For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Success Story: అనుభవం లేకున్నా వ్యాపారంలో సక్సెస్.. రూ.1700 కోట్ల విలువైన కంపెనీ వివరాలు..

|

Success Story: Bira91 వ్యవస్థాపకుడు అంకుర్ జైన్ 2015లో బీరా 91 అనే క్రాఫ్ట్ బీర్‌ను విడుదల చేశారు. దీనిని ప్రారంభించిన రెండేళ్లలోనే అది భారతీయ యువతకు ఇష్టమైన బీర్ బ్రాండ్‌గా మారిపోయింది. యూత్‌లో ఈ బీర్ బ్రాండ్ ఇంతగా సక్సెస్ అవుతుందని తాను కూడా ఊహించలేదని వ్యవస్థాపకుడు అంకుర్ జైన్ అన్నారు. చిన్న పెట్టుబడిని రూ.1,700 కోట్ల కంపెనీగా మార్చటంలో అంకుర్ జైన్ కృషి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

2007లో విదేశాల నుంచి తిరిగి వచ్చి..

2007లో విదేశాల నుంచి తిరిగి వచ్చి..

అతనికి మద్యం వ్యాపారం చేసే ఆలోచన లేదు. చికాగో యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాతే తాను వ్యాపారం చేస్తానని అంకుర్ నిర్ణయించుకున్నాడు, ఆపై అతను 2007లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. దేశానికి వచ్చిన తర్వాత.. బీర్లలో ఆప్షన్లు ఎక్కువగా లేవని అతను చూశాడు. అప్పుడే అతని మదిలో ఈ వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది.

నిర్ణయాన్ని వ్యతిరేకించిన కుటుంబం..

నిర్ణయాన్ని వ్యతిరేకించిన కుటుంబం..

అతను వెంటనే మనదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొత్త బీర్ బ్రాండ్ ప్రవేశ పెట్టాడు. వారి బీర్ బ్రాండ్ పేరు Bira91 అని నిర్ణయించాడు. మద్యం వ్యాపారంతో అంకుర్ కుటుంబం ఏమాత్రం సంతోషంగా లేదు. కానీ అతని బ్రాండ్ Bira91 విజయం తర్వాత.. అతని కుటుంబంలో అసంతృప్తి పోయింది.

కంపెనీ నికర విలువ రూ.1,722 కోట్లు..

కంపెనీ నికర విలువ రూ.1,722 కోట్లు..

Bira91 బ్రాండ్ యువతలో అత్యంత ఆదరణ పొందింది. బీరా 91కి ముందు కింగ్‌ఫిషర్ దేశంలో ప్రసిద్ధి చెందింది. అందుకే అంకుర్ తన బ్రాండ్‌ని తీసుకురావడానికి ముందు డిజైన్, టేస్ట్, బెటర్ ప్రైస్ ఇలా చాలా విషయాలపై వర్క్ చేశాడు. ఈ పరిశోధన కారణంగా ప్రస్తుతం బీరా 91 పేరు అందరి నోట నానుతోంది. బీరా 91 ఎంపీ, నాగ్‌పూర్‌లో తయారు చేయడం ప్రారంభమైంది. ఇప్పుడు ఇది దేశంలోని 20కి పైగా రాష్ట్రాల్లో అమ్ముడవుతోంది. కంపెనీ నికర విలువ 2015 సంవత్సరంలో రూ.1,722 కోట్లుగా ఉంది.

అనేక రకాల బీర్లు..

అనేక రకాల బీర్లు..

బీరా91 కాకుండా కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇతర బీర్లు కూడా ఉన్నాయి. బీరా వైట్, బీరా లైట్, బీరా స్ట్రాంగ్, ఇండియన్ పేల్ అనే నాలుగు రకాల బీర్లను కూడా ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తోంది. వాటిలో ఆల్కహాల్ కంటెంట్ కేవలం 5 నుంచి 6 శాతం మాత్రమే ఉండేలా కంపెనీ తయారు చేస్ింది. అలాగే రెండు బీర్లు బూమ్ క్లాసిక్, బూమ్ స్ట్రాంగ్, వీటిలో 6 నుంచి 8 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఇందులో బీరా స్ట్రాంగ్, బూమ్ స్ట్రాంగ్‌లకు భారీగా డిమాండ్ ఉందని కంపెనీ వెల్లడించింది .

English summary

Success Story: అనుభవం లేకున్నా వ్యాపారంలో సక్సెస్.. రూ.1700 కోట్ల విలువైన కంపెనీ వివరాలు.. | success story of ankur who started india's favourite beer brand Bira91 now worth more than 1700 crores

success story of ankur who started india's favourite beer brand
Story first published: Sunday, August 7, 2022, 16:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X