For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Salary Hike: ఆనందంలో TCS ఉద్యోగులు.. జీతాల పెంపు ప్రకటించిన కంపెనీ.. ఎంత శాతమంటే..?

|

Salary Hike: అసలే పండుగల సీజన్ మెుదలైంది. పైగా కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇలాంటి సందర్భంలో దేశీయ ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ ఉద్యోగులకు శుభవార్త వెల్లడించింది. జీతాల పెంపు గురించి ప్రకటించటంతో టెక్కీల్లో కొత్త జోష్ నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జీతాల పెంపు ఇలా..

జీతాల పెంపు ఇలా..

టెక్ దిగ్గజం టీసీఎస్ తనవద్ద పనిచేస్తు మెుత్తం 6 లక్షల ఉద్యోగుల్లో దాదాపుగా 4 లక్షల మందికి క్రిస్మస్ సందర్భంగా 20 శాతం మేర జీతం పెరుగుతోంది. మిగిలిన 30 శాతం మందికి పనితీరు ఆధారంగా పరిహారం ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ 70 శాతం మంది ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ వేతనాన్ని ప్రకటించిన తర్వాత తాజా ప్రకటన వచ్చింది. అయితే దీనిపై కంపెనీని సంప్రదించగా ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది.

రికార్డు లాభాలు..

రికార్డు లాభాలు..

వేరియబుల్ పే అనేది పనితీరు ఆధారంగా చెల్లించే మెుత్తం. ఇది ప్రధానంగా కంపెనీ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. టీసీఎస్ 2022 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 10,431 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఒక త్రైమాసికంలో రూ.10 వేల మార్కును దాటడంతో రికార్డు లాభాలను ఆర్జించింది. వేరియబుల్ పే గురించి సెప్టెంబరు క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకటించిన సమయంలోనే TCS చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ప్రకటించారు.

విప్రో, ఇన్ఫోసిస్..

విప్రో, ఇన్ఫోసిస్..

ఐటీ సేవల రంగంలోని టీసీఎస్ ప్రత్యర్థి కంపెనీలైన విప్రో, ఇన్ఫోసిస్ మొదటి త్రైమాసికంలో తమ సిబ్బందికి TCS వలె వేరియబుల్ పరిహారం తగ్గించిన తర్వాత 100 శాతం వేరియబుల్ చెల్లింపును అమలు చేయడం జరిగింది. విప్రోలోని ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు.. సీనియర్ సిబ్బంది పొందే వేరియబుల్ రెమ్యునరేషన్‌లో 70 శాతం మాత్రమే పొందారు. ఇన్ఫోసిస్ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతోంది.

కొత్త నియామకాలు..

కొత్త నియామకాలు..

జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 9,840 మంది ఉద్యోగులను కంపెనీలో కొత్తగా నియమించుకుంది. దీంతో సెప్టెంబర్ 30 నాటికి కంపెనీలో పనిచేస్తున్న మెుత్తం ఉద్యోగుల సంఖ్య 6,16,171కి చేరుకుంది. ఇందులో 157 జాతీయులు, 35.7 శాతం మహిళలు ఉన్నారు. ఆర్గానిక్ టాలెంట్ డెవలప్‌మెంట్‌లో నిరంతరం పెట్టుబడి పెట్టడం ద్వారా కొత్త టెక్నాలజీల చుట్టూ ఉన్న సేవల కోసం TCS డిమాండ్‌ను అందిస్తోంది.

అట్రిషన్ రేటు ఇలా..

అట్రిషన్ రేటు ఇలా..

సెప్టెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ అట్రిషన్ రేటు 21.5 శాతంగా ఉంది. ఇది మునుపటి త్రైమాసికంలో నమోదైన 19.7 శాతం కంటే ఎక్కువ. కాగా మార్చి త్రైమాసికంలో ఉద్యోగుల టర్నోవర్ రేషియో 17.4 శాతంగా ఉంది.

English summary

Salary Hike: ఆనందంలో TCS ఉద్యోగులు.. జీతాల పెంపు ప్రకటించిన కంపెనీ.. ఎంత శాతమంటే..? | Tcs announced 20% salary hike this Christmas and remaining get performance hike

Tcs announced 20% salary hike this Christmas and remaining get performance hike
Story first published: Friday, December 30, 2022, 9:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X