For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిప్టోలో పెట్టుబడులపై నందన్ నీలేకని ఆసక్తికర వ్యాఖ్యలు

|

ఆధార్ ఆర్కిటెక్ట్ నందన్ నీలేకని క్రిప్టోకరెన్సీని సమర్థిస్తున్నారు. అంతేకాదు, బంగారం, రియల్ ఎస్టేట్‌తో పాటు క్రిప్టోలో కూడా కొంత పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. భారతదేశంలోను క్రిప్టో కరెన్సీని ఒక అసెట్ క్లాస్‌గా ఆమోదించాలన్నారు. ఒక‌వేళ నియంత్ర‌ణ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ భార‌త్‌లో రోజురోజుకు క్రిప్టో క‌రెన్సీని ఆమోదించే వారు పెరుగుతున్నట్లు గుర్తు చేశారు. బంగారాన్ని, భూమిని ఆస్తిగా భావిస్తే, కొంతమంది క్రిప్టో కరెన్సీని కూడా ఆస్తిగా భావిస్తారన్నారు.

బ్యాడ్-లాగా మార్చేసిన బీజేపీ, idea of GST: RIP: చిదంబరం 10 పాయింట్స్...బ్యాడ్-లాగా మార్చేసిన బీజేపీ, idea of GST: RIP: చిదంబరం 10 పాయింట్స్...

క్రిప్టో స్టోర్డ్ వ్యాల్యూ

క్రిప్టో స్టోర్డ్ వ్యాల్యూ

క్రిప్టో క‌రెన్సీ స్టోర్డ్ వాల్యూ అని, దానికి ట్రాన్సాక్షన్స్ సెన్స్ లేదని నందన్ నీలేకని అన్నారు. భార‌త్ ఇప్ప‌టికీ పేమెంట్ మోడ్‌గా క్రిప్టోను ఆమోదించలేదన్నారు. క్రిప్టో క‌రెన్సీలో అనిశ్చితి వ‌ల్ల, ఇంధ‌నాన్ని ధ్వంసం చేస్తున్నందున ప్ర‌భుత్వ క‌రెన్సీకి ప్ర‌త్యామ్నాయం కాలేదని చెప్పారు. క్రిప్టోను కేంద్రం చ‌ట్ట‌బ‌ద్ధం చేస్తే క్రిప్టో క‌రెన్సీ పెట్టుబ‌డిదారులు త‌మ సంప‌ద‌ను భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తారన్నారు.

డిజిటల్ రూపాయి

డిజిటల్ రూపాయి

మీరు క్రిప్టోను అసెట్‌గా భావిస్తే క్రిప్టో క‌రెన్సీని క‌లిగి ఉండేందుకు అనుమ‌తించాలన్నారు. ఒకరోజులో కోటి ట్రాన్సాక్షన్స్ జ‌రిపే యూపీఐ మాదిరిగా క్రిప్టో క‌రెన్సీ ఒక మీడియం లావాదేవీగా ఉండ‌దన్నారు. కానీ, క్రిప్టో క‌రెన్సీ అపార‌మైన పెట్టుబ‌డి అన్నారు. భార‌త నియంత్ర‌ణ అధికారులు కూడా సెంట్ర‌ల్ బ్యాంక్ డిజిట‌ల్ క‌రెన్సీ (సీబీడీసీ) ఏర్పాటు చేయాల‌న్నారు. మ‌న‌కు ఒక ప్రయివేటు స్టేబుల్ కాయిన్ అవ‌స‌ర‌మా, లేదా అనేది చెప్ప‌లేమన్నారు. ఒక డిజిట‌ల్ రూపాయి ఉండాలన్నారు.

ఆర్బీఐ తాజా ఆదేశాలు

ఆర్బీఐ తాజా ఆదేశాలు

2018లో దేశంలో క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పైన ఆర్బీఐ నిషేధం విధించింది. కానీ గత ఏడాది ఆర్బీఐ ఆదేశాల‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. కానీ, బ్యాంక‌ర్లు 2018 ఆర్బీఐ ఆదేశాల‌ను అమ‌లు చేయాలని నిర్ణయించాయి. దీంతో 2018లో తాము జారీ చేసిన ఆదేశాల‌ను అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆర్బీఐ తాజాగా స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది.

English summary

క్రిప్టోలో పెట్టుబడులపై నందన్ నీలేకని ఆసక్తికర వ్యాఖ్యలు | users can have some assets in crypto: Nandan Nilekani backs crypto

Aadhaar architect Nandan Nikelani has once again called for encouraging the use of cryptocurrencies as an asset class, to be bought and sold like a commodity amid reports of India relooking at regulating the market
Story first published: Tuesday, June 8, 2021, 11:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X