For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం: జూన్ 1 నుంచి తప్పనిసరిగా అమలు

|

ముంబై: బంగారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేయనుంది. బంగారం, ఆభ‌ర‌ణాలు, ఇతర ఆర్టికల్స్‌పై జూన్ 1వ తేదీ నుంచి హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయనుంది. ఇది రెండో ద‌శ బంగారం హాల్‌మార్కింగ్ ప్రక్రియ. బంగారం, పసిడితో తయారు చేసిన ఆభ‌ర‌ణాల‌ు, కళాఖండాలపై హాల్‌మార్కింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇదివరకే తప్పనిసరి చేసింది. తొలిదశను అమల్లోకి తీసుకొచ్చింది.

ఇక తాజాగా జూన్ 1 నుంచి రెండో విడతను అమలు చేయనుంది. బంగారం స్వచ్ఛత, నాణ్యతను తెలియజేసే ప్రక్రియ ఇది. గత సంవత్సరం జూన్ 16 నుంచి స్వ‌చ్ఛందంగా అమ‌ల్లోకి తీసుకొచ్చింది కేంద్రం. ద‌శ‌లవారీగా బంగారం ఆభ‌ర‌ణాల‌పై హాల్‌మార్కింగ్ త‌ప్ప‌నిస‌రి విధానాన్ని అమ‌లు చేయాలని నిర్ణయించింది. తొలిద‌శ‌లో దేశంలోని 256 జిల్లాల్లో హాల్‌మార్కింగ్ అమ‌లు చేసింది. ఇందులో భాగంగా రెండో విడత హాల్‌మార్కింగ్ అనేది- జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

రెండో ద‌శ‌లో 20, 23, 24 క్యార‌ట్ల బంగారం ఆభ‌ర‌ణాలు, క‌ళాఖండాల‌పై హాల్‌మార్కింగ్ త‌ప్ప‌నిస‌రి. కొత్త‌గా దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో హాల్‌మార్కింగ్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర వినియోగదారుల వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ ఇదివరకే నోటిఫికేష‌న్ జారీ చేసింది. హాల్‌మార్కింగ్ నోడ‌ల్ ఏజెన్సీ అయిన బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్ (బీఐఎస్‌) విజ‌య‌వంతంగా బంగారం ఆభ‌ర‌ణాల‌కు తొలిద‌శ‌లో హాల్‌మార్కింగ్ పూర్తి చేసింది. గ‌తేడాది జూన్ 23 నుంచి ప్ర‌తి రోజూ 256 జిల్లాల ప‌రిధిలో మూడు ల‌క్ష‌ల‌కు పైగా బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ చేసింది.

The second phase of mandatory hallmarking of gold jewellery will come into force from June 1

బీఐఎస్ గుర్తింపు ఉన్న సంస్థ‌ల వ‌ద్ద హాల్‌మార్కింగ్ చేయ‌ని బంగారం స్వ‌చ్ఛ‌తను కొనుగోలుదారులు తెలుసుకునే వెసలుబాటును కూడా కల్పించింది. దీనికోసం కొంత మొత్తాన్ని వారి నుంచి వసూలు చేస్తోంది. ఒక్కో దానిపై 50 రూపాయలు చొప్పున నాలుగు బంగారు ఆభ‌ర‌ణాల స్వచ్ఛతను ప‌రీక్షించ‌డానికి 200 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. నాలుగుకు పైగా బంగారు ఆభ‌ర‌ణాల‌ ప్యూరిటీని తెలుసుకోవడానికి అద‌నంగా 45 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.

బంగారంపై హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయడం ద్వారా బులియన్ మార్కెట్ వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. తాము స్వచ్ఛమైన బంగారాన్ని విక్రయిస్తున్నామంటూ లిఖితపూరకంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఉంటే వ్యాపారులు కొనుగోలుదారులను మోసం చేసే అవకాశాలు చాలా తక్కువు. మోసాలకు పాల్పడితే వారిపై కేసులు పెట్టే వీలు ఉంది.

English summary

బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం: జూన్ 1 నుంచి తప్పనిసరిగా అమలు | The second phase of mandatory hallmarking of gold jewellery will come into force from June 1

The second phase of mandatory hallmarking of gold jewellery and artefacts will come into force from June 1 this year.
Story first published: Tuesday, May 24, 2022, 15:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X