For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?

|

WhatsApp: పెరుగుతున్న సాంకేతికతకు తోడు భద్రతా సమస్యలూ అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రైవసీకి భంగం వాటిల్లే విధంగా పలు ఘటనలు జరగడం మనకు తెలుసు. వీటన్నిటినీ కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2021లో కొత్తగా IT రూల్స్ ను తీసుకొచ్చింది. వాటి ఆధారంగా గతేడాది చివరలో సుమారు 36 లక్షల ఖాతాలను వాట్సప్ నిషేధించింది.

36 లక్షల ఖాతాలు అవుట్

36 లక్షల ఖాతాలు అవుట్

IT రూల్స్ 2021కి అనుగుణంగా లేని దాదాపు 36 లక్షల భారతీయ ఖాతాలపై.. ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ వాట్సప్ నిషేధం విధించింది. గతేడాది డిసెంబరులో జరిగిన ఈ చర్యకు వినియోగదారుల ఫిర్యాదులే ప్రథమ కారణమని నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 400 మిలియన్లకు పైగా యూజర్లు ఉండగా.. 1,607 ఫిర్యాదులు వచ్చినట్లు 166 పై చర్యలు తీసుకున్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.

ఫిర్యాదుకు ముందే

ఫిర్యాదుకు ముందే

మొత్తం బ్లాక్ చేయబడిన 36 లక్షల్లో 13 లక్షల ఖతాలను.. వినియోగదారులు ఫిర్యాదు చేయడానికి ముందే తాత్కాలికంగా నిలిపివేసినట్లు వాట్సప్ తెలిపింది. చట్ట వ్యతిరేక, హానికరమైన కార్యకలాపాలకు అవి పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. మెరుగైన భద్రతా ప్రమాణాలను వినియోగదారులకు అందించేందుకు వాటిని నిలిపివేసినట్లు అంగీకరించింది.

నవంబరులోనూ ఇదే తంతు

నవంబరులోనూ ఇదే తంతు

గతేడాది ఒక్క నవంబరులోనే 37.16 లక్షల ఖాతాలను వాట్సప్ తీసివేసినట్లు నివేదిక చెబుతోంది. ఆ నెలలో 946 ఫిర్యాదులు రాగా.. 74 క్లెయిమ్‌ లకు సంస్థ స్పందించింది. వాటిలో 830 ఖాతాల నిషేధానికి సంబంధించినవి. మిగిలినవి మద్దతు, భద్రత వంటి వివిధ వర్గాలకు చెందినవి వర్గీకరించారు.

IT రూల్స్ 2021లో ఏముంది?

IT రూల్స్ 2021లో ఏముంది?

50 లక్షల కంటే ఎక్కువ వినియోగదారులు కలిగిన సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ ఫారంలకు కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 నిబంధనలు వర్తిస్తాయి. దీని ప్రకారం ఆయా సంస్థలు తప్పనిసరిగా నెలవారీ కంప్లయన్స్ నివేదికను ప్రచురించాల్సి ఉంటుంది.

అందులో కంపెనీలు స్వీకరించిన వినియోగదారుల ఫిర్యాదుల సమాచారం, వాటికి సంస్థ స్పందన తప్పనిసరిగా ఉండాలి. సామాజిక మాధ్యమాల వినియోగదారులు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించడానికి.. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను ఏర్పాటు చేసింది.

English summary

WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..? | WhatsApp blocked 75 lakhs accounts in last november and december

Whatsapp accounts blockage..
Story first published: Friday, February 3, 2023, 8:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X