For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో ఇల్లు కొంటారా? ఎన్ని అందుబాటులో ఉన్నాయో తెలుసా?

|

హైదరాబాద్ లో ఇల్లు కొనాలని ఎంతో మంది కలలు కంటుంటారు. తమ బడ్జెట్ కు తగిన ఇల్లు ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతుంటారు. తెలిసిన వారిని సంప్రదిస్తారు. బ్రోకర్లను పట్టుకుంటారు. ఎలాగోలా ఇళ్ల ఆచూకీ పట్టేస్తారు. అయితే ఇల్లు కొనడం అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. దీనికి జీవిత కాలం సంపాదించినా మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేదా జీవిత కాలం ఇల్లు కోసం తీసుకునే ఇంటికి ఈఎం ఐ చెల్లించాలి. అందుకే ఇల్లు కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తమకు భరోసాను ఇచ్చే కంపెనీ వద్దనే ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తారు చాలా మంది. అయితే కొంత మంది ఇళ్ల లభ్యత లేదు అంటూ ధరలను పెంచే అవకాశం ఉంటుంది. మనకు ఎక్కువ పరిజ్ఞానం ఉండదు కాబట్టి వారు చెప్పే మాటలను నమ్మ వలసి వస్తుంది. ఇలా కాకుండా కొన్ని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థలు ఇళ్ల డిమాండ్, సప్లై కి సంభందించిన వివరాలు అందిస్తుంటాయి. వాటి ఆధారంగా ఏ ప్రాంతంలో ఇళ్ల లభ్యత ఉన్నది, ఎక్కడ ధరలు ఎలా ఉన్నాయన్న విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి కొనుగోలు నిర్ణయం తీసుకోవచ్చు.

ఆరోగ్యశ్రీకి అర్హతలు ఇవే: కారు, భూమి, ఇల్లు, ఆదాయం ఎంత ఉండాలంటేఆరోగ్యశ్రీకి అర్హతలు ఇవే: కారు, భూమి, ఇల్లు, ఆదాయం ఎంత ఉండాలంటే

హైదరాబాద్ లో 23,890 ఇల్లు

హైదరాబాద్ లో 23,890 ఇల్లు

* ఏయే నగరంలో ఎన్ని ఇల్లు అమ్ముడు పోకుండా ఉన్నాయో ఇటీవలనేఅనరాక్ అనే ప్రాపెర్టీ కన్సల్టెంట్ నివేదిక విడుదల చేసింది.

* దీని ప్రకారం హైదరాబాద్ లో అమ్ముడు పోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య 23,890 యూనిట్లు గా ఉంది.

ఈ ఏడాది సెప్టెంబర్ తో ముగిసిన మూడో త్రైమాసికం వరకు ఇన్ని ఇళ్లు ఉన్నట్టు తేల్చింది. పేరున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టుల ఆధారంగా ఇళ్ల నిల్వలను లెక్కించే అవకాశం ఉంటుంది.

* ఈ ఇళ్లను విక్రయించాలంటే కనీసం 16 నెలలైనా పడుతుందని భావిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్ లోనే తక్కువగా ఇళ్ల నిల్వలు ఉన్నట్టు అనరాక్ చెబుతోంది.

దేశవ్యాప్తంగా ఇదీ పరిస్థితి..

దేశవ్యాప్తంగా ఇదీ పరిస్థితి..

* ఒక్క హైదరాబాద్ లోనే కాదు దేశంలోని ఏడూ ప్రధాన నగరాల్లో ఇళ్ల నిల్వలు భారీగా ఉన్నాయి.

* ఢిల్లీ - ఎన్సీఆర్, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాల్లో కలిపి సెప్టెంబర్ చివరి నాటికీ 6.56 లక్షల ఇల్లు అమ్మకానికి ఉన్నాయి.

* నగరాన్ని బట్టి ఈ ఇళ్లను విక్రయించడానికి ఎంత కాలం పడుతుందో కూడా అనరాక్ అంచనా వేసింది. బెంగళూరు లో ఉన్న ఇళ్లను విక్రయించడానికి 15 నెలల సమయం పట్టడానికి అవకాశం ఉండనుండగా.. ఢిల్లీ ఎన్సీఆర్ లో ఇళ్లను విక్రయించేందుకు 44 నాలుగు నెలలు తీసుకోనుంది.

హైదరాబాద్ వైపు..

హైదరాబాద్ వైపు..

* వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంపన్నులు హైదరాబాద్ లో ఇళ్లను కొనుగోలు చేయడానికి అధికంగా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఇక్కడి వాతావరణం చాలా మందికి నచ్చుతోంది. పలు నగరాలతో పోల్చింతే ఇళ్ల ధరలు చాలా తక్కువ. ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, బెంగాళూరు వంటి నగరాలతో పోల్చితే ధరలు చాలా తక్కువ. ఐటీ కంపెనీలకు హైద్రాబాద్ కేంద్రంగా ఉంది. ఇక్కడ మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. రాకపోకలు సాగించడానికి మంచి రవాణా సదుపాయాలున్నాయి. ఎంటర్ టైన్మెంట్ కు కొదువ లేదు. కాబట్టి అనేక మంది హైదరాబాద్ లో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు.

English summary

హైదరాబాద్‌లో ఇల్లు కొంటారా? ఎన్ని అందుబాటులో ఉన్నాయో తెలుసా? | Unsold housing inventory in hyderabad till end of september quarter

Unsold housing Inventory in hyderabad till end of september quarter of this year approx. 23,890 units Anarock said. Many people want to buy home in hyderabad city. Before buying a home there is a need to now the supply of the homes in the city. Anarock recently revealed the unsold housing inventory in hyderabad.
Story first published: Monday, November 18, 2019, 14:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X