For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీవీ వినియోగదారులకు శుభవార్త, సెట్ టాప్ బాక్స్ మార్చకుండానే..

|

డీటీహెచ్ సెట్ టాప్ బాక్స్ వినియోగదారులకు శుభవార్త! త్వరలో సెట్ టాప్ బాక్స్ మార్చకుండానే డీటీహెచ్ ఆపరేటర్లను మార్చుకునేందుకు వీలు కలగనుంది. ఈ మేరకు శనివారం భారత్ టెలికం నియంత్రణ ప్రాధికారత సంస్థ (TRAI) పలు సిఫార్సులు జారీ చేసింది. సెట్ టాప్ బాక్సులను పరస్పరం మార్చుకునేందుక ుచర్యలు చేపట్టాలని ఆయా సంస్థలకు సూచించింది.

లాక్‌డౌన్ తర్వాత ఈ రంగాల దూకుడు, వీటికి చాలా టైమ్: ఉద్యోగాలపై ప్రభావంలాక్‌డౌన్ తర్వాత ఈ రంగాల దూకుడు, వీటికి చాలా టైమ్: ఉద్యోగాలపై ప్రభావం

సెట్ టాప్ బాక్స్ మార్చే అవసరం లేదు

సెట్ టాప్ బాక్స్ మార్చే అవసరం లేదు

DTH సంస్థలు తమ కస్టమర్లకు ఇచ్చే సెట్‌టాప్‌ బాక్సులు ఒక ఆపరేటర్ నుంచి వేరొక ఆపరేటర్‌కు మారినప్పటికీ ఉపయోగపడేలా ఉండాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) స్పష్టం చేసింది. ఇలాంటి బాక్సులనే కస్టమర్లకు ఇవ్వాలని కంపెనీలను ఆదేశించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సూచించింది. కస్టమర్ ఆపరేటర్‌ను మార్చాలని భావించినా (డీటీహెచ్‌ పోర్టబిలిటీ) సెట్‌టాప్‌ బాక్సు మాత్రం మార్చే అవసరం లేదు.

ఆరు నెలల గడువు

ఆరు నెలల గడువు

ఈ సెట్ టాప్ బాక్సులు USB ఆధారిత కనెక్షన్‌తో పని చేసేలా ఉండాలని ట్రాయ్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ మార్గదర్శకాలు సవరించాలని ట్రాయ్ సూచించింది. ఈ మార్పులను అమలు చేసేందుకు DTH కంపెనీలకు ఆరు నెలల గడువు ఇవ్వాలని పేర్కొంది. అన్ని డిజిటల్ టీవీలు, యూఎస్‌బీ పోర్ట్‌కు సపోర్ట్ చేయాలని, కేబుల్, శాటిలైట్ సిగ్నల్స్ స్వీకరించగలిగేలా తయారు చేయాలని సూచించింది.

సమన్వయ కమిటీ

సమన్వయ కమిటీ

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాయ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BSI), టీవీ ఉత్పత్తిదారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖను కోరింది. ప్రతిపాదిత ప్రమాణాలను డీటీహెచ్, కేబుల్‌ టీవీ విభాగాలు అమలు చేస్తోంది లేనిదీ ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

English summary

టీవీ వినియోగదారులకు శుభవార్త, సెట్ టాప్ బాక్స్ మార్చకుండానే.. | TRAI recommends making set top boxes interoperability compulsory

To bridge the technical and commercial constraints to universal STB, TRAI said interoperability shall be applicable within the DTH segment and within the cable segment respectively.
Story first published: Sunday, April 12, 2020, 10:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X