For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multibagger stock: లక్షను రూ.10 లక్షలు చేసిన ఫైనాన్స్ స్టాక్.. వ్యాపార విస్తరణతో వార్తల్లో.. గతంలోనూ..

|

Multibagger stock: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం స్టాక్ మార్కెట్లలో పెద్ద భూకంపాన్నే సృష్టించింది. ఇలాంటి ప్రతికూల సమయంలోనూ కొన్ని స్టాక్స్ మాత్రం సూపర్ పెర్ఫామెన్స్ కనబరిచాయి. నమ్మి పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించాయి. ఇలా మల్టీబ్యాగర్ రాబడులతో డబ్బును రెట్టిపు చేసిన ఫైనాన్స్ కంపెనీ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఫైనాన్స్ స్టాక్..

ఫైనాన్స్ స్టాక్..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది స్టార్ హౌసింగ్ ఫైనాన్స్(Star Housing Finance Ltd) షేర్ గురించే. ఈ ఏడాది స్టాక్ మార్కెట్ సృష్టించిన కొన్ని మల్టీబ్యాకర్లలో ఈ స్టాక్ కూడా స్థానాన్ని సంపాదించింది. కంపెనీ షేర్లు ఈ ఏడాది పెట్టుబడిదారులకు బలమైన రాబడిని అందించాయి. 2022 సంవత్సరంలో స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ ధర రూ.87 నుంచి రూ.162.25కి పెరిగింది. అంటే అదే ఏడాది కంపెనీ షేర్లు 85 శాతానికి పైగా రాబడిని అందించింది.

గతంలోనూ స్టాక్ బలమైన రాబడులు..

గతంలోనూ స్టాక్ బలమైన రాబడులు..

స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ అద్భుతమైన రాబడులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీ షేర్లు ఇప్పటికే రిచ్ ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని కలిగించాయి. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గత ఏడు సంవత్సరాల్లో తన ఇన్వెస్టర్లకు 900% రాబడిని అందించింది. ఒకప్పుడు ఈ స్టాక్ ధర అత్యల్పంగా రూ.16గా ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు స్టాక్ ధర రూ.162.25 వద్ద మార్కెట్లో ట్రేడ్ అవుతోంది.

స్టాక్ చరిత్ర..

స్టాక్ చరిత్ర..

స్టాక్ గత నెల రోజుల పనితీరును గమనించినట్లయితే.. కంపెనీ షేరు ధర రూ.130 నుంచి రూ.160 స్థాయికి చేరుకుంది. గత నెల రోజుల్లో కంపెనీ షేర్ దాదాపు 22 శాతం మేర పెరిగింది. స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు గత 6 నెలల కాలంలో రూ.95.55 నుంచి రూ.160 కు ఎగబాకింది. అదే స్టాక్ ఐదు సంవత్సరాల పనితీరును పరిశీలిస్తే.. ఇన్వెస్టర్లకు ఏకంగా 135 శాతం రాబడులను అందించింది.

లక్ష పెట్టుబడిపై రాబడి ఎంతంటే..

లక్ష పెట్టుబడిపై రాబడి ఎంతంటే..

నెల రోజుల క్రితం ఎవరైనా ఇన్వెస్ట్రర్ ఈ స్టాక్ లో రూ.లక్ష ఇన్వస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుతం దాని విలువ దాదాపు రూ.1.25 లక్షలుగా ఉండేది. అదే ఈ ఏడాది ప్రారంభంలో లక్ష పెట్టుబడిగా పెట్టినవారికి ప్రస్తుతం రూ.1.85 లక్షల రాబడి వచ్చి ఉండేది. ఇందులో దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించిన వ్యక్తులకు వారి లక్ష పెట్టుబడి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.10 లక్షలుగా ఉండేది.

 వార్తల్లో నిలిచిన కంపెనీ..

వార్తల్లో నిలిచిన కంపెనీ..

దాదాపు రూ.21.60 కోట్ల విలువైన నిధులను ప్రిఫరెన్షియల్ ఎలాట్ మెంట్ ద్వారా ఇన్వెస్టర్లకు అందించటంతో నిధులను సమీకరించింది. ఈ నిధిని సేకరించిన తర్వాత కంపెనీ నికర విలువ రూ.85 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ గ్రామీణ మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఈ డీల్ కి సంబంధించిన వివరాలను కంపెనీ ఆగస్ట్ 1న వెల్లచించింది.

English summary

Multibagger stock: లక్షను రూ.10 లక్షలు చేసిన ఫైనాన్స్ స్టాక్.. వ్యాపార విస్తరణతో వార్తల్లో.. గతంలోనూ.. | this finance stock gave multibagger returns to its investors

Star Housing Finance Ltd stock gave multibagger returns to its investors and raised capital
Story first published: Tuesday, August 2, 2022, 14:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X