For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wheat flour: కిలో గోధుమ పిండి రూ.136.. ఇక చపాతీలు తినట్టే..!

|

భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షభంతో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ఎంతగా పెరిగిందంటే మాల్స్, మార్కెట్లు, కళ్యాణ మండపాలు సహా పలు కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రధానంగా మాల్స్ కు సంబంధించి భారీగా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి రావడంతో సాయంత్రం కాగానే మాల్స్‌ను మూసివేస్తున్నారు. మైదా, పంచదార, నెయ్యి తదితర నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.

ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత, మందగించిన జిడిపి వృద్ధి కూడా చాలా ఇబ్బందులను సృష్టించాయి. పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ఎంత స్థాయికి చేరిందంటే, పాక్ ప్రభుత్వం అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయానికి చెందిన ఆస్తులను వేలం వేసేంతగా. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గోధుమ పిండి కొరత ఏర్పడింది. పాకిస్తాన్‌లో రోటీ తయారీకి గోధుమలు ఉపయోగిస్తారు.

కోడి మాంసం

కోడి మాంసం

కానీ లాహోర్‌లోని ఏ మార్కెట్‌లోనూ, మాల్స్‌లోనూ పిండి దొరకడం లేదు. 15 కిలోల గోధుమ పిండి బస్తాకు 2,050 రూపాయలు. అక్కడి ప్రభుత్వం చక్కెర ధరను 25 శాతం, నెయ్యి ధరను 62 శాతం పెంచింది. కోడి మాంసం కిలో 650 రూపాయలు. కొద్ది రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.320గా ఉండేది.

IMF

IMF

పాకిస్థాన్ తన కుంటుపడిన విద్యుత్ రంగాన్ని మెరుగుపరచడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి ఆర్థిక సహాయం కోరింది. ఇటీవల IMF 1.1 బిలియన్ డాలర్లను విడుదల చేసింది. అయితే ఈ ప్రక్రియకు మరికొంత సమయం పట్టేలా ఉంది. 2019లో IMF పాకిస్థాన్‌కు 6 బిలియన్ డాలర్లు విడుదల చేసింది. గతేడాది ఆగస్టులో 3.9 బిలియన్ డాలర్లు విడుదలయ్యాయి. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, డిసెంబర్‌లో ఎగుమతులు దాదాపు 16 శాతం తగ్గి 2.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2022లో పాకిస్థాన్ రూపాయి విలువ దాదాపు 30 శాతం క్షీణించింది.

భారత్ పై విషం చిమ్మడం

భారత్ పై విషం చిమ్మడం

పాకిస్థాన్ ఎప్పుడు ఉగ్రవాదులకు కొమ్ముకాయడం, భారత్ పై అవకాశం దొరికినప్పుడల్లా విషం చిమ్మడం, జమ్మూ కాశ్మీర్ లో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించడం చేసింది తప్పా.. తమ దేశం ఎలా బాగుపాడాలని ఎప్పుడు ఆలోచించలేదు. అందుకే పాకిస్థాన్ ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది.

English summary

Wheat flour: కిలో గోధుమ పిండి రూ.136.. ఇక చపాతీలు తినట్టే..! | The price of wheat flour in Pakistan has reached 136 rupees per kg

India's neighbor Pakistan is reeling under financial crisis. The economic crisis in Pakistan has increased so much that many offices including malls, markets and marriage halls have been closed.
Story first published: Saturday, January 7, 2023, 17:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X