For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్వెస్టర్లతో చర్చలు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్‌కు షాక్.. ఈ-కామర్స్‌లోకి టాటా గ్రూప్!

|

టాటా గ్రూప్ ఈ-కామర్స్ రంగంలోకి అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. తమ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం పెట్టుబడులకోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి. డిజిటల్ రంగంలో అమెరికా దిగ్గజాలు అమెజన్ ఇండియా, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ ముందున్నాయి. ఇప్పుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. జియోమార్ట్ ద్వారా అడుగు పెట్టింది. జియో ప్లాట్‌ఫాంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరించింది. భవిష్యత్తు అంతా ఈ-కామర్స్, డిజిటల్‌దే కావడంతో టాటా గ్రూప్ కూడా ఆ దిశగా దృష్టి సారించింది. రిలయన్స్, అమెజాన్ కంపెనీల్లో కన్స్యూమర్ బిజినెస్‌ను ఆధునికీకరించాలని టాటా గ్రూప్ యోచిస్తోంది.

<strong>టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఐటీ కంపెనీలపై యాక్సెంచర్ ఎఫెక్ట్! ఎందుకంటే?</strong>టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఐటీ కంపెనీలపై యాక్సెంచర్ ఎఫెక్ట్! ఎందుకంటే?

ఆసక్తి కలిగిన ఇన్వెస్టర్లతో చర్చలు

ఆసక్తి కలిగిన ఇన్వెస్టర్లతో చర్చలు

ఐటీ సేవలు, డ్రింక్స్, గోల్డ్ ఆర్నమెంట్స్, హోటల్స్, కార్లు, కాఫీ సహా వివిధ రంగాల్లో ఉన్న టాటా గ్రూప్ ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే రంగంలో ఉన్న వారికి గట్టి పోటీనిచ్చేలా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఈ ప్లాట్‌ఫాంలో వాటాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కలిగిన ఇన్వెస్టర్లతో టాటా సన్స్ చర్చలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. ప్రపంచ టెక్నాలజీ కంపెనీలతో సహా ఆర్థిక, వ్యూహాత్మక ఇన్వెస్టర్లను అన్వేషించేందుకు సలహాదారులతో కలిసి పని చేయనుంది.

అన్నీ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ కిందకు..

అన్నీ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ కిందకు..

కాఫీ నుండి కార్ల వరకు ఎన్నో రంగాల్లో విస్తరించిన 113 బిలియన్ డాలర్ల టాటా సన్స్ ప్రయివేట్ లిమిటెడ్ డిజిటల్ మార్గంలోకి వచ్చేందుకు గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు, వ్యూహాత్మక పెట్టుబడిదారులను తీసుకు రావడానికి సలహాదారులతో కలిసి పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కొత్త డిజిటల్ ప్లాట్ ఫామ్ కిందకు టాటా గ్రూప్ పరిధిలోని డిజిటల్ అసెట్స్ అన్నింటిని తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఒప్పందానికి దారి తీస్తుందని కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. టాటా సన్స్ దీనిపై స్పందించాల్సి ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి గూగుల్, ఫేస్‌బుక్ సహా దిగ్గజ కంపెనీల నుండి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

వాటిని ఏకీకృతం చేసేలా..

వాటిని ఏకీకృతం చేసేలా..

బయటి పెట్టుబడులను తీసుకువస్తే టాటా డిజిటల్‌కు ఇది అదనపు బలం అవుతుందని అంటున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి అన్ని వ్యాపారాలను దెబ్బతీసింది. టాటా స్టీల్ లిమిటెడ్ గ్రూప్ నికర రుణాలు జూన్ 30వ తేదీ నాటికి 14 బిలియన్ డాలర్లు కాగా, టాటా మోటార్స్ నికర ఆటోమోటివ్ డెబిట్ రుణం 6.5 బిలియన్ డాలర్లుగా ఉంది. టాటా గ్రూప్ ఇప్పటికే చైన్ స్టోర్స్ కలిగి ఉంది. ఇందులో తనిష్క్ జ్యువెల్లర్స్, టైటాన్ వాచ్ షోరూమ్స్, స్టార్ బజార్ సూపర్ మార్కెట్లు, తాజ్ హోటల్స్ చైన్ ఉన్నాయి. వీటిని ఏకీకృతం చేసేలా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఉండనుందని తెలుస్తోంది.

English summary

ఇన్వెస్టర్లతో చర్చలు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్‌కు షాక్.. ఈ-కామర్స్‌లోకి టాటా గ్రూప్! | Tata group in talks with investors for stake sale in new digital platform

The launch of the Tata group's all in one app would effectively serve as a one-stop shop for a wide range of its consumer products and services.
Story first published: Tuesday, September 29, 2020, 8:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X