For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC, ICICI, SBI సహా బేజారు! టాప్ 10 బ్యాంకుల్లో ఈ ఒక్కటే అదరగొట్టింది

|

ప్రభుత్వరంగ ప్రయివేటు బ్యాంకులతో పోలిస్తే ప్రయివేటురంగ బ్యాంకులకు కస్టమర్లు ఎక్కువగా ఉంటారు. ప్రయివేటురంగ బ్యాంకుల్లో సేవలు వేగంగా, నాణ్యతతో కూడి ఉంటాయని చాలామంది అభిప్రాయం. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత కొద్దికాలంగా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్ కార్యకలాపాలు పెరిగాయి. కరోనా కారణంగా ఐడీబీఐ బ్యాంకు మినహా మిగతా అన్ని బ్యాంకుల పనితీరు ఈ ఏడాది ప్రతికూలంగా ఉంది. ACE ఈక్విటీ డేటా ప్రకారం దేశంలోని టాప్ 10 బ్యాంకుల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇలా ఉంది...

హోంలోన్, డిస్కౌంట్... యస్ బ్యాంకు అదిరిపోయే పండుగ ఆఫర్లుహోంలోన్, డిస్కౌంట్... యస్ బ్యాంకు అదిరిపోయే పండుగ ఆఫర్లు

HDFC, ICICI, కొటక్ మహీంద్ర ఎంత క్షీణించాయంటే

HDFC, ICICI, కొటక్ మహీంద్ర ఎంత క్షీణించాయంటే

ప్రయివేటురంగ బ్యాంకు HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,73,736 కోట్లుగా ఉంది. అక్టోబర్ 20వ తేదీ నాటికి 3.75 శాతం క్షీణించిన ఈ స్టాక్ రూ.1,224.15 వద్ద ఉంది.

రెండో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ.2,85,904 కోట్లుగా ఉంది. 23.05 శాతం క్షీణించింది. 20వ తేదీ నాటికి స్టాక్ రూ.414.55 వద్ద ఉంది.

మూడో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు కొటక్ మహీంద్ర మార్కెట్ క్యాప్ రూ.2,70,949 కోట్లుగా ఉంది. ఇయర్ టు డేట్ 18.74 శాతం క్షీణించింది. రూ.1368 కోట్లు తగ్గింది. అక్టోబర్ 20వ తేదీ నాటికి ఈ స్టాక్ రూ.1368.85 వద్ద ఉంది.

SBI సహా ఈ స్టాక్స్ కూడా అదే దారిలో..

SBI సహా ఈ స్టాక్స్ కూడా అదే దారిలో..

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,18,1170 కోట్లుగా ఉంది. ఇయర్ టు డేట్ 39.17 శాతం క్షీణించింది. అక్టోబర్ 20వ తేదీ నాటికి ఈ స్టాక్ రూ.203 వద్ద ఉంది.

ప్రయివేటురంగ యాక్సిస్ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,51,080 కోట్లుగా ఉంది. అక్టోబర్ 20వ తేదీ నాటికి ఇయర్ టు డేట్ స్టాక్ 34.52 శాతం క్షీణించి రూ.493.70 వద్ద ట్రేడ్ అయింది.

బంధన్ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.51,395 కోట్లుగా ఉంది. అక్టోబర్ 20వ తేదీ నాటికి ఇయర్-టు-డేట్ 37.18 శాతం క్షీణించి స్టాక్ రూ.319.15 వద్ద ఉంది.

మరో ప్రయివేటురంగ ఇండస్ ఇండ్ బ్యాంకు ఎం-క్యాప్ రూ.47,291 కోట్లుగా ఉంది. ఈ ఏడాది 58.62 శాతం క్షీణించి స్టాక్ రూ.625.14 వద్ద ఉంది.

IDBI మాత్రమే అప్

IDBI మాత్రమే అప్

ప్రయివేటురంగ IDBI బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.39,031 కోట్లుగా ఉంది. ఇయర్-టు-డేట్ 1.62 శాతం పెరిగి అక్టోబర్ 20వ తేదీ నాటికి ఈ స్టాక్ రూ.37.60 వద్ద ఉంది.

ప్రయివేటురంగ యస్ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32,371 కోట్లుగా ఉంది. ఈ ఏడాది 72.48 శాతం క్షీణించి స్టాక్ రూ.12.92కు పడిపోయింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.25,785 కోట్లుగా ఉంది. అక్టోబర్ 20వ తేదీ నాటికి ఇయర్-టు-డేట్ ఈ స్టాక్ 57.42 శాతం పడిపోయి రూ.27.40 వద్ద ఉంది.

English summary

HDFC, ICICI, SBI సహా బేజారు! టాప్ 10 బ్యాంకుల్లో ఈ ఒక్కటే అదరగొట్టింది | Top 10 banks in India based on their market capitalisation

Private banks won over most of public sector bank customers because of the quality of services they offer. Amid the ongoing coronavirus crisis, economic activities have come to a standstill.
Story first published: Thursday, October 22, 2020, 20:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X