For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: ఆ ప్రకటన వెనక్కి! స్మాల్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేట్లు యథాతథం

|

ఢిల్లీ: ఎన్ఎస్‌సీ, పీపీఎఫ్ సహా వివిధ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను తగ్గించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం స్పందించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి గాను ఈ వడ్డీ రేట్లను 1.1 శాతం వరకు తగ్గించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే నిర్మలమ్మ మాట్లాడుతూ.. స్మాల్ సేవింగ్స్ స్కీంపై వడ్డీ రేట్లు తగ్గించే ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంటోందన్నారు. దీనిని సవరించుకుంటున్నట్లు చెప్పారు.

2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి గాను వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల నుండి 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు నిన్న తెలిపింది. గత ఏడాది కాలంలో స్మాల్ సేవింగ్స్ స్కీం పైన వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన ఇది రెండోసారి. 2020-21 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 70 బేసిస్ పాయింట్ల నుండి 140 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. అయితే నిన్న తగ్గిస్తున్నట్లు చేసిన ప్రకటనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

Was an oversight: Government drops reduction in interest rates on small savings

స్మాల్ సేవింగ్స్ స్కీం పథకాలపై వడ్డీ రేట్లు 2020-21 ఆర్థిక సంవత్సరంలో చివరిసారి కొనసాగినట్లుగానే కొనసాగుతాయని నిర్మలమ్మ తెలిపారు. అంటే FY21లో మార్చి త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి.

English summary

గుడ్‌న్యూస్: ఆ ప్రకటన వెనక్కి! స్మాల్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేట్లు యథాతథం | Was an oversight: Government drops reduction in interest rates on small savings

The government is withdrawing an order that cut interest rates on small savings schemes, said Finance Minister Nirmala Sitharaman on Thursday, calling the announcement earlier as "oversight”.
Story first published: Thursday, April 1, 2021, 9:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X