For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Festive Season 2021: ఈ 4 బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ రేటు

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ ఎంపీసీ భేటీలో నిర్ణయించింది. ఆర్బీఐ నిర్ణయం భారత్‌లో రిటైల్ లోన్ సెగ్మెంట్ పెరగడానికి దోహదపడుతుంది. ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు దశాబ్దాల కనిష్టం వద్ద ఉన్నాయి. ఈ దీపావళి పండుగ సమయంలో పలు బ్యాంకులు మరింత తగ్గింపు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. శాలరైడ్, నాన్-శాలరైడ్‌కు వివిధ బ్యాంకులు పండుగ సీజన్‌లో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాయి. అంటే వడ్డీ రేటు తగ్గింపు ఉంటుంది. పలు బ్యాంకులు పరిమిత కాలంలో వీటిని ఇస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు లేకుండా హోమ్ లోన్స్ ఇస్తున్న బ్యాంకులు కూడా ఉన్నాయి.

కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికి, హోమ్ లోన్ ట్రాన్సుఫర్ చేసుకునే వారికి ఈ వడ్డీ రేటు తగ్గింపు ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ స్కోర్ లింక్డ్ హోమ్ లోన్స్‌ను అందిస్తున్నాయి. రుణగ్రహీత కనీసం 650 నుండి 700 క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. ఆదాయపు పన్ను చట్టం 1961 కింద వివిధ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. సెక్షన్ 24 ప్రకారం ఏడాదికి రూ.2 లక్షల పన్ను ప్రయోజనం ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ట్యాక్స్ డిడక్షన్ ఉంది. సెక్షన్ 80ఈఈ ప్రకారం రూ.50,000 వరకు మినహాయింపు ఉంది. రూ.30 లక్షల వరకు హోమ్ లోన్ పైన తక్కువ వడ్డీ రేటు అందిస్తున్న టాప్ 4 బ్యాంకులు...

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఉత్సవ్ పేరుతో హోమ్ లోన్ పైన ఆఫర్ అందిస్తోంది. వడ్డీ రేటును అతి తక్కువగా 6.40 శాతానికే అందిస్తున్నట్లు తెలిపింది. ప్రాసెసింగ్ ఫీజు పైన 100 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. శాలరైడ్ ఇండివిడ్యువల్స్‌కు 6.40 శాతం వడ్డీ రేటును, నాన్-శాలరైడ్ ఇండివిడ్యువల్స్‌కు 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సిబిల్ స్కోర్ 800 పాయింట్లకు పైన ఉండాలి. సిబిల్ స్కోర్ 750 నుండి 799 ఉంటే హోమ్ లోన్ వడ్డీ రేటును 6.50 శాతానికి, నాన్-శాలరైడ్ అయితే 6.60 శాతానికి అందిస్తోంది. అక్టోబర్ 27వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త కస్టమర్లతో పాటు ఇతర బ్యాంకుల్లో హోమ్ లోన్ తీసుకొని, బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ చేసుకునే వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఇండియన్ నేషనల్స్, ఎన్నారైలు పద్దెనిమిది ఏళ్ల వయస్సు నుండి 75 ఏళ్ల వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు

పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు

పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు అక్టోబర్ 30వ తేదీన మెగా ఈ-ఆక్షన్ వేస్తోంది. దేశవ్యాప్తంగా 313 క్వాలిటీ రెసిడెన్షియల్స్, కమర్షియల్స్, ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మరోవైపు, ఈ బ్యాంకు జీఎస్‌బీ అప్నా ఘర్ స్కీమ్ ద్వారా 6.50 శాతం వడ్డీ రేటుకే హోమ్ లోన్ అందిస్తోంది. ఈ హోమ్ లోన్ స్కీం కింద జీరో ప్రాసెసింగ్ ఫీజు, ఇన్‌స్పెక్షన్, ప్రిపేమెంట్ ఛార్జీలు, 50 శాతం కన్సెషన్ ఫీజు ఉంది. 30 ఏళ్ల దీర్ఘకాల రీపేమెంట్ పీరియడ్ ఉంది.

కొటక్ మహీంద్రా బ్యాంకు

కొటక్ మహీంద్రా బ్యాంకు

కొటక్ మహీంద్రా బ్యాంకులో హోమ్ లోన్ క్విక్ అప్రూవల్ ఉంది. సింపుల్ డాక్యుమెంటేషన్, అతితక్కువ ప్రాసెసింగ్ ఫీజు తదితర ప్రయోజనాలు ఉన్నాయి. వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది. ఈ అతితక్కువ వడ్డీ రేటు ప్రయోజనం సెప్టెంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 8వ తేదీ వరకు అందుబాటులో ఉంది. శాలరైడ్‌కు 6.50 శాతం నుండి 7.10 శాతం వడ్డీ రేటును, నాన్-శాలరైడ్‌కు 6.65 శాతం నుండి 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు 6.50 శాతం నుండి ప్రారంభం అవుతున్నాయి. అతితక్కువ ప్రాసెసింగ్ ఫీజు, హయ్యర్ లోన్ అమౌంట్, ఫ్రీ క్రెడిట్ కార్డ్, ఫ్రీ యాక్సిడెంటల్ ఇన్సురెన్స్, లాంగర్ రీపేమెంట్ టెన్యూర్, ఈటీ టాప్-అప్ లోన్స్, క్విక్ లోన్ అప్రూవల్, ఈజీ డాక్యుమెంటేషన్, BOB వరల్డ్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ వంటివి అందుబాటులో ఉన్నాయి. పండుగ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ వరకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్ అందిస్తున్నట్లు ప్రకటించింది.

English summary

Festive Season 2021: ఈ 4 బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ రేటు | Top 4 Banks Promising Cheapest Rates On Home Loans This Festive Season 2021

The Reserve Bank of India's decision on 8th October 2021 to hold key policy rates constant has strengthened the retail loan segment in India, resulting in several banks offering customers concessionary rates.
Story first published: Thursday, October 28, 2021, 12:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X