For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TCS: లాభాలతో పాటు ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీసీఎస్.. కానీ చివర్లో ఎందుకలా అంది..?

|

TCS Results: ఇప్పటి వరకు ఐటీ కంపెనీల విషయంలో అందరి చూపు ఉద్యోగాల కోతలు, మూన్ లైటింగ్ వంటి అంశాలపై నడిచింది. అయితే తాజాగా కంపెనీలు తమ క్వార్టర్లీ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. నిన్న విడుదలైన TCS-Q2 ఫలితాలు పెట్టుబడిదారుల్లో కూడా ధైర్యాన్ని నింపింది. దీనికి తోడు కంపెనీ వెల్లడించిన ఇతర విషయాలను తెలుసుకుందాం.

అంచనాలను అందుకుంటూ..

అంచనాలను అందుకుంటూ..

టీసీఎస్ కంపెనీ రెండవ త్రైమాసికంలో 10,000 కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జించింది. కంపెనీ ఏకంగా రూ.10,465 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇవి మార్కెట్ నిపుణుల అంచనాలను అందుకున్నాయి. కంపెనీ మంచి లాభాలను పోస్ట్ చేసినప్పటికీ.. కంపెనీ గ్లోబల్ క్లైంట్స్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో 8.38 శాతం లాభాల్లో గ్రోత్ కనిపించింది.

వేరియబుల్ పే..

వేరియబుల్ పే..

కంపెనీలో పనిచేస్తున్న 70 శాతం మంది ఉద్యోగులకు పూర్తి వేరియబుల్ పే చెల్లిస్తామని టెక్ దిగ్గజం ఈ సందర్భంలో వెల్లడించింది. అయితే మిగిలిన 30 శాతం మంది ఉద్యోగుల విషయంలో వారు పనిచేస్తున్న బిజినెస్ యూనిట్ పనితీరు ఆధారంగా వీటిని చెల్లించనున్నట్లు TCS CHRO మిలింద్ లక్కడ్ వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే కంపెనీ ఎక్కువ మంది ఉద్యోగులకు శుభవార్త చెప్పిందనే చెప్పుకోవచ్చు.

మూన్ లైటింగ్ పై కామెంట్..

మూన్ లైటింగ్ పై కామెంట్..

ప్రస్తుతం ఐటీ రంగంలో మూన్ లైటింగ్ వివాదం నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై టీసీఎస్ కంపెనీ అధికారికంగా మెుదటి సారి స్పందించింది. తమ దగ్గర పనిచేస్తూ.. ఒకే సారి రెండు ఉద్యోగాలను నిర్వహించటం కంపెనీ సిద్ధాంతానికి, సంస్కృతికి పూర్తి వ్యతిరేకమైనదని వెల్లడించింది. దీనిని నైతిక పరమైన అంశంగా తాము భావిస్తామని కంపెనీ TCS CHRO మిలింద్ లక్కడ్ అన్నారు. ఇతర కంపెనీలు ఉద్యోగులను తొలగించినప్పటికీ టీసీఎస్ అలాంటి నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదు.

లాభాలు ఓకే స్టాక్ కొనాలా..?

లాభాలు ఓకే స్టాక్ కొనాలా..?

కంపెనీకి మంచి లాభాలు వచ్చాయి ఓకే. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లను కొనాలా..? వద్దా..? అనే సందిగ్దత అనేక మంది ఇన్వెస్టర్లలో కొనసాగుతోంది. ఎందుకంటే మాంద్యం భయాల వల్ల ఇప్పటికే అనేక ఐటీ స్టాక్స్ కనిష్ఠాలకు చేరుకున్నాయి కాబట్టి. ప్రస్తుతం ప్రముఖ బ్రోకరేజ్ అంచనాల ప్రకారం ఐటీ రంగంలోని ఇతర కంపెనీలతో పోల్చితే TCS మంచి పనితీరు కనబరుస్తుందని తెలుస్తోంది. స్టాక్ కు వారు outperform రేటింగ్ అందించారు.

ఉద్యోగాల సంగతి..

ఉద్యోగాల సంగతి..

కంపెనీ తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం రెండవ త్రైమాసికంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. రానున్న కాలంలో మరో 10,000 నుంచి 12,000 మంది ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ కాలంలో కంపెనీ ఉద్యోగుల రాజీనామాల రేటు 21.5 శాతంగా ఉంది. దీనిని మెుదటి త్రైమాసికంలోని 19.7 శాతం కంటే కొంచెం ఎక్కువని చెప్పుకోవాలి.

English summary

TCS: లాభాలతో పాటు ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీసీఎస్.. కానీ చివర్లో ఎందుకలా అంది..? | tcs recorded good profits and clarified over moonlighting and variable pay

tcs recorded good profits and clarified over moonlighting and variable pay
Story first published: Tuesday, October 11, 2022, 10:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X