For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్విగ్గీ గుడ్‌న్యూస్, డెలివరీ బాయ్స్‌కు అదిరిపోయే ఆఫర్

|

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా స్విగ్గీ తన డెలివరీ బాయ్స్ పూర్తిస్థాయి ఉద్యోగులుగా మారే అవకాశం కల్పిస్తోంది. నిర్వహణ సంబంధిత స్థాయిలో ఉద్యోగ అవకాశాలను ఇవ్వడంతో పాటు స్థిరమైన ఆదాయం, అదనపు ప్రయోజనాలను అందిస్తామని తెలిపింది. ప్రస్తుతం స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌గా పని చేస్తున్న వారు స్టెప్ ఎ హెడ్ కార్యక్రమం కింద ఈ ఉద్యోగాలలో చేరవచ్చు.

డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ తమ సంస్థకు వెన్నెముక అని స్విగ్గీ ఎప్పటికీ నమ్ముతుందని, దేశవ్యాప్తంగా 2.7 లక్షల మందికి ఆదాయ అవకాశాలు కల్పించిందని, చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ పార్ట్ టైమ్ ఉద్యోగంగా లేదా అదనపు ఆదాయ వనరుగా చాలామంది పని చేస్తున్నరని తెలిపింది. అలాంటి వారి కోసం తాము మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. స్టెప్ ఎ హెడ్ పేరుతో సంస్థ నిర్వహణ స్థాయిలో వైట్ కాలర్ ఉద్యోగులుగా మారే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

Swiggy upskill delivery boys to become company employees

స్విగ్గీ ఫుల్ టైమ్ ఉద్యోగిగా పని చేయడానికి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లో డిగ్రీ పట్టభద్రులై, చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ప్లీట్ మేనేజర్స్‌గా వివిధ పాత్రలు పోషించవలసి ఉంటుంది. డెలివరీ బాయ్స్ లాగ్-ఇన్ అవర్స్, డెలివరీ క్యాన్సిలేషన్స్, సమస్యల పరిష్కారం, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కోసం ప్రత్యేక ప్రాజెక్టులపై పని చేయవలసి ఉంటుంది. డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ నుండి 20 శాతం మందిని ప్లీట్ మేనేజర్లుగా నియమించుకోవాలని స్విగ్గీ యోచిస్తోంది. ఎక్కువ కాలం స్విగ్గీలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

English summary

స్విగ్గీ గుడ్‌న్యూస్, డెలివరీ బాయ్స్‌కు అదిరిపోయే ఆఫర్ | Swiggy upskill delivery boys to become company employees

Swiggy on Monday announced the launch of an industry-first-accelerator programme for its delivery executives to transition into full-time, managerial-level jobs with a fixed salary and additional benefits.
Story first published: Monday, April 25, 2022, 19:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X