విశాఖపట్నం: ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలోని లాల్‌గంజ్ వద్ద విశాఖ ఉక్కు కర్మాగారం సుమారు రూ.1680 కోట్లతో ఏర్పాటు చేసిన ఫోర్జ్డ్ రైల్ వీల్ ప్లాంట్ ఫోర్జింగ్ లైన్ హాట్ ట్రయల్స్ విజయవంతమైంది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. జర్మనీ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో ఏడాదికి లక్ష చక్రాల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఆదివారం ఉక్కు సీఎండీ పీకే రథ్, డైరెక్టర్లు, జర్మనీ ప్రతినిధిలు ఇండస్ట్రీని సందర్శించారు.

విశాఖ ప్లాంట్ చరిత్రలో ముందడుగు
ఇది విశాఖ ప్లాంట్ చరిత్రలో మరో ముందడుగు. ఇండియన్ రైల్వేస్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాయ్‌బరేలీలో నిర్మించిన ఫోర్జ్డ్ వీల్ ప్లాంటులో వీల్స్ ఉత్పత్తిని ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ సీఎండీ తొలి వీల్ ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించారు. మొదటి ఫోర్జ్డ్ వీల్‌ను పరిశీలించారు. త్వరలో పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సీఎండీ తెలిపారు. ఈ ఉత్పత్తులను రైల్వేకు సరఫరా చేస్తామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్ఎంఎస్ 4వ కాస్టర్‌లో రూపొందిస్తున్న 430 ఎంఎం రౌండ్స్ ద్వారా ఈ వీల్స్ తయారు చేస్తున్నట్లు తెలిపారు.

నిర్మాణానికి రూ.1,680 కోట్లు
స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్లాంట్ నిర్మాణానికి రూ.1,680 కోట్లు ఖర్చయింది. ఈ ప్లాంట్ ఏడాదికి లక్ష రైల్ వీల్స్ తయారీ సామర్ధ్యం కలిగి ఉంది. ఈ ఉత్పత్తులను భారత రైల్వేలకు సరఫరా చేస్తారు. ఈ వీల్స్ తయారీ ద్వారా దిగుమతులు తగ్గించుకోవచ్చు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి సరఫరా
లాల్‌గంజ్ ప్లాంట్‌కు రామెటీరియల్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి సరఫరా అవుతున్నాయి. వీటిని రైళ్లలో సరఫరా చేస్తున్నారు. ఈ ప్లాంట్ కోసం 50 ఎకరాలు కేటాయించారు. రైల్వేతో కుదిరిన అగ్రిమెంట్ మేరకు ఏడాదికి తొలుత 55,000 వీల్స్ ఇవ్వాలి. ఇది 1,00,000 సామర్థ్యం కలిగి ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications