For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC: హెచ్‌డిఎఫ్‌సి 8 నుంచి 10 నెలల సమయం పట్టొచ్చు.. ఎందుకంటే..

|

HDFC బ్యాంక్ (HDFC బ్యాంక్), HDFC (HDFC) దేశ కార్పొరేట్ చరిత్రలో విలీనం కానున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విలీనానికి మరో 8 నుంచి 10 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి హెచ్‌డిఎఫ్‌సి ఛైర్మన్ దీపక్ పరేఖ్ విలీనంపై ఓ ప్రకటన చేశారు. హెచ్‌డిసిఎఫ్ బ్యాంక్ తన ఫ్లాగ్‌షిప్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్‌తో విలీనాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

నివేదికల ప్రకారం, షేర్‌హోల్డర్ల ఆమోదం కోసం హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రెండూ శుక్రవారం సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో విలీనంపై చర్చించారు. 2022 ఏప్రిల్ 4న విలీనం ప్రకటన రాగా.. ఈ రెండు కంపెనీల విలీనానికి 12 నుంతి 18 నెలల సమయం పట్టవచ్చని తెలిపాయి.

 The merger of HDFC Bank and HDFC is likely to take another 8 to 10 months

శశిధరన్ జగదీశన్

గత పద్ధతులు, గత ట్రెండ్‌లను పరిగణనలోకి తీసుకుంటే విలీన తేదీ ప్రకటించడానికి సుమారు 8 నుండి 10 నెలల సమయం పడుతుందని మేము నమ్ముతున్నామని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ జగదీశన్ చెప్పారు. హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ మెరుగైన మూలధన సమృద్ధి నిష్పత్తి ద్వారా, ఈ విలీనం కొత్త సంస్థ మూలధన సమృద్ధి నిష్పత్తిని 0.20 నుండి 0.30 శాతం పెంచడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.

 The merger of HDFC Bank and HDFC is likely to take another 8 to 10 months

1.61 లక్షల మంది ఉద్యోగులు

హెచ్‌డిఎఫ్‌సికి చెందిన 1.61 లక్షల మంది ఉద్యోగుల జాబితాలో 3,500 మందికి పైగా ఉద్యోగులు చేరుతారని, కొద్దిమంది మినహా దాదాపు హెచ్‌డిఎఫ్‌సిలోని 508 శాఖలు కూడా విలీనం కానున్నాయని జగదీషన్ చెప్పారు. సమావేశాలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నియమించిన గౌతం దోషి అధ్యక్షత వహిస్తారు. శనివారం సాయంత్రంలోగా ఓటింగ్ రిజల్ట్ కాపీని ఎన్‌సిఎల్‌టికి అందుబాటులో ఉంచుతామని గౌతమ్ చెప్పారు.

English summary

HDFC: హెచ్‌డిఎఫ్‌సి 8 నుంచి 10 నెలల సమయం పట్టొచ్చు.. ఎందుకంటే.. | The merger of HDFC Bank and HDFC is likely to take another 8 to 10 months

The merger of HDFC Bank and HDFC is likely to take another 8 to 10 months. In this regard HDFC Chairman Deepak Parekh made a statement on the merger.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X