For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాద్ సే విశ్వాస్ జూన్ 30లోగా చెల్లించాలి, ఈ నెలలోపు జరిమానా లేదు

|

ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారంలో సమయం, ధనం వృథాను నివారించేందుకు వివాద్ సే విశ్వాస్ పథకాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కమిషనర్ (అప్పీల్స్), ఐటీఏటీ, హైకోర్టు, సుప్రీం కోర్టు, డెట్ రికవరీ ట్రైబ్యునళ్ల పరిధిలోని 4.83 లక్షల ప్రత్యక్ష పన్ను వివాదాల్లో రూ.9.32 లక్షల కోట్ల మొత్తం స్తంబించి ఉందని లోకసభలో ప్రత్యక్ష పన్నుల వివాద్ సే విశ్వాస్ బిల్లు 2020ని ప్రవేశ పెడుతూ నిర్మల చెప్పారు.

PAN-Aadhaar link: మార్చి 31లోగా లింక్ చేయకుంటే భారీ షాక్, మళ్లీ అప్లై చేయొద్దు..PAN-Aadhaar link: మార్చి 31లోగా లింక్ చేయకుంటే భారీ షాక్, మళ్లీ అప్లై చేయొద్దు..

జూన్ 30వ తేదీ వరకు అమలులో బిల్లు

జూన్ 30వ తేదీ వరకు అమలులో బిల్లు

వివాద్ సే విశ్వాస్ బిల్లు ఈ ఏడాది జూన్ 30వ తేదీనాటికి అమలులో ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. మార్చి 31వ తేదీ నాటికి చెల్లిస్తే జరిమానాలు ఉండవు. జూన్ 30లోగా చెల్లిస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

సోదాల కేసు అయితే..

సోదాల కేసు అయితే..

సోదా కేసులు అయితే... పన్ను, వడ్డీ, పెనాల్టీ రూపంలో చెల్లించాల్సిన మొత్తానికి మరో 25% కలిపి మొత్తం 125% మార్చి 31వ తేదీ నాటికి చెల్లించి వివాదాలు పరిష్కరించుకోవచ్చు. మార్చి 31లోపు సాధ్యం కాకుంటే తర్వాత జూన్ 31 నాటికి 135% శాతం చెల్లించాలి.

మార్చి 31లోపు చెల్లిస్తే వడ్డీ, జరిమానా మినహాయింపు

మార్చి 31లోపు చెల్లిస్తే వడ్డీ, జరిమానా మినహాయింపు

సోదాలు జరగని కేసులు అయితే పన్ను, పెనాల్టీ, వడ్డీ రేటుపై వివాదముంటే ఆ మొత్తాన్ని మార్చి 31లోపు చెల్లించి, వివాదం పరిష్కరించుకోవచ్చు. గడువు దాటితే జూన్ చివరికి 110% చెల్లించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆదాయపు పన్ను కింద రూ.1,00,000 చెల్లించగా ఐటీ సాఖ మాత్రం రూ.1,50,000గా తేల్చితే దీనికి రూ.20,000 వడ్డీ, రూ.1,00,000 పెనాల్టీ కింద చెల్లించాలని డిమాండ్ చేసి ఉంటే అప్పుడు వివాదంలో ఉన్న మొత్తం రూ.1,70,000 అవుతుంది. దీనిని వ్యతిరేకిస్తూ పన్ను చెల్లింపుదారు అప్పీల్ దాఖలు చేసి ఉంటే ఈ కేసులో కేవలం రూ.50,000 మార్చి చివరి నాటికి చెల్లించడం ద్వారా మాఫీ చేసుకోవచ్చు. మార్చి తర్వాత అయితే 10 శాతం అదనంగా చెల్లించాలి. అంటే అప్పుడు రూ.55,000 చెల్లించాలి.

పెనాల్టీ, వడ్డీ రేటుపై వివాదమైతే

పెనాల్టీ, వడ్డీ రేటుపై వివాదమైతే

కేవలం పెనాల్టీ, వడ్డీ రేటుపై వివాదం అయితే చెల్లించాల్సిన మొత్తంలో మార్చి 31వ తేదీ నాటికి కనీసం 25% చెల్లించాలి. జూన్ లోపు అయితే 30% అదనం అవుతుంది. ఇవి పన్ను చెల్లింపుదారులు అప్పీల్ దాఖలు చేసిన కేసులకు వర్తిస్తాయి. ఆదాయపు పన్ను శాఖ అప్పీల్‌కు వెళ్లి ఉంటే చెల్లించాల్సిన మొత్తం ఇంతకంటే తక్కువగా ఉంటుంది.

వీరు పరిష్కరించుకోలేరు

వీరు పరిష్కరించుకోలేరు

పరిశోధన, స్వాధీనంలో రికవరీ రూ.5 కోట్ల వరకు ఉంటే, బిల్లు పార్లమెంటులో ఆమోదించాకే వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్రతిపాదిత పథకం కొన్ని వివాదాలకు వర్తించదు. పన్ను చెల్లింపుదారుడికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్‌ ఆరంభమైనా.. సోదాలు జరిగి రూ.5 కోట్లకు పైగా విలువైన స్వాధీనాలు చోటు చేసుకున్నా... బయటకు వెల్లడించని విదేశీ ఆదాయం, విదేశీ ఆస్తులు కలిగి ఉన్న కేసులైనా.. భారతీయ శిక్షాస్మృతి, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్నా... అలాంటి వారు ఈ పథకం కింద వివాదాలు పరిష్కరించుకోలేరు.

English summary

వివాద్ సే విశ్వాస్ జూన్ 30లోగా చెల్లించాలి, ఈ నెలలోపు జరిమానా లేదు | Tax amnesty scheme: Nirmala Sitharaman moves Direct Tax Vivad Se Vishwas Bill

Finance Minister Nirmala Sitharaman moved the Direct Tax Vivad Se Vishwas Bill, 2020 for consideration and passing in the Lok Sabha on Monday.
Story first published: Tuesday, March 3, 2020, 8:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X