For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు

|

Tata motors: టాటా మోటార్స్ వాహనాన్ని కొనాలనుకుంటున్నారా ?? అయితే అశోక్ లేలాండ్ తో పోలిస్తే కొంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సిందే. గతంలో భారీ తగ్గింపులను అందించిన టాటా సంస్థ.. ఇప్పుడు ఆ పద్ధతికి వీడ్కోలు పలికిందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది. దేశంలో సగానికి పైగా మీడియం, భారీ ట్రక్కులను టాటా మోటార్స్ విక్రయిస్తుండగా.. అతి తక్కువ మార్జిన్ తో వినియోగదారులకు అందిస్తూ వచ్చింది. మార్జిన్‌ లను మెరుగుపరచుకునే ప్రణాళికలో భాగంగా.. ట్రక్కులపై డిస్కౌంట్లను తగ్గించినట్లు వెల్లడించింది.

 ధరల యుద్ధానికి ముగింపు:

ధరల యుద్ధానికి ముగింపు:

గతేడాది సెప్టెంబరు నుంచి తమ ధోరణిని మార్చుకున్నట్లు టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ తెలిపారు. వినియోగదారులు, ఫైనాన్షియర్లు, భాగస్వాములతో అనేక పర్యాయాలు చర్చించిన తర్వాతే.. ధరల విషయంలో నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. వాణిజ్య వాహనాల మార్కెట్‌ లో అగ్రస్థానం పొందేందుకుగాను.. ధరల తగ్గింపు విధానాన్ని అనుసరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రత్యర్థి కంపెనీ అశోక్ లేలాండ్ మాత్రం డిస్కౌంట్లను కొనసాగించింది.

 మార్జిన్‌ లపై నియంత్రణ:

మార్జిన్‌ లపై నియంత్రణ:

ఏడాదికి పైగా తమ సంస్థ ఉత్పత్తులపై డిస్కౌంట్లు స్థిరంగా తగ్గినట్లు అశోక్ లేలాండ్ భారీ వాహనాలే బిజినెస్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. ఫలితంగా మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. గతేడాది మొదటి ఆరు నెలల్లో వస్తువుల ధరలు పెరిగినా.. మార్జిన్‌లపై మెరుగైన నియంత్రణ కలిగి ఉండటంతో అంతగా ప్రభావం చూపలేదన్నారు.

సింగిల్ డిజిట్ కే పరిమితం:

సింగిల్ డిజిట్ కే పరిమితం:

కమర్షియల్ వెహికల్స్ పరిశ్రమ ఈ ఏడాది చెప్పుకోదగ్గ స్థాయిలో వృద్ధిని నమోదు చేయలేదని అంచనాలు వెలువడుతున్నాయి. 2023-24లో ఆటోమోటివ్ విభాగం వృద్ధి.. కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే ఉంటుందని ప్రముఖ రేటింగ్ సంస్ ఇక్రా నివేదించింది. 2024కి గాను ప్యాసింజర్ వాహనాల, వాణిజ్య వాహనాల, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల డిమాండ్ కేవలం 4 నుంచి 10 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. 2023లో రెండంకెల వృద్ధి ఉంటుందని అభిప్రాయపడింది.

English summary

Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు | Tata motors cuts discounts on commercial and passenger vehicles

Tata motors medium, large vehicles price change
Story first published: Tuesday, January 24, 2023, 21:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X