For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Citi Group: అదానీకి మరిన్ని కష్టాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న సిటీ గ్రూప్.. ఢమాల్..

|

Citi Group: అదానీ గ్రూప్ కు ఒకటి తర్వాత మరొక కష్టం వచ్చిపడుతోంది. సమస్యలను చిన్నగా చక్కపెడదాం అనుకుంటుంటే అవి పూడ్చలేని అగాధాలుగా మారుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఒక్కొక్కటిగా అదానీ సెక్యూరిటీలను స్వీకరించటం మానేస్తున్నాయి.

 బ్యాంకుల పరిశీలన..

బ్యాంకుల పరిశీలన..

అదానీ గ్రూప్ వ్యాపారాలపై అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేధికలను బ్యాంకులు పరిశీలించటం వేగవంతం చేశాయి. నిన్న ప్రఖ్యాత క్రెడిట్ సూయిస్ నిర్ణయం తీసుకోగా.. నేడు సిటీ గ్రూప్ ఇంక్ అదే దారిని ఎంచుకుంది. వెల్త్ ఆర్మ్ మార్జిన్ లోన్‌ల కోసం గౌతమ్ అదానీ గ్రూప్ ఆఫ్ ఫర్మ్‌ల సెక్యూరిటీలను తాకట్టుగా అంగీకరించడం ఆపివేసింది. అయితే దీనిపై అధికారికంగా బ్యాంక్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

పెరుగుతున్న చిక్కులతో..

పెరుగుతున్న చిక్కులతో..

అదానీ గ్రూప్ రోజురోజుకూ చిక్కుల్లోకి జారుకుంటున్న తరుణంలో అంతర్జాతీయ బ్యాంకులు ముందుగా అప్రమత్తం అవుతున్నాయి. క్రెడిట్ సూయిస్ ముందుగా అప్రమత్తం కావటంతో ఈ పరిణామాలు ప్రారంభమైనట్లు బ్లూమ్ బెర్గ్ ప్రకటించింది. అదానీ కంపెనీల ఆర్థిక ఆరోగ్య పరిస్థితిపై ప్రశ్నలు వెల్లువెత్తిన తరుణంలో గ్రూప్ బాండ్ ధరలు సైతం క్షీణించాయి.

అంతర్గత అప్రమత్తత..

అంతర్గత అప్రమత్తత..

బహిరంగంగా అంతర్జాతీయ బ్యాంకులు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ అంతర్గత మెమోల్లో స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. "అదానీ జారీ చేసిన అన్ని సెక్యూరిటీలకు" రుణ విలువను తక్షణమే అమలులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు బ్యాంక్ మెమోలో పేర్కొంది. ఇప్పటి వరకు అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల విలువ దాదాపు 92 బిలియన్ డాలర్ల మేర క్రాష్ అయ్యింది.

Credit Suisse..

Credit Suisse..

క్రెయిడ్ సూయిస్ వద్ద అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ విక్రయించిన నోట్లకు జీరో లెండింగ్ విలువను కేటాయించింది. ప్రస్తుతం ఇదే బాటలో సిటీ గ్రూప్ సైతం జాగ్రత్తను పాటిస్తోంది.

గురిపెట్టిన RBI..

గురిపెట్టిన RBI..

అదానీ గ్రూప్ వ్యవహారాలపై RBI దృష్టి సారించింది. దేశంలోని బ్యాంకులు అదానీ కంపెనీలకు ఎంత మేర అప్పులు ఇచ్చాయనే విషయాలను సేకరిస్తోంది. బ్యాంక్స్ ఎక్స్ పోజర్ గురించి సెంట్రల్ బ్యాంక్ ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పెద్ద బ్యాంకులను వీటికి సంబంధించిన వివరాలను సేకరించి వాటి వివరాలను పూర్తిగా తెలుసుకుంటోంది.

English summary

Citi Group: అదానీకి మరిన్ని కష్టాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న సిటీ గ్రూప్.. ఢమాల్.. | US based Citi Group stops magin loans on adani securities know details

US based Citi Group stops magin loans on adani securities know details
Story first published: Thursday, February 2, 2023, 11:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X