For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖేష్ అంబానీ 'గేమ్ ప్లాన్': మరో భారీ అడుగు వేయబోతున్నారా?

|

భారత్ లో నెంబర్ 1 కుబేరుడు ముకేశ్ అంబానీ కొత్త 'గేమ్ ప్లాన్' ను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు భారత దేశం చూడనటువంటి సరికొత్త డిజిటల్ విప్లవాన్ని ఆవిష్కరించేందుకు పావులు కదుపుతున్నారు. రిలయన్స్ జియో పేరుతో టెలికాం సేవలు ప్రారంభించి దేశంలో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ముకేశ్ అంబానీ... ఇప్పుడు సరిగ్గా అలాగే మరో కొత్త రంగంలోకి విస్తరించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2014 నుంచి ఇండియా లో డిజిటల్ సేవల విస్తృతి పెరిగిన దగ్గర నుంచి భారతీయులు 4జి డేటా ను అధికంగా ఉపయోగిస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ల వినియోగంలో మన దేశం అగ్రరాజ్యం అమెరికా ను కూడా తలదన్ని ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా అవతరించింది. స్మార్ట్ ఫోన్లో వీడియో లు, ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు అదే ముకేశ్ అంబానికి మరో కొత్త అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ విషయం సోమవారం ముంబై లో నిర్వహించిన ఒక సీఈఓ ల సదస్సులో అయన చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటనలో భాగంగా... మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నిర్వహించిన సదస్సులో సత్య నాదెళ్లతో ముకేశ్ అంబానీ భవిష్యత్ ఇండియాపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ చూసేది విభిన్న భారత్: సత్య నాదెళ్లతో ముఖేష్ అంబానీ

గేమింగ్ రంగంలో పాగా...

గేమింగ్ రంగంలో పాగా...

ఎవరూ ఊహించనంత పెద్ద మార్కెట్ ప్రస్తుతం గేమింగ్ రంగంలో ఉందని ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇండియా లో దీనికి మంచి భవిష్యత్ ఉందని చెప్పారు. ఇండియా లో దాని మార్కెట్ పరిమాణం మ్యూజిక్, సినిమాలు, టీవీ షో లన్నీ కలిపితే ఎంత ఉంటుందో... అంతకంటే కూడా పెద్దదిగా ఉంటుందని స్పష్టం చేశారు. గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవటంలో వర్ధమాన దేశాల్లో భారత్ చాలా ముందున్నది చెప్పారు. సగటున ఇండియాలో ఒక వ్యక్తి గేమ్ ఆడేందుకు కనీసం గంట సమయాన్ని వెచ్చిస్తుండటం విశేషం. మన లాంటి వారికి గేమింగ్ అంటే ఏమిటో కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అది చాలా పెద్ద మార్కెట్ అని సత్య నాదెళ్లతో ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఇప్పటికే జియో సెట్ టాప్ బాక్స్ తో పాటు గేమింగ్ కన్సోల్ గాడ్జెట్ ను కూడా ఆవిష్కరించారు. దీంతో, ముందు ముందు గేమింగ్ రంగంపై ముకేశ్ అంబానీ అధిక ఫోకస్ పెడతారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

నాలుగేళ్లలో రూ 25,000 కోట్లు..

నాలుగేళ్లలో రూ 25,000 కోట్లు..

ఇండియా లో గేమింగ్ డెవలప్మెంట్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. గత పదేళ్ల నుంచి భారత కంపెనీలు గేమింగ్ అభివృద్ధి పై ఫోకస్ చేస్తున్నా.. ఇండియా లో అందుకు తగిన మౌలిక సదుపాయాలు లేక కొంత వేగం పుంజుకోలేదు. ఈ నేపథ్యంలో విదేశీ కంపెనీల గేమింగ్ ప్రాజెక్టులను మన కంపెనీలు ఔట్సోర్స్ చేసుకొని వారికోసం పనిచేస్తున్నాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం... ప్రస్తుతం ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీ పరిమాణం సుమారు రూ 6,000 కోట్లుగా ఉంది. కానీ అది 2024 నాటికి రూ 25,000 కోట్లకు చేరుకోనుంది. అంటే దాదాపు ప్రతి ఏటా రెట్టింపు స్థాయిలో వృద్ధిని నమోదు చేయనుంది. బహుశా ముకేశ్ అంబానీ కూడా దీనిని దృష్టి పెట్టుకొనే పై వ్యాఖ్యలు చేశారేమోనని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కోట్లలో గేమ్స్ డౌన్లోడ్...

కోట్లలో గేమ్స్ డౌన్లోడ్...

ఇండియా లో యువత, చిన్న పిల్లల్లో మొబైల్ గేమ్స్ పై మోజు అంతకంతకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ ఐన పబ్ జీ వంటి గేమ్ గురించి చెప్పనక్కరలేదు. వేలం వెర్రిగా ఆ ఆటను ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండటంతో ఏకంగా నిషేధం విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా అలాంటిదే మరో గేమ్ ఫ్రీ ఫైర్ కూడా అందుబాటులోకి వచ్చింది. అది కూడా అతి తక్కువ కాలంలోనే 14.6 కోట్ల డౌన్లోడ్స్ సాధించి రూ 7,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించేసింది. డౌన్లోడ్స్ లో పబ్ జీ ని కూడా వెనక్కి నెట్టింది. యాంగ్రీ బర్డ్స్ నుంచి పబ్ జీ దాకా... ఇండియాలో కూడా కోట్లలో మొబైల్ గేమ్స్ డౌన్లోడ్స్ జరుగుతున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ అన్నిట్లోనూ ఒకటే సరళి కనిపిస్తోంది. ఈ క్రేజ్ ను తన నెక్స్ట్ బిగ్ గేమ్ ప్లాన్ గా మార్చుకుని గేమింగ్ రంగంలో రిలయన్స్ మరో విప్లవాన్ని తెస్తుందేమో చూడాలి.

English summary

This could be Mukesh Ambani's next big bet

Reliance Industries chairman Mukesh Ambani might have hinted at his next big bet. While talking to Microsoft's Satya Nadella, Ambani said that gaming could be the next big industry in India.
Story first published: Tuesday, February 25, 2020, 19:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X