గ్యాస్ సిలిండర్ డ్యూట్ డేట్ ఎలా చెక్ చేయాలి, ఎంతకాలం ఉంటుంది?
లిక్విఫైడ్ పెట్రోలియం సిలిండర్(LPG)ను డొమెస్టిక్ కోసం వినియోగిస్తారు. 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డొమెస్టిక్ పర్పస్ కోసం, 19 కిలోల దానిని కమర్షియల్ కోసం వినియోగిస్తారు. ఎల్పీజీ డొమెస్టిక్ వినియోగం ప్రతి ఏడాది సగటున మూడు శాతం నుండి నాలుగు శాతం పెరుగుతుంది. గతంలో కిరోసన్‌ను ఎక్కువగా వినియోగించేవారు. ఇప్పుడు ఎల్పీజీని వినియోగిస్తున్నారు.
సాధారణంగా గ్యాస్ సిలిండర్ గురించి చూసేది ధరలు తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా అని చూస్తాం. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ప్రతి నెల గ్యాస్ ధరలను సవరిస్తాయి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు. అయితే మనం వినియోగించే ఈ సిలిండర్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం...

సిలిండర్ గడువు ఎలా?
సిలిండర్ పై భాగంలో ఒక నెంబర్ కనిపిస్తుంది. ఈ నెంబర్ గురించి ఎవరికీ తెలియదు. అయితే దీనిని కస్టమర్ల భద్రత కోసం ముద్రిస్తారు. ప్రతి సిలిండర్ పైన A, B, C, Dలను ముద్రిస్తారు. జనవరి-మార్చికి సంబంధించి A, ఏప్రిల్-జూన్‌కు సంబంధించి B, జూలై-సెప్టెంబర్‌కు సంబంధించి C, అక్టోబర్-డిసెంబర్‌కు సంబంధించి Dని వినియోగిస్తారు. B-22 అని రాసి ఉంటే సిలిండర్ ఏప్రిల్ నుండి జూన్ మధ్య టెస్టింగ్ గడువు ఉందని అర్థం. A-26 అని ఉంటే 2026 జనవరి నుండి మార్చి మధ్య టెస్టింగ్ ఉందని అర్థం. గడువు దాటిన సిలిండర్ తీసుకోవడం ప్రమాదం కావొచ్చు.

సిలిండర్ కాలపరిమితి
సాధారణంగ్ గ్యాస్ సిలిండర్ లైఫ్ టైమ్ పదిహేను సంవత్సరాలు. ఈ సమయంలో రెండుసార్లు పరిశీలిస్తారు. మొదటి పరీక్ష పదేళ్ల తర్వాత, రెండో పరీక్ష 5 ఏళ్ల తర్వాత నిర్వహిస్తారు. ఈ పరీక్షలో కనుక సిలిండర్ పెయిల్ అని తేలితే దానిని స్క్రాప్ కిందకు వేస్తారు. దాదాపు ప్రతిరోజు మొత్తం సిలిండర్లలో 1.25 శాతం సిలిండర్ల కంటే ఎక్కువగా టెస్టింగ్‌కు వెళ్తున్నాయి. ఇందులో కొన్ని మాత్రమే స్క్రాప్‌కు వెళ్తాయి.

ఇలా గుర్తింపు
ఎల్పీజీ సిలిండర్‌ను 1912లో కనుగొన్నారు. ఈ గ్యాస్‌ను లిక్విడ్స్‌గా మార్చి స్టోర్ చేయవచ్చునని అమెరికన్ సైంటిస్ట్ డాక్టర్ వాల్టర్ స్నెల్లింగ్ గుర్తించారు. 1912 నుండి 1920 మధ్య ఎల్పీ గ్యాస్ ఉపయోగాలు అభివృద్ధి చేయబడ్డాయి.