For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెట్ టాప్ బాక్స్ కస్టమర్లకు శుభవార్త, బాక్స్ మార్చకుండానే DTH ఆపరేటర్‌ను మార్చుకోవచ్చు!

|

టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఈ రోజు (ఏప్రిల్ 13) సెట్ టాప్ బాక్స్ ఇంటర్ఆపరేటబులిటీపై సిఫార్సులను విడుదల చేసింది. ప్రస్తుతం సెట్ టాప్ బాక్సులను వేర్వేరు సర్వీస్ ప్రొవైడర్లకు మార్చుకోలేని పరిస్థితి. కొన్నేళ్ల క్రితం మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (MNP) తెలిసిందే. సెట్ టాప్ బాక్స్ విషయంలోను దానిని అమలు చేసేందుకు కొంతకాలంగా ట్రాయ్ అందరీతో చర్చించింది. తాజాగా, సిఫార్సులు విడుదల చేసింది.

LIC ప్రీమియం చెల్లింపుదారులకు భారీ ఊరట, గడువు పొడిగింపుLIC ప్రీమియం చెల్లింపుదారులకు భారీ ఊరట, గడువు పొడిగింపు

MNP వలె సెట్ టాప్ బాక్స్

MNP వలె సెట్ టాప్ బాక్స్

ఒక మొబైల్ యూజర్లు మరో నెట్ వర్క్‌కు మారాలంటే MNP వెసులుబాటు ఉంది. అంతకుముందు నెట్ వర్క్ మారాలంటే ఫోన్ నెంబర్ కూడా మారేది. కానీ MNP అందుబాటులోకి వచ్చాక మొబైల్ నెంబర్ మారకుండానే నెట్ వర్క్ మార్చుకునే వెసులుబాటు దొరికింది. ఇప్పుడు DTH ఆపరేటర్‌ను కూడా ఇలా మార్చే వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం మీరు ఏ సెట్ టాప్ బాక్స్ తీసుకుంటే అదే ఉపయోగించాలి. కంపెనీ మారాలంటే కొత్తది తీసుకోవాల్సిందే.

సెట్ టాప్ బాక్సులు మార్చకుండా

సెట్ టాప్ బాక్సులు మార్చకుండా

దీనికి ట్రాయ్ పరిష్కార మార్గాన్ని తీసుకు రావాలని భావించింది. కస్టమర్లకు అందించే సెట్ టాప్ బాక్సులు ఇంటర్ఆపరేటబులిటీగా ఉండాలని ట్రాయ్ సూచించింది. కస్టమర్ ఏ సెట్ టాప్ బాక్స్ కలిగి ఉన్నప్పటికీ.. అది కేవలం ఒక ఆపరేటర్‌కు మాత్రమే పరిమితం కాకూడదు. అంటే కస్టమర్ ఆపరేటర్‌ను మార్చాలనుకుంటే సెట్ టాప్ బాక్స్ మార్చాల్సిన అవసరం లేదు. ఇందుకు తగినట్లు సెట్ టాప్ బాక్సులు ఉండాలని ట్రాయ్ సూచించింది.

ఓపెన్ హౌస్ డిస్కషన్స్..

ఓపెన్ హౌస్ డిస్కషన్స్..

ట్రాయ్ 11 నవంబర్ 2019న సెట్ టాప్ బాక్స్ ఇంటర్ఆపరేటబులిటీకి సంబంధించి కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. స్టేక్ హోల్డర్స్ నుండి సూచనలు, సలహాలు తీసుకున్నది. ఆ తర్వాత 29 జనవరి 2020న ఓపెన్ హౌస్ డిస్కషన్స్ జరిగాయి. ఆ తర్వాత ట్రాయ్ ట్రాయ్ సిఫార్సులు ఖరారు చేసి, విడుదల చేసింది.

సంబంధిత శాఖకు సూచన

సంబంధిత శాఖకు సూచన

సెట్ టాప్ బాక్స్ ఇంటర్ఆపరేటబులిటీకి వీలు కల్పించేలా ఇండియా శాటిలైట్ టీవీ ఆపరేటర్ల నియమనిబంధనల్లో అవసరమైతే సవరణలు చేయాలని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖను ట్రాయ్ కోరింది. ఇంటర్ఆపరేటబులిటీకి వీలు కల్పించే కొత్త సెట్ టాప్ బాక్సులు రావడానికి ఎక్కువ రోజులు సమయం పట్టదని తెలిపింది.

లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఇంటర్ఆపరేటబులిటీ

లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఇంటర్ఆపరేటబులిటీ

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తివేత అనంతరం ఇంటర్ఆపరేటబులిటీ నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది కస్టమర్లకు ఎంతో ఊరట కలిగించే వార్త. ఇదివరకు కొత్త స్లాబ్స్ ద్వారా కస్టమర్లు తాము చూడాలనుకునే ఛానళ్లను ఎంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు సెట్ టాప్ బాక్స్ ఇంటర్ఆపరేటబులిటీ అవకాశం కల్పిస్తోంది.

ట్రాయ్ రికమండేషన్స్

ట్రాయ్ రికమండేషన్స్

- అన్ని సెట్ టాప్ బాక్సులు కూడా కచ్చితంగా టెక్నికల్‌గా ఇంటర్‌ఆపరేటబులిటీ కలిగి ఉండాలి.

- సార్వత్రిక సెట్ టాప్ బాక్సుల విషయంలో కొన్ని సాంకేతిక, వాణిజ్యపరమైన అవరోధాలు ఉన్నాయి. ఇంటర్ఆపరేటబులిటీ డీటీహెచ్ కేబుల్ సెగ్మెంట్ విభాగంలో నిర్ధారిస్తారు.

- సెట్ టాప్ బాక్సులు మార్చుకోకుండానే డీటీహెచ్ ఆపరేటర్లను మార్చుకునేలా నిబంధనలు రూపొందించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సూచించింది.

- ఈ ప్రక్రియ అమలులో సమన్వయానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ శాఖ, ట్రాయ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, టీవీలు ఉత్పత్తి చేసే సంస్థలతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది.

- అన్ని డిజిటల్ టీవీలు, యూఎస్‌బీ పోర్టుకు సపోర్ట్ చేయాలని, కేబుల్, శాటిలైట్ సిగ్నళ్లు స్వీకరించగలిగేలా చేయాలని సూచించింది.

English summary

సెట్ టాప్ బాక్స్ కస్టమర్లకు శుభవార్త, బాక్స్ మార్చకుండానే DTH ఆపరేటర్‌ను మార్చుకోవచ్చు! | TRAI releases recommendations on interoperability of set top boxes today

The telecom regulatory authority of India (TRAI) has today released recommendations on interoperability of set-top box for digital TV broadcasting services.
Story first published: Monday, April 13, 2020, 13:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X