For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tata Motors: దుమ్ము దులిపిన షేర్లు- లాభాల పంట: 52 వారాల గరిష్ఠానికి

|

ముంబై: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ షేర్ల ధరలు ఇవ్వాళ దుమ్ము దులిపాయి. భారీ లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ఈ ఆటో దిగ్గజం షేర్ల ధరలు పెరుగుదల బాట పట్టడం ఇదే తొలిసారి. 52 వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి.. టాటా మోటార్స్ షేర్ల ధరలు. ఇన్వెస్టర్లకు లాభాట పంటను పండించాయి.

దీనికి కారణాలు లేకపోలేదు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాల్లో భారీ లాభాలను సాధించింది టాటా మోటార్స్. 5,407.79 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే 2021-2022లో ఇదే కాలానికి భారీ నష్టాలను చవి చూసిందీ ఆటో జెయింట్. 1,032.84 కోట్ల రూపాయల మేర నష్టాన్ని నమోదు చేసింది.

Tata Motors

సరిగ్గా ఏడాది తిరిగే సరికి ఈ నష్టాలను అధిగమించడమే కాకుండా నెట్ ప్రాఫిట్‌ను 5,407.79 కోట్ల రూపాయలకు చేర్చగలిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తరువాత ఏకంగా 83 శాతం మేర వృద్ధిరేటును అందుకుంది. మొత్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 1,05,932.35 కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలను నిర్వహించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైంది 78,439.06 కోట్ల రూపాయలే.

DMart Q4 results తరువాత భారీ నష్టాల్లో షేర్లుDMart Q4 results తరువాత భారీ నష్టాల్లో షేర్లు

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోల్చుకున్నా కూడా చివరి మూడు నెలల కాలంలో నమోదైన వ్యాపార లావాదేవీల సంఖ్య అధికమే. అక్టోబర్-నవంబర్-డిసెంబర్ కాలానికి టాటా మోటార్స్ సాగించిన వ్యాపార లావాదేవీల మొత్తం 88,488.59 కోట్ల రూపాయలు కాగా.. నాలుగో త్రైమాసికంలో ఈ సంఖ్య 1,05,932.35 కోట్ల రూపాయలకు చేరింది.

Tata Motors

ఇది కాస్తా ఇన్వెస్టర్లల్లో జోష్ నింపింది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఈ ఉదయం నుంచే అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడే మొత్తం ఈ కంపెనీ షేర్లు మరింత పెరగొచ్చంటూ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ నేపథ్యంలో- రిటైల్ ఇన్వెస్టర్లు టాటా మోటార్స్ షేర్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు.

ఫలితంగా 52 వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి ఆ కంపెనీ షేర్ల ధరలు. శుక్రవారం నాటితో పోల్చుకుంటే ఇవ్వాళ సుమారు నాలుగు శాతం మేర టాటా మోటార్స్ షేర్ల ధరలో పెరుగుదల కనిపించింది. ఒక్కో షేర్ ధర 15 రూపాయల మేర పెరిగింది. మధ్యాహ్నానికి రూ.14.25 పైసల మేర పెరుగుదలను నమోదు చేసుకుంది. రూ.530.20 పైసల వద్ద షేర్లు ట్రేడ్ అవుతోన్నాయి.

English summary

Tata Motors: దుమ్ము దులిపిన షేర్లు- లాభాల పంట: 52 వారాల గరిష్ఠానికి | Tata Motors share price skyrocketed by more than 4% today touched a fresh 52-week high

Stock price of auto giant Tata Motors skyrocketed by more than 4% on Monday after its strong numbers in the fourth quarter of FY23. The stock has even touched a fresh 52-week high.
Story first published: Monday, May 15, 2023, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X