For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం బంగారం ధరలు ఎలా ఉండవచ్చు, మార్కెట్ ఎలా ఉంటుంది?

|

స్టాక్ మార్కెట్లు గతవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సంస్థాగత ఇన్వెస్టర్లకు తోడు రిటైల్ ఇన్వెస్టర్లు కూడా గరిష్టస్థాయిలో ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ 1,050 పాయింట్లు, నిప్టీ 338 పాయింట్లు క్షీణించింది. గురువారం బేరిష్ ఫ్లాగ్ ప్యాట్రన్ కావడంతో మరింత తగ్గడానికి సంకేతాలు అందించినట్లయింది.

ఈ ఒక్కరోజు సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3930 కోట్ల అమ్మకాలు జరిపారు. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.9,999 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. బ్యాంకింగ్, ఫార్మా సహా వివిధ రంగాలు బలహీనపడ్డాయి. మూడు వారాల క్రితం నమోదైన 17,615-18,350 స్థాయిలు ఇప్పుడు కీలక మద్దతు, నిరోధకస్థాయిలుగా ఉన్నాయి. సెన్సెక్స్ క్రితం వారా 59,300 దిగువన ముగిసింది.

అందుకే నష్టాల్లో

అందుకే నష్టాల్లో

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు గతవారం నష్టాల్లో ముగిశాయి. దేశీయంగా పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించే నిధుల వినియోగానికి సంబంధించి సెబి నిబంధనలు ప్రతిపాదించడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. పేటీఎం ఐపీవో కూడా మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. ఆచితూచి ట్రేడింగ్ నిర్వహించారు.

కరోనా కేసులు తగ్గడం, ఆర్థిక రికవరీ వేగవంతం, ఎగుమతులు పెరగడం వంటి అంశాలు ఈ వారం మార్కెట్‌కు సానుకూలమే. కానీ ద్రవ్యోల్భణం పెరగడం వల్ల ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముడి చమురు ధరలు ఇటీవల నాలుగు శాతం మేర తగ్గాయి. అలాగే, అమెరికా-చైనా అధ్యక్షుల వర్చువల్ సమావేశం ప్రపంచ మార్కెట్ సానుకూలతకు ఉపయోగపడనున్నాయి. గతవారం ఈ ప్రభావం ఉన్నప్పటికీ అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా నష్టపోయాయి.

దిద్దుబాటు

దిద్దుబాటు

సెన్సెక్స్ గతవారం 59,254 పాయింట్లు, నిఫ్టీ 17,651 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం కీలకమైన 17,800 దాటింది. అయినప్పటికీ 150 పాయింట్లు నష్టపోయి ముగిసింది. సెన్సెక్స్ మద్దతుస్థాయి 59,090 పాయింట్లు, 58,550 పాయింట్లు. నిరోధకస్థాయి 60,180, 60,600 పాయింట్లు. సెన్సెక్స్ ఇటీవలి కనిష్టం 59,100 కంటే దిగువకు వస్తే సమీప కాలంలో మరింత దిద్దుబాటుకు గురికావొచ్చునని అంటున్నారు.

బంగారం మద్దతు ధర

బంగారం మద్దతు ధర

గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్ ఈవారం రూ.49,350 కంటే ఎగువన ట్రేడ్ కాకుంటే, మరింత దిద్దుబాటు గురి కావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. రూ.48,500 వద్ద మద్దతు లభించకపోతే, రూ.48,100కు దిగి రావొచ్చునని అంటున్నారు. ఒకవేళ రూ.49,390 ఎగువకు వెళ్తే రూ.49,950 వరకు పెరిగే అవకాశముంది.

సిల్వర్ డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.66,900 ఎగువన కదలాడితే రూ.67,570, రూ.68,240 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రూ.65,430 కంటే కిందకు వస్తే రూ.64,500 స్థాయికి చేరుకోవచ్చునని అంచనా.

English summary

ఈ వారం బంగారం ధరలు ఎలా ఉండవచ్చు, మార్కెట్ ఎలా ఉంటుంది? | Stock market Gold Price Forecast for this week

Gold is trading above $1,840, attempting a recovery from an eight-day low of $1,839 amid the covid resurgence-led risk-off mood.
Story first published: Monday, November 22, 2021, 10:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X