For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదరగొట్టిన టెక్ మహీంద్రా, ఉద్యోగులకు వేతనాల పెంపు ఎప్పుడంటే?

|

2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర అంచనాలను మించింది. రెండో క్వార్టర్‌లో లాభం రూ.1,064.6 కోట్లు నమోదయింది. మార్జీన్ పెరిగినప్పటికీ ఏడాది ప్రాతిపదికన మాత్రం లాభం 5.27 శాతం తగ్గింది. గత మూడు నెలల్లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.32 శాతం వృద్ధి చెంది రూ.9,371 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ 42.1 డాలర్ల విలువైన కొత్త డీల్స్ కుదుర్చుకుంది. షేర్ హోల్డర్స్‌కు ఒక్కో షేర్‌కు రూ.15 ప్రత్యేక డివిడెండ్ చెల్లించనుంది. వచ్చే ఏడాదిలో ఉద్యోగుల వేతనాలను దశలవారీగా పెంచనుంది. ఈ మేరకు ప్రకటన చేసింది.

డొనాల్డ్ ట్రంప్ ఒక్క నిర్ణయం, రూ.7 లక్షల కోట్ల భారీ నష్టం!డొనాల్డ్ ట్రంప్ ఒక్క నిర్ణయం, రూ.7 లక్షల కోట్ల భారీ నష్టం!

ఆపరేషన్స్ రెవెన్యూ జంప్

ఆపరేషన్స్ రెవెన్యూ జంప్

సెప్టెంబర్ త్రైమాసికంలో ఆపరేషన్స్ రెవెన్యూ 2.9 శాతం ఎగిసి, రూ.9,371.8 కోట్లుగా ఉంది. అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ.9,106.3 కోట్లుగా నమోదయింది. డాలర్ రెవెన్యూ క్వార్టర్ ప్రాతిపదికన 4.8 శాతం పెరిగి రూ.1,265.4 మిలియన్ డాలర్లకు చేరుకుంది. రెవెన్యూ వృద్ధి క్వార్టర్ ప్రాతిపదికన 2.9 శాతం పెరిగింది. ఈ త్రైమాసికానికి గాను ప్రతి షేర్‌కు రూ.15 డివిడెండ్‌ను ప్రకటించింది.

అందుకూ లాభాలు..

అందుకూ లాభాలు..

టెక్ మహీంద్రా వరుస త్రైమాసికంలో ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. జూన్ క్వార్టర్‌లో రూ.972 కోట్లు కాగా, ఈసారి రూ.1,064 కోట్లకు పైగా నమోదు చేసింది. ఎబిట్ మార్జిన్ 410 పాయింట్లు పెరిగిందని టెక్ మహీంద్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీపీ గుర్నానీ చెప్పారు. 5జీ, క్లౌండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పైన కంపెనీ ఫోకస్ చేస్తోందని, దీంతో వృద్ధి 4.8 శాతం పెరిగిందని తెలిపారు.

ఉద్యోగాలు ఎప్పుడు పెంచనుందంటే

ఉద్యోగాలు ఎప్పుడు పెంచనుందంటే

కొత్తగా ఏడుగురు క్లయింట్స్ జత కావడంతో సంఖ్య 988కి చేరుకున్నట్లు టెక్ మహీంద్ర తెలిపింది. కొత్తగా 421 మిలియన్ డాలర్ల విలువైన ఆర్జర్స్ చేజిక్కించుకున్నామని తెలిపింది. ప్రస్తుతం సంస్థలో 1,24,258 మంది ఉద్యోగులు ఉన్నారు. జూనియర్ స్థాయి సిబ్బంది వేతనాలను మార్చి క్వార్టర్‌లో పెంచనున్నట్లు తెలిపింది. సీనియర్ స్థాయి ఉద్యోగాలను వచ్చే ఏడాది పెంచుతామని తెలిపింది. టెక్ మహీంద్ర షేర్ ధర శుక్రవారం 1.14 శాతం ఎగిసి రూ.847 వద్ద ముగిసింది.

English summary

అదరగొట్టిన టెక్ మహీంద్రా, ఉద్యోగులకు వేతనాల పెంపు ఎప్పుడంటే? | Tech Mahindra profit up 9.5 percent sequentially in September quarter

Tech Mahindra Ltd on Friday reported a net profit of ₹1,065 crore for the September quarter, up 9.5% from the preceding quarter, on reviving demand for digital transformation from multiple segments. The profit, however, was 5.3% below what it recorded in the same period a year ago.
Story first published: Saturday, October 24, 2020, 7:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X