For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bonus: ఏడాది జీతం బోనస్ గా అందించిన కంపెనీ.. మాంద్యంలో ఉద్యోగుల పండుగ..

|

Bonus: ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు కనీసం జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి. కానీ ఇవన్నీ మాత్రం ఒక కంపెనీకి వర్తించవు. అవును ఇలాంటి కఠిన సమయంలో కంపెనీ తన ఉద్యోగులపై బోనస్ రూపంలో డబ్బుల వర్షం కురిపించింది.

కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది తైవాన్‌లోని అత్యంత ప్రసిద్ధ కార్గో షిప్పింగ్ కంపెనీ ఎవర్‌గ్రీన్ మెరైన్ గురించి. ఈ షిప్పింగ్ కంపెనీ 2022లో రికార్డ్ స్థాయిలో లాభాన్ని నమోదు చేసింది. అయితే ఈ లాభాలను తన ఉద్యోగులకు సైతం పంచాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. అందుకే వారు కలలో కూడా ఊహించని విధంగా బోనస్ ను ప్రకటించింది.

బోనస్..

బోనస్..

చాలా కంపెనీలు సాధారణంగా రోజుల జీతాన్ని బోనస్ రూపంలో అందిస్తుంటాయి. మరికొన్ని చోట్ల గరిష్ఠంగా ఒక నెల జీతాన్ని బోనస్ రూపంలో ఇవ్వటం మనం చూస్తుంటాం. కానీ ఎవర్‌గ్రీన్ మెరైన్ మాత్రం తన ఉద్యోగులకు ఒక్కొక్కరికి 10 నుంచి 52 వారాల జీతాన్ని బోనస్ రూపంలో చెల్లిస్తోంది. కంపెనీలో ఒక జూనియర్ ఉద్యోగి నెల జీతం NT$40,000గా ఉంటే అతను NT$2 మిలియన్లను బోనస్ రూపంలో అందుకుని ఇంటికి తీసుకెళ్లాడు.

డబ్బులు కుమ్మరిస్తూ..

డబ్బులు కుమ్మరిస్తూ..

2021లో ఎవర్‌గ్రీన్ మెరైన్ తన ఉద్యోగులందరికీ 40 నెలల జీతాన్ని బోనస్ రూపంలో అందించింది. ఇదిలా ఉండగా 2022లో తన పాత రికార్డును తానే బద్దలుకొడుతూ ఏకంగా 52 నెలల పేఅవుట్‌ను ప్రకటించి ఉద్యోగులందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది కంపెనీ. ప్రస్తుతం ఇది తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్ మెరైన్ చెల్లించిన అతిపెద్ద బోనస్. ఇది ఎవర్‌గ్రీన్ మెరైన్ మేనేజ్‌మెంట్ సాధించిన విజయంగా పరిగణించబడుతోంది.

కరోనా సమయంలో..

కరోనా సమయంలో..

కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాల మధ్య రాకపోకలు ప్రత్యక్షంగా నిలిచిపోయిన తరుణంలో లాక్‌డౌన్ కారణంగా ఎవర్‌గ్రీన్ మెరైన్ కంపెనీ వ్యాపారం బాగా ప్రభావితమైంది. అయితే 2022లో అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నప్పటికీ ఎగుమతులు, దిగుమతులు బాగానే కొనసాగాయి.

మెగా లాభం..

మెగా లాభం..

కంపెనీ 2022 మెుదటి మూడు త్రైమాసికాల్లో దాదాపుగా NT$304.35 బిలియన్ల నికర లాభాన్ని నమోదు చేసింది. షిప్పింగ్ రేట్ల పెరుగుదల, పుంజుకున్న వ్యాపారాల కారణంగా కంపెనీ రికార్డు లాభాలను ఆర్జించింది. షిప్పింగ్ విభాగంలోని ఉద్యోగులకు రికార్డు బోనస్ అందించినప్పటికీ.. ముఖ్యంగా ఎయిర్‌లైన్ వ్యాపార విభాగంలో ఉన్నవారు చాలా తక్కువ బోనస్ మొత్తాలను అందుకున్నట్లు వెల్లడైంది. గ్రౌండ్ స్టాప్ ఆల్ అవుట్ స్ట్రైక్‌లో పాల్గొన్నప్పుడు న్యూ ఇయర్ వారంలో తైపీ నగరంలోని టాయోవాన్ విమానాశ్రయంలో 4,000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు.

Read more about: bonus salary shipping trending viral
English summary

Bonus: ఏడాది జీతం బోనస్ గా అందించిన కంపెనీ.. మాంద్యంలో ఉద్యోగుల పండుగ.. | Taiwan Shipping Company Evergreen gave shipping employees 52 weeks salary as bonus

Taiwan Shipping Company Evergreen gave shipping employees 52 weeks salary as bonus
Story first published: Sunday, January 8, 2023, 16:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X