For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆగస్ట్‌లో నిరుద్యోగిత రేటు మళ్లీ పెరిగింది, 1.9 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి

|

ఆగస్ట్ నెలలో భారతదేశంలో నిరుద్యోగిత రేటు మళ్లీ పెరిగింది. జూలై నెలలో 7 శాతానికి తగ్గిన నిరుద్యోగిత రేటు గత నెలలో 8.3 శాతానికి పెరగడం గమనార్హం. ఈ మేరకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) వెల్లడించింది. సంఘటిత, అసంఘటిత రంగంలో ఆగస్ట్ నెలలో 1.9 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అదే సమయంలో ఉద్యోగిత రేటు కూడా క్షీణించింది. జూలై నెలలో 37.5 శాతంగా ఉన్న ఉద్యోగిత రేటు ఆగస్ట్ నెలకు 37.2 శాతానికి పడిపోయింది. ఎంప్లాయిమెంట్ 399.7 మిలియన్ల నుండి 397.8 మిలియన్లకు పడిపోయింది.

కరోనా కారణంగా గత ఏడాది (2020) మార్చి నెలలో లాక్ డౌన్ విధించడంతో ఆ సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి. వేతనాల కోత కనిపించింది. జూలై, ఆగస్ట్ నుండి ఆర్థిక కార్యకలాపాలు కోలుకొని, ఉద్యోగాలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. సెకండ్ వేవ్ ముగిశాక, థర్డ్ వేవ్ ఆందోళనలు వినిపిస్తున్నాయి.

 Unemployment Rate Touches 8.3 Percent in August

CMIE నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు...

- ఆగస్ట్ నెలలో వ్యవసాయంలో ఉద్యోగాలు 8.7 మిలియన్లకు పడిపోయాయి.

- అదే సమయంలో నాన్-ఫామ్ జాబ్స్ 6.8 మిలియన్లకు పెరిగాయి.

- బిజినెస్ రంగంలో ఉద్యోగాలు దాదాపు 4 మిలియన్లకు పెరిగాయి.

- చిన్న వ్యాపారులు, డెయిలి వేజ్ లేబర్స్ 2.1 మిలియన్లకు పెరిగారు.

- శాలరైడ్ జాబ్స్ ఆగస్ట్ నెలలో స్వల్పంగా 0.7 మిలియన్లు పెరిగాయి.

- ఆగస్ట్ నెలలో సేవా రంగంలో కొత్తగా 8.5 మిలియన్ల ఉద్యోగాలు వచ్చాయి.

- ఆగస్ట్ నెలలో రిటైల్ ట్రేడ్ మంచి వృద్ధి నమోదు చేసింది.

ఇండస్ట్రియల్ రంగంలో ఉద్యోగాలు జూలై 2021లో కంటే ఆగస్ట్ నెలలో 2.5 మిలియన్లు తగ్గాయి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 0.94 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. CMIE నివేదిక ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కరోనా కారణంగా శాశ్వతంగా 10 మిలియన్ ఉద్యోగాలను కోల్పోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపై కూడా ప్రభావం పడింది.

English summary

ఆగస్ట్‌లో నిరుద్యోగిత రేటు మళ్లీ పెరిగింది, 1.9 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి | Unemployment Rate Touches 8.3 Percent in August

The unemployment rate in India bounced back in August and touched 8.3% compared to 7% in July. According to the Center for Monitoring Indian Economy, over 1.9 million people from both the formal and informal sectors lost their jobs in August.
Story first published: Friday, September 10, 2021, 21:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X