For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్‌ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్

|

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్‌లో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మూడో స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్ ఐదో స్థానం నుండి నాలుగుకు ఎగబాకింది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాది విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో యాక్సెంచర్, IBM మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానంలో టీసీఎస్ ఉంది. టాప్ 10 ఐటీ సర్వీస్ బ్రాండ్లలో భారత్ నుండి నాలుగు కంపెనీలు ఉన్నాయి. టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో ఉన్నాయి.

2021లో భారత్ అదరగొడుతుంది! ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి చీఫ్ ఎకనమిస్ట్ హెచ్చరిక2021లో భారత్ అదరగొడుతుంది! ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి చీఫ్ ఎకనమిస్ట్ హెచ్చరిక

దటీజ్ TCS

దటీజ్ TCS

గత ఏడాదిలో టీసీఎస్ బ్రాండ్ వ్యాల్యూ 11 శాతం పెరిగి 1500 కోట్ల డాలర్లకు చేరుకుంది. దీంతో IBMతో వ్యత్యాసం భారీగా తగ్గింది. ఈ ఏడాదిలో టీసీఎస్ విలువ పెరగడంతో పాటు ఐబీఎం బ్రాండ్ వ్యాల్యూ 24 శాతం మేర తగ్గింది. టీసీఎస్ బ్రాండ్ 2020తో పోలిస్తే 2021లో 1.4 బిలియన్ డాలర్లు ఎగిసింది.

వృద్ధి పరంగా 25 ఐటీ కంపెనీల్లో టీసీఎస్‌దే అత్యధికం. సగటున ఐటీ కంపెనీలన్నింటి బ్రాండ్ వ్యాల్యూ 3 శాతం క్షీణించగా, టీసీఎస్ 11 శాతం పెరిగింది. 2020 డిసెంబర్ త్రైమాసికంలో 6.8 బిలియన్ డాలర్ల డీల్స్ దక్కించుకుంది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ కూడా గరిష్టాన్ని తాకింది. IBMకు చేరువైన టీసీఎస్ రెండో స్థానానికి దగ్గరలో ఉందని బ్రాండ్ ఫైనాన్స్ సీఈవో తెలిపారు.

టాప్ 10 ఇవే

టాప్ 10 ఇవే

కరోనా తగ్గి, ఆర్థిక రికవరీ క్రమంగా మెరుగవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐటీ రంగంతోపాటు అమెరికా, యూరప్ దేశాల్లో ఫైనాన్షియల్ సెక్టార్‌లో పెట్టుబడులు పెరగడంతో వచ్చే ఏడాదిలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ర్యాంకుల పరంగా1వ స్థానంలో యాక్సెంచర్ (26 బిలియన్ డాలర్లు), 2వ స్థానంలో IBM (16.1 బిలియన్ డాలర్లు), 3వ స్థానంలో TCS (14.9 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయి.

4వ వ స్థానంలో ఇన్ఫోసిస్(8.4 బిలియన్ డాలర్లు), 5వ స్థానంలో కాగ్నిజెంట్ (8.03 బిలియన్ డాలర్లు), క్యాప్‌జెమిని 6వ స్థానంలో (6.75 బిలియన్ డాలర్లు, 7వ స్థానంలో హెచ్‌సీఎల్ (5.52 బిలియన్ డాలర్లు), ఎన్‌టీటీ డేటా 8వ స్థానంలో (5.08 బిలియన్ డాలర్లు), విప్రో 9వ స్థానంలో (4.3 బిలియన్ డాలర్లు), శాంసంగ్ ఎస్డీఎస్ 10వ స్థానంలో (3.69 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయి.

ఇన్ఫోసిస్, విప్రో ముందుకు

ఇన్ఫోసిస్, విప్రో ముందుకు

యాక్సెంచర్, ఐబీఎం, టీసీఎస్ గత ఏడాది కూడా ఇదే స్థానంలో ఉన్నాయి. ఇన్ఫోసిస్ 5వ స్థానం నుండి 4కు ఎగబాకింది. కాగ్నిజెంట్ 4వ స్థానం నుండి 5వ స్థానానికి పడిపోయింది. హెచ్‌సీఎల్ 9వ స్థానం నుండి 7వ స్థానానికి, విప్రో 10వ స్థానం నుండి 9వ స్థానానికి, శాంసంగ్ ఎస్డీఎస్ 11వ స్థానం నుండి 10కి ఎగబాకింది. ఇదిలా ఉండగా, ప్రపంచ టాప్ 100 బ్రాండ్లలో ఆపిల్ మొదటి స్థానంలో ఉంది. భారత్ నుండి టాటా గ్రూప్ 77వ స్థానంలో నిలిచింది. అమెజాన్ 2వ స్థానంలో ఉండగా, ఆ తర్వాత వరుసగా గూగుల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్ ఉన్నాయి.

English summary

దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్‌ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్ | TCS 3rd Most Valued IT Services Brand Globally, Infosys and HCL secure spots in top 10

Tata Consultancy Services (TCS) has been ranked third most-valued IT services brand globally, after Accenture and IBM, according to a report by Brand Finance. Four Indian IT services companies — TCS, Infosys, HCL and Wipro — secured spots in the top-10 global tally.
Story first published: Thursday, January 28, 2021, 9:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X