టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.29 లక్షల కోట్లు డౌన్
గతవారం టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.29 లక్షల కోట్లు క్షీణించింది. ఆర్బీఐ రెపో రేటు పెంపు, అంతర్జాతీయ మార్కెట్ అననుకూల పరిస్థితులు, కరోనా కేసులు పెరగడం, ద్రవ్యోల్బణ భయాలు వంటి అంశాలు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల పైన ప్రభావం చూపాయి. సెన్సెక్స్ కేవలం చివరి సెషన్‌లోనే వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది. మొత్తానికి గతవారం ఇన్వెస్టర్లు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇందులో టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.29 లక్షల కోట్లు తగ్గింది.

1466 పాయింట్లు డౌన్
గతవారం మొత్తంగా సెన్సెక్స్ 1466 పాయింట్లు లేదా 2.63 శాతం, నిఫ్టీ 382 పాయింట్లు లేదా 2.31 శాతం పతనమైంది. కార్పోరేట్ మేజర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.44,311.19 కోట్లు తగ్గి రూ.18,36,039 కోట్లకు క్షీణించింది. ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.45,746 కోట్లు క్షీణించింది. దీంతో టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.12,31,399 కోట్లకు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.6,21,502.63 కోట్లకు తగ్గింది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్
HDFC బ్యాంకు, ఐసీఐసీఐ, ఎస్బీఐ.. ఈ మూడింటి మార్కెట్ క్యాప్ రూ.34,970 కోట్లు క్షీణించింది. HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.16,433.92 కోట్లు తగ్గి రూ.7,49,880 కోట్లకు, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.2,231 కోట్లు క్షీణించి రూ.4,12,138 కోట్లకు, ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ.16,305 కోట్లు తగ్గి రూ.5,00,744 కోట్లకు క్షీణించింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ కూడా డౌన్
హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.21,674 కోట్లు క్షీణించి రూ.5,6,886 కోట్లకు, లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) మార్కెట్ క్యాప్ రూ.57,272 కోట్లు తగ్గి రూ.4,48,885 కోట్లకు, HDFC మార్కెట్ క్యాప్ రూ.17,879 కోట్లు క్షీణించి రూ.3,95,420 కోట్లకు, భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాప్ రూ.7,359 కోట్లు తగ్గి రూ.3,69,613 కోట్లకు క్షీణించింది. టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే వరుసగా రిలయన్స్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, HUL, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ఐసీ, ఎస్బీఐ, HDFC, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.