For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Trump India tour: ట్రంప్ పక్కా ప్లాన్, ఆర్థిక అంశాల కంటే అదే ప్రాధాన్యమా?

|

వస్తువులు, సేవలపరంగా అమెరికాకు భారత్ ఎనిమిదో అతిపెద్ద భాగస్వామి. అమెరికా ఉత్పత్తుల దిగుమతిలో చైనా 14.6 శాతం, ఈయూ 10.2 శాతంగా ఉండగా, భారత్ 6.3 శాతంతో మూడో స్థానంలో ఉంది. భారత్ మొత్తం ఎగుమతుల్లో 16 శాతం అమెరికా మార్కెట్‌కు వెళ్తాయి. 17.8 శాతంతో ఐరోపా సమాఖ్య తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.

ట్రంప్ పర్యటన: అమెరికా-భారత్ వాణిజ్య కథనాలు

5 ఏళ్లలో అమెరికాకు ఎగుమతులు

5 ఏళ్లలో అమెరికాకు ఎగుమతులు

గత అయిదేళ్లలో భారత్ నుండి అమెరికాకు ఎగుమతులు ఇలా ఉన్నాయి. 2015లో 4,478.27 కోట్ల డాలర్లు, 2016లో 4,602.42 కోట్ల డాలర్లు, 2017లో 4,854.97 కోట్ల డాలర్లు, 2018లో 5,434.93 కోట్ల డాలర్లు, 2019లో 5,766.55 కోట్ల డాలర్లుగా ఉంది.

5 ఏళ్లలో అమెరికా నుండి దిగుమతులు

5 ఏళ్లలో అమెరికా నుండి దిగుమతులు

గత అయిదేళ్లలో అమెరికా నుండి భారత్‌కు దిగుమతులు ఇలా ఉన్నాయి. 2015లో 2,145.29 కోట్ల డాలర్లు, 2016లో 2,164.72 కోట్ల డాలర్లు, 2017లో 2,564.83 కోట్ల డాలర్లు, 2018లో 3,350.28 కోట్ల డాలర్లు, 2019లో 3,440.96 కోట్ల డాలర్లుగా ఉంది.

ట్రంప్ పర్యటనతో ప్రయోజనం లేదా..

ట్రంప్ పర్యటనతో ప్రయోజనం లేదా..

ట్రంప్ సోమవారం భారత్ రానున్నారు. మంగళవారం తిరిగి అమెరికా పయనమవుతారు. ఈ రెండు రోజుల పర్యటనపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించింది. అన్ని ఏర్పాట్లు చేసింది. ట్రంప్ భారత్ పర్యటన వల్ల అమెరికాకే తప్ప భారత్‌కు ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదనేది విపక్షాల మాట.

ఇరువైపులా ప్రయోజనాలు...

ఇరువైపులా ప్రయోజనాలు...

అయితే ఈ పర్యటనతో రెండు దేశాలకు కూడా ప్రయోజనాలు ఉంటాయని వాణిజ్య నిపుణులు, అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆసియాలో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ సహకారం అమెరికాకు అవసరమని అంటున్నారు. ప్రస్తుతం భారత్ తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల్లో చైనా తర్వాత రెండోదిగా ఎదుగుతోంది. అంతర్జాతీయ అంశాల్లో అమెరికా సహకారం భారత్‌కు ప్రయోజనం కలిగిస్తుందని చెబుతున్నారు.

ఆర్థికం కంటే.. ట్రంప్ ప్లాన్

ఆర్థికం కంటే.. ట్రంప్ ప్లాన్

డొనాల్డ్ ట్రంప్ పర్యటన వెనుక వాణిజ్య డీల్స్ కంటే భారత్‌తో వ్యక్తిగత సంబంధాలు మరింత గట్టిగా చెప్పేందుకేనని అంటున్నారు. ఈ ఏడాది చివరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల మద్దతు కూడగట్టేందుకూ, వాణిజ్యపరంగా భారత్‌తో మరిన్ని డీల్స్ కుదుర్చుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా భారతీయుల మద్దతు కోసమని చెబుతున్నారు.

English summary

Trump India tour: ట్రంప్ పక్కా ప్లాన్, ఆర్థిక అంశాల కంటే అదే ప్రాధాన్యమా? | Trump India tour: Personal ties over Economic issues

US president Donald Trump's first visit to India next week will do more to highlight his personal diplomacy with Indian Prime Minister Narendra Modi than it will to address tensions over economic issues.
Story first published: Sunday, February 23, 2020, 12:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X