For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

gold hallmark: హాల్ మార్కింగ్ వద్దంటూ సమ్మె, మరింత సమయం

|

గోల్డ్ హాల్ మార్కింగ్ పైన వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. బంగారు ఆభరణాలకు తప్పనిసరిగా హాల్ మార్కింగ్ వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బంగారం వ్యాపారులు గళం విప్పుతున్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 23వ తేదీన ఒకరోజు పాటు సమ్మె పాటించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆలిండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్(GJC) ప్రకటించింది. రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు చెందిన 350 సంఘాలు, సమాఖ్యలు వీరికి మద్దతు పలుకుతున్నాయి.

బంగారం స్వచ్ఛతకు గుర్తింపుగా హాల్‌మార్కింగ్ అమలు చేయాలని బులియన్ వ్యాపారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో నకిలీ బంగారు ఆభరణాల అమ్మకాలను నియంత్రించేందుకు కేంద్రం ఈ ఏడాది జూన్ 16వ తేదీన హాల్ మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, తక్షణమే నిర్ణయంలో మార్పు కావాలని GJC డిమాండ్ చేస్తోంది. హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఏకపక్ష నిర్ణయమని, దీని అమలుకు వ్యతిరేకంగా ఒకరోజు శాంతియుత నిరసన, సింబాలిక్ సమ్మె చేపడుతున్నట్లు GJC మాజీ చైర్మన్ తెలిపారు.

Tussle over gold hallmarking continues, jewelers adamant to go on a symbolic strike tomorrow

ప్రభుత్వం నియమించిన కమిటీలో స్వర్ణకారుల ప్రతినిధి, దానభాయ్ జ్యువెల్లర్స్ గ్రూప్ డైరెక్టర్‌గా బంగారం స్వచ్ఛతకు గుర్తింపుగా హాల్ మార్కింగ్‌ను అమలు చేయాలని బులియన్ వ్యాపారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు, హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో బంగారం స్వచ్ఛతకు సంబంధం లేదని, హాల్ మార్కింగ్ పొందడానికి 5 రోజుల నుండి 10 రోజుల సమయం పడుతోందని, దీంతో వ్యాపారం కోల్పోవాల్సి వస్తుందని ఆభరణాల వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పరిశ్రమలోని అన్ని సంస్థలు సంయుక్తంగా హాల్ మార్కింగ్ పైన నేషనల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాయి.

సమ్మె పిలుపు పైన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(IBS) స్పందించింది. సమ్మె విరమణ అంశాన్ని పరిశీలించాలని కోరింది. దాదాపు అన్ని అసోసియేషన్లు కొత్త విధానాన్ని ఆహ్వానిస్తున్నాయని, కొన్ని సంస్థలు మాత్రం వ్యతిరేకించడం సరికాదన్నారు. హాల్ మార్కింగ్ నిబంధనలు అమలు చేసేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఇస్తామని, ఆ తర్వాత కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది.

English summary

gold hallmark: హాల్ మార్కింగ్ వద్దంటూ సమ్మె, మరింత సమయం | Tussle over gold hallmarking continues, jewelers adamant to go on a symbolic strike tomorrow

The tussle over gold hallmarking continues, jewelers adamant to go on a symbolic strike on August 23.
Story first published: Sunday, August 22, 2021, 17:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X