For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంబానీ జియోలో విస్టా పెట్టుబడి, ఈ అమెరికా కంపెనీ వ్యవస్థాపకుల్లో భారతీయుడు

|

రిలయన్స్ ఇండస్ట్రీస్ పదిహేను రోజుల వ్యవధిలోనే మూడు అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొదట ఫేస్‌బుక్‌తో ఒప్పందం, అనంతరం సిల్వర్ లేక్, ఇప్పుడు విస్టాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మూడు ఒప్పందాల వ్యాల్యూ రూ.60,600 కోట్లు. 2021 మార్చి నాటికి కంపెనీని రుణరహిత సంస్థగా తీర్చిదిద్దే క్రమంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన కంపెనీల్లో వాటాలు విక్రయిస్తున్నారు.

రిలయన్స్ జియోలో మరో భారీ పెట్టుబడి, రూ.11,367తో అమెరికా టెక్ ఫండ్ కంపెనీరిలయన్స్ జియోలో మరో భారీ పెట్టుబడి, రూ.11,367తో అమెరికా టెక్ ఫండ్ కంపెనీ

అమెరికా కంపెనీ విస్టా

అమెరికా కంపెనీ విస్టా

అమెరికా కంపెనీ విస్టా సహ వ్యవస్థాపకులు బ్రియాన్ సేథ్ తండ్రి గుజరాత్‌కు చెందినవారు. తల్లి ఐరిష్ క్యాథలిక్. ముఖేష్ అంబానీ కూడా గుజరాతీయే. ఈ కంపెనీ వ్యవస్థాపకులు రాబర్ట్ స్మిత్‌తో కలిసి వ్యక్తిగత అనుబంధం ఉంది ముఖేష్ అంబానీకి. చర్చలు కూడా అంబానీ సన్నిహితుడు మనోజ్ మోడీ, సేథ్ మధ్య జరిగాయి. విస్టా అంతర్జాతీయ టెక్ పెట్టుబడుల సంస్థ. సాఫ్టువేర్, డేటా, టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.

57 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

57 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

ప్రపంచవ్యాప్తంగా 57 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఉన్నాయి. మన కరెన్సీలో రూ.4.83 లక్షల కోట్లు. ఈ సంస్థకు చెందిన కంపెనీల నెట్ వర్క్ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఎంటర్‌ప్రైజెస్ సాఫ్టువేర్ సంస్థ. ప్రస్తుతం విస్టా పోర్ట్‌పోలియోలో భారత కంపెనీల్లో దాదాపు 13,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. గత దశాబ్ద కాలంలో 200 కంటే ఎక్కువ సాఫ్టువేర్ అక్వైజేషన్స్ చేసింది. ఇది ఏ ఇతర టెక్ లేదా ఫైనాన్షియల్ కంపెనీల కంటే కూడా ఎక్కువే.

గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్ జాబితాలో స్మిత్

గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్ జాబితాలో స్మిత్

విస్టాకు రెండు దశాబ్దాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. అమెరికన్ బిజినెస్‌మ్యాన్ కమ్ ఇన్వెస్టర్ రాబర్డ్ ఎఫ్ స్మిత్, బ్రియాన్ సేథ్ కలిసి స్థాపించారు. రాబర్ట్ స్మిత్ 2017లో ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 100 గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్‌లో చోటు దక్కింది.

13.46 శాతం వాటా విక్రయం

13.46 శాతం వాటా విక్రయం

రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 13.46 శాతం వాటాను రిలయన్స్ విక్రయించింది. ఫేస్‌బుక్‌కు రూ.43,574 కోట్లతో 9.99 శాతం వాటాను విక్రయించింది. ఆ తర్వాత సిల్వర్ లేక్ రూ.5,666 కోట్లతో 1.15 శాతం వాటాను దక్కించుకుంది. ఇప్పుడు విస్టా ఈక్విటీ రూ.11,367 కోట్లతో 2.32 శాతం వాటాను దక్కించుకుంది. జియో ఎంటర్ ప్రైజెస్ వ్యాల్యూ రూ.5.16 లక్షల కోట్లు. జియో ఈక్విటీ వ్యాల్యూ రూ.4.91 లక్షల కోట్లు.

20 శాతం వాటా విక్రయాల దిశగా..

20 శాతం వాటా విక్రయాల దిశగా..

జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే 13.46 శాతం వాటాను రిలయన్స్ విక్రయించింది. సమీప భవిష్యత్తులో మరిన్ని వాటాలు విక్రయించే అవకాశముంది. 20 శాతం వాటా వరకు వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడిదారులకు వాటా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తుంది. 2021 మార్చి నాటికి రుణరహిత సంస్థగా తీర్చిదిద్దాలనుకున్నప్పటికీ, ఈ ఏడాది డిసెంబర్ నాటికే సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రూ.1లక్ష కోట్ల సమీకరణ

రూ.1లక్ష కోట్ల సమీకరణ

రుణ పునర్నిర్మాణ పథకాల్లో భాగంగా కంపెనీ జూన్ కల్లా రూ.1.04 లక్షల కోట్లను సమీకరించనుంది. ఇందులో రైట్స్ ఇష్యూ కూడా ఉంది. ఫేస్‌బుక్-జియో ప్లాట్ ఫామ్స్ నుంచి వచ్చే రూ.43,574 కోట్లు, యూకే బీపీకి ఇంధన రిటైల్ విభాగంలో 49 శాతం వాటాను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.7,000 కోట్లు కూడా ఉంటాయి. ఆరామ్‌కోతో కూడా జత కడుతున్నట్లు గతంలోనే రిలయన్స్ పేర్కొంది.

English summary

అంబానీ జియోలో విస్టా పెట్టుబడి, ఈ అమెరికా కంపెనీ వ్యవస్థాపకుల్లో భారతీయుడు | Things you should know about Vista Equity, latest high profile Jio investor

Vista’s inflow is the third such high profile deal in Jio, after Facebook announced its investment in April, followed by Silver Lake Partners in May.
Story first published: Saturday, May 9, 2020, 8:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X