For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ ఉద్యోగులు ఊరెళ్ళారు.. మరింత కాలం ఇంటినుండి పని: అప్పటి దాకా అంతే!

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐటీ, ఐటీ సేవల రంగ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మార్చి నుండి దాదాపు 95 శాతం, అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు ఆ తర్వాత క్రమంగా 10 నుండి 20 శాతం మంది ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. 80 శాతం వరకు ఇప్పటికీ ఇంటి నుండి పని చేస్తున్నారు. తాజాగా హైసియా సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. వంద శాతం వర్క్ ఫ్రమ్ అసాధ్యమని తేలడంతో పాటు, మరింతకాలం ఇంటి నుండి పని పొడిగింపు ఉంటుందని తేలింది.

జియో కీలక నిర్ణయం, ఆ సంస్థకే భారం: వొడాఫోన్ ఐడియాకు లబ్ధిజియో కీలక నిర్ణయం, ఆ సంస్థకే భారం: వొడాఫోన్ ఐడియాకు లబ్ధి

కొంత మార్పు..

కొంత మార్పు..

2021 సంవత్సరం ముగిసేవరకు కొంత మార్పు రావొచ్చునని, అప్పటి వరకు కార్యాలయాలకు వెళ్లే ఐటీ, ఐటీ సేవల ఉద్యోగులు తక్కువేనని హైసియా సర్వేలో వెల్లడైంది. వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో చాలామంది ఊళ్ళకు వెళ్లిపోయారు. సొంతూరు లేదా సొంత ఇంటి నుంటి నుండి పని చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని సాఫ్టువేర్, ఐటీ ఆధారిత సేవల కంపెనీల్లోని 90 శాతానికి పైగా ఉద్యోగులు ఇంకా ఇంటి నుంచే పని చేస్తున్నారని ఈ సర్వే తెలిపింది. ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీసుకు రావడం (రిటర్న్‌ టు ఆఫీ‌స్) ఈ ఏడాది మధ్య నాటికి కాస్త పుంజుకోవచ్చునని, క్రమంగా ఏడాది చివరికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చునని తెలిపింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. త్వరలో టీకా వస్తుంది. ఈ నేపథ్యంలో సాధారణ పరిస్థితి నెలకొనడానికి కాస్త సమయం పడుతుందని వెల్లడైంది.

ఇక అందరూ రాకపోవచ్చు

ఇక అందరూ రాకపోవచ్చు

ఎక్కువ శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నప్పటికీ ఐటీ కంపెనీల్లో ఉత్పాదకత ఎక్కువగానే ఉంది. ఇంటి నుంచి పని చేస్తోన్న ఉద్యోగుల్లో యాభై శాతం మంది వరకు సొంతూళ్లకు వెళ్లారు. ఉద్యోగులు అనేక ప్రాంతాల నుంచి పని చేస్తున్నందున వర్క్ టు రిటర్న్ కొత్త సమస్య ఉందని, వందశాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయడాన్ని ఇక చూడలేకపోవచ్చునని తెలిపింది. చాలామందికి తమ కుటుంబాలతో పాటు నగరానికి రావడం సాధ్యం కాకపోవచ్చునని తెలిపింది.

మరింత కార్యాలయం

మరింత కార్యాలయం

63 శాతం కంపెనీలు తమ ఉత్పాదకత 90 శాతానికి పైగా ఉన్నట్లు తెలిపాయి. కొన్ని పెద్ద కంపెనీల విషయంలో అయితే ఇది వంద శాతం ఉంది. ఉద్యోగులు ఆఫీస్‌కు రావడం ప్రారంభమైతే కార్యాలయం మరింత అవసరమవుతుందని, ఇది 10 శాతం నుండి 20 శాతం వరకు అదనంగా అవసరం కావొచ్చునని తెలిపింది.

English summary

ఐటీ ఉద్యోగులు ఊరెళ్ళారు.. మరింత కాలం ఇంటినుండి పని: అప్పటి దాకా అంతే! | Techies’ return to office unlikely anytime soon

The workforce of IT and ITES firms in Hyderabad is unlikely to return to office anytime soon as a survey by Hyderabad Software Enterprises Association (HYSEA) found that Work From Home (WFH) will continue, albeit to a lesser extent, well beyond 2021.
Story first published: Sunday, January 3, 2021, 7:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X