For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT News: ఐటీ ఉద్యోగులకు జాక్ పాట్.. UAE రెడ్ కార్పెట్ స్వాగతం..!

|

IT News: క్రూడ్ ఆయిల్‌పై ఆధారపడిన దేశాలు ప్రస్తుతం ఇతర వాణిజ్యం, ఆదాయ మార్గాలపై దృష్టి పెడుతున్నాయి. ఇందులో అగ్రగామిగా కొనసాగుతున్న యూఏఈ ఇప్పటికే ఫార్మా నుంచి ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల వరకు వివిధ రంగాల కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఈ దేశం కన్ను ఐటీ రంగంపై కూడా పడింది. ఇందులో భాగంగా కొత్త ప్రణాళికను సైతం ప్రకటించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.

ఫాస్ట్ ట్రాక్ బిజినెస్ లైసెన్స్‌లు, ఉద్యోగులకు దీర్ఘకాలిక పౌరసత్వాన్ని అందించడం ద్వారా ఆసియా, యూరప్‌లోని టెక్ కంపెనీలను ఆకర్షించాలని UAE యోచిస్తోంది. ఇది ఐటీ కంపెనీలపై భారీ ప్రభావాన్ని చూపుతుందని తెలుస్తోంది. సాధారణంగా UAE ఒక రంగంలో వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటే.. అందుకోసం ఎంతటికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటుందని ఏక్కడి రియల్ ఎస్టేట్ మనకు చెప్పకనే చెబుతుంది.

 డిజిటల్ కంపెనీలు.. గోల్డెన్ వీసా

డిజిటల్ కంపెనీలు.. గోల్డెన్ వీసా

జూలైలో ప్రారంభించిన కార్యక్రమం ద్వారా 300 కంటే ఎక్కువ డిజిటల్ కంపెనీలను ఆకర్షించాలని UAE లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 40 శాతం టార్గెట్ కంపెనీలు ప్రస్తుతం UAEలో తమ కార్యాలయాన్ని ప్రారంభించే ప్రక్రియలో ఉన్నాయి. పైగా ఈ డిజిటల్ కంపెనీల ఉద్యోగులకు 10 ఏళ్ల పాటు గోల్డెన్ వీసా, ఉండటానికి స్థలం, పిల్లలకు పాఠశాల వంటి సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఆకర్షనీయమైన వీసా విధానం..

ఆకర్షనీయమైన వీసా విధానం..

కరోనా పరిమితుల సడలిపులతో వీసా, పెట్టుబడి విధానాలను UAE బ్యాంకర్లు, కమోడిటీ వ్యాపారులు, హెడ్జ్ ఫండ్ మేనేజర్‌లను ఎక్కువగా ఆకర్షించింది. దీంతో దుబాయ్ రియల్ ఎస్టేట్ ధరలు 12 నెలల్లోనే 70 శాతం వరకు పెరిగాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు దుబాయ్, అబుదాబిలో ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. దీంతో సౌదీ అరేబియా సైతం పోటాపోటీగా అనేక ఆఫర్లను ప్రకటిస్తూ కంపెనీలను ఆకర్షించే పనిలో పడింది.

భారతీయులకు జాక్‌పాట్.. విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడే తమిళనాడు, కేరళాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన టెక్కీలకు ఇదొక జాక్‌పాట్ అని చెప్పుకోవాలి. పైగా ప్రస్తుతం యూఏఈలో టెక్ ఉద్యోగాల సంఖ్య సైతం చాలా వరకు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా భారత టెక్కీలకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్నందున వారు గల్ఫ్ దేశాలు అందిస్తున్న ఆఫర్ ద్వారా భారీగా ఆదాయాన్ని సంపాదించుకునేందుకు మార్గం సుగమం అయిందని చెప్పుకోవాలి. ఇకపై చాలా మంది దుబాయ్ కలలు నెరవేరనున్నాయి.

భారతీయులకు జాక్‌పాట్.. విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడే తమిళనాడు, కేరళాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన టెక్కీలకు ఇదొక జాక్‌పాట్ అని చెప్పుకోవాలి. పైగా ప్రస్తుతం యూఏఈలో టెక్ ఉద్యోగాల సంఖ్య సైతం చాలా వరకు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా భారత టెక్కీలకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్నందున వారు గల్ఫ్ దేశాలు అందిస్తున్న ఆఫర్ ద్వారా భారీగా ఆదాయాన్ని సంపాదించుకునేందుకు మార్గం సుగమం అయిందని చెప్పుకోవాలి. ఇకపై చాలా మంది దుబాయ్ కలలు నెరవేరనున్నాయి.

విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడే తమిళనాడు, కేరళాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన టెక్కీలకు ఇదొక జాక్‌పాట్ అని చెప్పుకోవాలి. పైగా ప్రస్తుతం యూఏఈలో టెక్ ఉద్యోగాల సంఖ్య సైతం చాలా వరకు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా భారత టెక్కీలకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్నందున వారు గల్ఫ్ దేశాలు అందిస్తున్న ఆఫర్ ద్వారా భారీగా ఆదాయాన్ని సంపాదించుకునేందుకు మార్గం సుగమం అయిందని చెప్పుకోవాలి. ఇకపై చాలా మంది దుబాయ్ కలలు నెరవేరనున్నాయి.

Read more about: uae it jobs tech news dubai
English summary

IT News: ఐటీ ఉద్యోగులకు జాక్ పాట్.. UAE రెడ్ కార్పెట్ స్వాగతం..! | UAE Attracting Tech Companies With Golden Visa, Fast Licences Jackpot to indian it employees

UAE Attracting Tech Companies With Golden Visa, Fast Licences Jackpot to indian it employees
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X