్షన్ ను కొన్నిసార్లు బ్యాంకులు కస్టమర్ల కు ఇస్తాయి. కొన్ని బ్యాంకులు మాత్రం ట్రాన్సక్షన్ డిక్లైన్ ఆప్షన్ ను డిఫాల్ట్ గా అమలు చేస్తాయి. ఓవర్ లిమిట్ ఆప్షన్ ఉన్న కార్డు దారులు వారికి కేటాయించిన మొత్తం లిమిట్ కు మించి కూడా కొంత అదనపు క్రెడిట్ ను పొందవచ్చు.

10% వరకు...

10% వరకు...

సాధారణంగా బ్యాంకులు ఓవర్ లిమిట్ ఆప్షన్ ను ఎమర్జెన్సీ సందర్భాల్లో ఉపయోగించుకునేందుకు వినియోగించేలా అందుబాటులో ఉంచుతాయి. చాలా వరకు బ్యాంకులు మొత్తం క్రెడిట్ లిమిట్ లో మరో 10% అదనపు సొమ్మును ఓవర్ లిమిట్ గా కేటాయిస్తాయి. కొన్ని సార్లు వినియోగదారులు చాలా ముఖ్యమైన లావాదేవీలు చేస్తున్నప్పుడు కేవలం కార్డులో లిమిట్ లేదన్న కారణంతో ట్రాన్సక్షన్ డిక్లైన్ కాకుండా ఉండాలని ఈ ఆప్షన్ ను అందుబాటులో ఉంచుతాయి. దానిని అత్యవసర సందర్భాల్లో వినియోగదారులు నిర్మొహమాటంగా వినియోగించుకోవచ్చు. అయితే, అది కూడా అప్పు కాబట్టి దానికి కూడా కొంత మొత్తంలో ఫీజులను వసూలు చేస్తారు. ఎలాగూ ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పడు వాడితే మాత్రం కస్టమర్లు కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నట్లే.

రూ 500 ఫీజు...

రూ 500 ఫీజు...

చాలా వరకు క్రెడిట్ కార్డులను జారీ చేసిన బ్యాంకులు... ఓవర్ లిమిట్ సందర్భంలో రూ 500 కనీస చార్జీ ని వసూలు చేస్తాయి. లేదా ఓవర్ లిమిట్ ఐన మొత్తం సొమ్ముపై 2.5% వడ్డీ ని వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు మాత్రం ఏది తక్కువ ఐతే అంత మొత్తం చార్జీలను కస్టమర్ కు విధిస్తాయి. కానీ అనేక ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇలా విధించిన చార్జీలను వినియోగదారుని రిక్వెస్ట్ పై రద్దు చేస్తారు కూడా. ఆయా కార్డుదారుని గత ట్రాక్ రికార్డు, ఎందుకు కార్డును ఓవర్ లిమిట్ చేయాల్సి వచ్చిందో స్పష్టం చేస్తే 90% కేసుల్లో బ్యాంకులు ఫీజులను రద్దు చేస్తాయి. ఇందుకోసం వినియోగదారులు ఇమెయిల్ లేదా ఫోన్ లో కూడా సంప్రదించవచ్చు.

సిబిల్ స్కోర్ కు ముప్పు...

సిబిల్ స్కోర్ కు ముప్పు...

ఓవర్ లిమిట్ ఆప్షన్ ఉంది కదా అని ఎడాపెడా వాడేస్తుంటే మాత్రం ముప్పు పొంచి ఉన్నట్లే. అస్తమానం అలా చేస్తుంటే వినియోగదారుని సిబిల్ స్కోర్ ప్రభావితం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సదరు వినియోగదారుడు కేవలం అప్పులపైనే జీవనం సాగిస్తున్నాడు అనే అర్థంలో అతని ట్రాక్ రికార్డు దెబ్బతింటుంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని భావిస్తుండటం వల్ల అతనికి భవిష్యత్ లోన్ల మంజూరు తగ్గిపోతుంది. అతని ఎలిబిలిటీ తగ్గటమే కాకుండా... కస్టమర్ రిస్క్ ప్రొఫైల్ వల్ల కొత్త రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. సో, ఓవర్ లిమిట్ తో కొంచం జాగ్రత్తగా ఉండండి. అన్ని వేళలా మీ కార్డులో 30% నికి మించకుండా చూసుకోండి. తద్వారా అటు సకాలంలో బిల్లులు చెల్లించగలరు. కొత్త రుణాలను పొందగలరు.

English summary

when you should use credit card over limit option

In order to provide a flexibility to consumers and to avoid declining important transactions midway, almost all the banks allow over limit option on credit cards issued by them. Generally this over limit option is fixed at 10% of the total credit limit assigned to any card. However, experts warn consumers that they should not utilize this facility unless it is very important or emergency. Otherwise, they should be ready to pay over limit charges which may be ranging from Rs 500 to 2.5% on over limit amount consumed.
Story first published: Saturday, February 8, 2020, 20:20 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more