For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Work From Home: రూటు మార్చిన టెక్ కంపెనీలు.. ఉద్యోగుల్లో చెప్పలేనంత ఆనందం.. పూర్తి వివరాలు

|

Work From Home: ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు తమ రూటు మార్చాయి. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీలు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయి.

ఆఫీసులు ఖాళీ..

ఆఫీసులు ఖాళీ..

ఖర్చుల మదింపు చర్యలను టెక్ దిగ్గజ కంపెనీలు సైతం ఫాలో అవ్వటం మెుదలు పెట్టాయి. ఇందులో భాగంగా.. సోషల్ మీడియా దిగ్గజం Facebook డౌన్‌టౌన్ సీటెల్‌లోని ఆరు-అంతస్తుల భవనాన్ని, బెల్లేవ్‌లోని స్ప్రింగ్ డిస్ట్రిక్ట్‌లోని 11-అంతస్తుల బ్లాక్ 6లో తన కార్యాలయాలను సబ్‌లీజ్ కు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి తోడు మైక్రోసాఫ్ట్ సైతం వాషింగ్టన్‌, బెల్లేవ్‌ ఆఫీసులను ఖాళీ చేయాలని నిర్ణయించింది.

సాఫ్ట్ మార్కెట్..

సాఫ్ట్ మార్కెట్..

సాఫ్ట్ మార్కెట్ అనేది ఆర్థిక చక్రంలో ఒక దశ. ఈ క్రమంలో కొనుగోలుదారులు తక్కువగా ఉండటం వల్ల వారి వ్యాపారాన్ని పొందేందుకు.. ఎక్కువ మంది విక్రేతలు ఉంటారు. అందుకే ప్రఖ్యాత కంపెనీలు ఈ సమస్యను ఎదుర్కోవటం కోసం తమ కార్యాలయ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మైక్రోసాఫ్ట్ 2024తో ముగియనున్న బెల్లేవ్‌లోని 26-అంతస్తుల సిటీ సెంటర్ ప్లాజా భవన లీజును తిరిగి పునరుద్ధరించందని తెలుస్తోంది.

వర్క్ ఫ్రమ్ హోమ్..

వర్క్ ఫ్రమ్ హోమ్..

ఈ కారణాలతో కంపెనీలు తమ ఆఫీసులను ఇతరులకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాయి. ఇటీవల కంపెనీలు భారీగా ఉద్యోగులను సైతం తొలగించాయి.. పైగా ఆ తొలగింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో టెక్ దిగ్గజాలు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అందించాలని నిర్ణయించాయి. రిమోట్ విధానంలో ఉద్యోగులకు పనిచేసే వెసులుబాటును అందిస్తున్నాయి.

వార్తల్లో ప్రధానంగా..

వార్తల్లో ప్రధానంగా..

లీజింగ్ నిర్ణయాలు ఉద్యోగులకు ఎక్కడి నుంచైనా పనిచేసేందుకు వీలుకల్పించినందున తీసుకున్నట్లు మెటా ప్రతినిధి ట్రేసీ క్లేటన్ సీటెల్ వార్తా పత్రికలకు వెల్లడించారు. దీంతో కంపెనీలు తమను తాము కాపాడుకునేందుకు మారిన ఆర్థిక పరిస్థితుల్లో ఎంత కష్టపడుతున్నాయనేది అర్థం అవుతోంది. రియల్ ఎస్టేట్ సమాచారం ప్రకారం 25 శాతం కార్యాలయాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడైంది.

English summary

Work From Home: రూటు మార్చిన టెక్ కంపెనీలు.. ఉద్యోగుల్లో చెప్పలేనంత ఆనందం.. పూర్తి వివరాలు | Tech jaints microsoft, meta giving work from home know details

Tech jaints microsoft, meta giving work from home know details
Story first published: Monday, January 16, 2023, 10:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X