For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత ఆర్మీ చేతికి అత్యాధునికమైన ఏకే 203 రైఫిల్స్: అమేథీలో తయారీ

|

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత పర్యటనకు రానున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి రష్యా తయారు చేస్తోన్న ఏకే 203 రైపిళ్లను కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది. దీనికోసం ఉద్దేశించిన ఒప్పందంపై రెండు దేశాలకు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి. రష్యాతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఉత్తర ప్రదేశ్‌ అమేథీ సమీపంలో గల కోర్వాలో ఉన్న యూనిట్‌లో ఈ రైఫిళ్లు తయారు కానున్నాయి.

5న భారత్‌కు పుతిన్..

5న భారత్‌కు పుతిన్..

వచ్చేనెల 5వ తేదీన వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరే ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన సాగుతుంది. ప్రధాని మోడీతో అత్యున్నత సమావేశంలో పాల్గొంటారు. ఆసియా పసిఫిక్ రీజియన్, పసిఫిక్-హిందూ మహాసముద్రం మధ్యన ఉండే దక్షిణ సముద్రంపై పట్టు సాధించడానికి చైనా సాగిస్తోన్న ప్రయత్నాలు, విసాల సరళీకరణ.. ద్వైపాక్షిక ఒప్పందాలు వంటి జాతీయ, అంతర్జాతీయ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.

కోర్వా వద్ద యూనిట్..

కోర్వా వద్ద యూనిట్..

అమేథీ సమీపంలోని కోర్వా వద్ద ఏకే రకానికి చెందిన శక్తిమంతమైన రైఫిళ్ల తయారీ యూనిట్‌ను చాలా సంవత్సరాల కిందటే నెలకొల్పింది రష్యా. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా రష్యా దీన్ని నెలకొల్పింది. ఈ యూనిట్‌లోనే రష్యా అవ్టోమాట్ కలష్నికోవ్ రైపిళ్లను తయారు చేసింది. ఏకే 47 సహా ఆ సిరీస్‌కు చెందిన అన్ని రకాల రైఫిళ్లు అమేథీ యూనిట్‌లోనే తయారవుతున్నాయి. ఈ యూనిట్‌ను మరింత విస్తరించడంతో పాటు ప్రొడక్షన్ కెపాసిటీని అధికం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

శక్తిమంతమైన ఏకే 203 అస్సాల్ట్ రైఫిల్స్..

శక్తిమంతమైన ఏకే 203 అస్సాల్ట్ రైఫిల్స్..

ఏకే 47 సిరీస్‌లో రష్యా కొత్తగా అభివృద్ధి చేసిన ఏకే 203 అసాల్ట్ రకానికి చెందిన రైఫిళ్లు ఈ యూనిట్‌లో తయారవుతాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఆరు లక్షల ఏకే 203 అసాల్ట్ రైఫిళ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అవసరమైన ఒప్పందాన్ని- పుతిన్ పర్యటన సందర్భంగా కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందాల విలువ 5,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ఏడున్నర లక్షల ఏకే 203 రైఫిళ్లను రష్యా.. భారత ఆర్మీకి అప్పగించాల్సి ఉంటుంది.

 300 మీటర్ల రేంజ్‌లో..

300 మీటర్ల రేంజ్‌లో..

7.62 X 39 ఎంఎం క్యాలిబర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందీ ఏకే 203. ప్రస్తుతం సైన్యం ఇన్సాస్ రైపిళ్లను వినియోగిస్తోంది. మూడు దశాబ్దాల కిందటి నుంచి అవే అందుబాటులో ఉంటున్నాయి. వాటి స్థానంలో ఏకే 203ని అందుబాటులోకి తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 300 మీటర్ల రేంజ్‌లో గల లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. ఇన్సాస్ రైఫిళ్లతో పోల్చుకుంటే ఇది తేలికపాటిది. వినియోగించడం కూడా సులువే.

రూ. 5,000 కోట్లతో..

రూ. 5,000 కోట్లతో..

ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అడ్వాన్స్డ్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ అండ్ మ్యూనిటిషన్స్ లిమిటెడ్, రోసొబోరొన్ ఎక్స్‌పోర్ట్స్, కలష్నికోవ్ మధ్య ఈ మేరకు ఒప్పందాలు కుదరనున్నాయి. రెండు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు దీనిపై సంతకాలు చేస్తారు. ఆరు లక్షల ఏకే 203 రైఫిళ్లు అమేథీ యూనిట్‌లో తయారవుతాయి. వాటిని కేంద్ర రక్షణ బలగాలకు అందజేస్తారు. దీనికోసం కేంద్రం రూ.5000 కోట్లను ఖర్చు చేస్తుంది.

English summary

భారత ఆర్మీ చేతికి అత్యాధునికమైన ఏకే 203 రైఫిల్స్: అమేథీలో తయారీ | Union Govt approves to manufacture more than 6 lakh AK-203 assault rifles in Korwa, Amethi

The Centre has approved the plans for the production of over five lakh AK-203 assault rifles at Korwa, Amethi in Uttar Pradesh, according to a government official.
Story first published: Saturday, December 4, 2021, 12:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X