For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్చి 31కు ముందు బీఎస్-4 వాహనాలకు రిజిస్ట్రేషన్‌కు ఓకే

|

BS-4 వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌కు ముందు విక్రయించిన, ఈ-వాహన్ పోర్టల్‌లో నమోదయిన వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుమతించింది. పోర్టల్‌లో నమోదు కానీ, మార్చి 31వ తేదీ తర్వాత విక్రయించిన వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుమతించడం లేదని తేల్చి చెప్పింది. ఢిల్లీ-ఎన్సీఆర్‌కు ఈ ఆదేశాలు వర్తించవని తెలిపింది. అత్యున్నత న్యాయస్థానం తాజా ఉత్తర్వులతో మార్చి 31 కంటే ముందు వాహనాలు కొని రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయిన వారికి ఊరట కలగనుంది.

బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్లను జూలై 31వ తేదీన సుప్రీం కోర్టు నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వీటిని నిలిపివేయాలని ఆ రోజు పేర్కొంది. లాక్ డౌన్ సమయంలో అసాధారణ రీతిలో జరిగిన వాహన విక్రయాల అంశం తేలేవరకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని అధికారులను ఆదేశించింది. లాక్ డౌన్ సమయంలో ఇలాంటి విక్రయాలపై గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రోజు విచారించి, ఆదేశాలు జారీ చేసింది.

నియామకాలు నిలిపివేసిన టిక్‌టాక్, సేల్ టాక్స్.. ఉద్యోగుల్ని నిలుపుకునే యత్నంనియామకాలు నిలిపివేసిన టిక్‌టాక్, సేల్ టాక్స్.. ఉద్యోగుల్ని నిలుపుకునే యత్నం

Supreme Court allows registration of BS IV vehicles sold before lockdown

కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం మార్చి 12 నుండి మార్చి 31వ తేదీ మధ్య 1.1 మిలియన్ బీఎస్ 4 వాహనాల విక్రయాలు జరిగాయి. ఇందులో మార్చి 29 నుండి మార్చి 31 మధ్య అంటే మూడు రోజుల్లో 2,50,000కు పైగా వాహనాల విక్రయం జరిగింది. మరోవైపు పెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) సమర్పించిన డేటా ప్రకారం 225,247 విక్రయాలు జరిగాయి. ఆ సమయంలో విక్రయించిన పలు వాహనాలకు సంబంధించిన వివరాలు ఈ-వాహన్ పోర్టల్‌లో నమోదు కాలేదని సుప్రీం కోర్టు దృష్టికి వచ్చింది. దీంతో వాటి రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వలేదని తెలిపింది.

English summary

మార్చి 31కు ముందు బీఎస్-4 వాహనాలకు రిజిస్ట్రేషన్‌కు ఓకే | Supreme Court allows registration of BS IV vehicles sold before lockdown

The Supreme Court on Thursday allowed registration of BS-IV compliant vehicles that were sold before the nationwide lockdown commenced in March and the details of which were uploaded on the government’s Vahan portal
Story first published: Thursday, August 13, 2020, 21:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X