For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TCS సీఈవో వేతన ప్యాకేజీలో 16% కోత, వారి శాలరీలోను భారీ కట్

|

కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ కంపెనీలలో వేతన కోతలు కొనసాగుతున్నాయి. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉన్నతాధికారులకు కూడా శాలరీలో కోత తప్పలేదు. కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపినాథన్ వేతన ప్యాకేజీ గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో 16 శాతం తగ్గింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.16.02 కోట్ల పారితోషికం అందుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇది రూ.13.3 కోట్లకు తగ్గింది.

మోడీ ప్యాకేజీ ఆఫర్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఎలా, ఎంత ప్రయోజనం?మోడీ ప్యాకేజీ ఆఫర్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఎలా, ఎంత ప్రయోజనం?

2019-20లో సీఈవో ఆదాయం ఇలా..

2019-20లో సీఈవో ఆదాయం ఇలా..

సీఈవో రాజేష్ గోపినాథన్ వేతన ప్యాకేజీ 16 శాతం తగ్గినట్లు వార్షిక నివేదికలో టీసీఎస్ వెల్లడించింది. టీసీఎస్ వార్షిక నివేదిక ప్రకారం 2019-20లో గోపినాథన్ వేతనంగా రూ.1.35 కోట్లు, ప్రోత్సాహకాలు రూ.1.29 కోట్లు, కమీషన్ రూ.10 కోట్లు, అలవెన్సులు రూ.72.82 లక్షలు తీసుకున్నారు.

అంతకుముందు (2018-19) ఆర్థిక సంవత్సరంలో రాజేష్ గోపినాథన్ వేతనంగా రూ.1.15 కోట్లు, ప్రోత్సాహకాలు రూ.1.26 కోట్లు, కమీషన్ రూ.13 కోట్లు, అలవెన్సులు రూ.60.36 లక్షలు తీసుకున్నారు.

వీరి శాలరీ కూడా తగ్గింది

వీరి శాలరీ కూడా తగ్గింది

టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) గణపతి సుబ్రహ్మణియన్ వేతన ప్యాకేజీ రూ.11.61 కోట్ల నుండి రూ.12.9 శాతం తగ్గి రూ.10.1 కోట్లకు పరిమితం అయింది.

టీసీఎస్ ముఖ్య ఆర్థిక అధికారి రామకృష్ణన్ వేతనం రూ.4.13 కోట్ల నుండి 3.63 శాతం తగ్గి రూ.3.98 కోట్ల ప్యాకేజీ పొందారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో కరోనా కారణంగా వేతనాలు తగ్గినట్లు కంపెనీ తెలిపింది.

టీసీఎస్ డైరెక్టర్ల వేతనం కూడా భారీగా తగ్గింది. ఇండిపెండెంట్ అండ్ ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వేతనం రూ.12.43 కోట్ల నుండి రూ.9.20 కోట్లకు తగ్గింది.

గత ఆర్థిక సంవత్సరంలో పెంపు

గత ఆర్థిక సంవత్సరంలో పెంపు

2018-19లో నాన్-మేనేజరల్ స్టాప్‌కు సగటున 6 శాతం వేతనం పెంచారు. ఇండియా బయటి ఉద్యోగులకు దాదాపు 2 శాతం నుండి 6 శాతం పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా ఉన్నతాధికారుల వేతనాలు భారీగా తగ్గాయి.

ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం

ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు కూడా వచ్చే కొద్ది నెలలు సవాళ్లు ఎదుర్కొంటాయని, టీసీఎస్ ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చంద్రశేఖరన్ చెప్పారు. తిరోగమనంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. కరోనా తర్వాత కొత్త పరిస్థితులను కంపెనీలు ఆకళింపు చేసుకోవడంలో టెక్నాలజీది ముఖ్య పాత్ర అన్నారు.

English summary

TCS సీఈవో వేతన ప్యాకేజీలో 16% కోత, వారి శాలరీలోను భారీ కట్ | TCS management take home smaller pay packets

The annual incomes of top executives at Tata Consultancy Services fell in the just-concluded fiscal year, as India’s largest IT services provider posted slower growth due to business uncertainty triggered by the Covid-19 pandemic.
Story first published: Thursday, May 21, 2020, 7:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X