For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా..లాభాల పంట పండిందిగా: రూ.వేలకోట్ల ప్రాఫిట్

|

ముంబై: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ నెట్‌వర్క్ ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ లాభాలను కళ్లచూసింది. 62 శాతం మేర నికర లాభాన్ని ఆర్జించింది. దీని విలువ 8,432 కోట్ల రూపాయలు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఎస్బీఐ నమోదు చేసిన నెట్ ప్రాఫిట్ 5,196 కోట్ల రూపాయలు. ఈ సారి ఈ సంఖ్యను భారీగా పెంచుకోగలిగింది. 8,432 కోట్ల రూపాయలకు చేర్చగలిగింది.

LIC IPO: కొద్దిరోజుల ముందు కీలక పరిణామంLIC IPO: కొద్దిరోజుల ముందు కీలక పరిణామం

వచ్చే మార్చి 31వ తేదీ నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిసేపటి కిందటే రెగ్యులేటరీకి సమర్పించింది. అక్టోబర్-నవంబర్-డిసెంబర్ కాలానికి సంబంధించిన కార్యకలాపాల వివరాలను ఇందులో పొందుపరిచింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే మూడో త్రైమాసిక కాలంతో పోల్చుకుంటే ఈ సారి డొమెస్టిక్ రుణ మంజూరులో 6.47 శాతం మేర పెరుగుదలను అందుకుంది. మొండి రుణాలు 33 శాతం మేర క్షీణించినట్లు తెలిపింది.

State Bank of India reported 62% jump in net profit at Rs 8,432 crore for the Q3

గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న మొండి రుణ బకాయిల భారం 10,342 కోట్ల రూపాయలు కాగా.. ప్రస్తుతం ఈ మొత్తం 6,974కు తగ్గింది. బ్యాంకు స్థూల బ్యాడ్ లోన్స్ అస్సెట్స్ కూడా స్వల్పంగా తగ్గింది. 4.90 నుంచి 4.50 శాతానికి తగ్గింది. నికర నిరర్థక ఆస్తుల విలువ స్వల్పంగా పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు నెట్ ఎన్పీఏ విలువ 1.23 శాతం నుంచి 1.34 శాతానికి పెరిగినట్లు ఎస్బీఐ తన థర్డ్ క్వార్టర్ ఫలితాల్లో చూపించింది.

వడ్డీల ద్వారా ఎస్బీఐ సాధించిన నికర ఆదాయం 6.5 శాతం. దీని విలువ 30,687 కోట్ల రూపాయలు. నికర వడ్డీ మార్జిన్ సైతం మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంతో పోల్చుకుంటే 3.4 శాతం మేర పెరిగింది. ఆరు బేసిస్ పాయింట్లను అధికంగా నమోదు చేసింది. ప్రొవిజన్ కవరేజీ రేషియో 88.32 శాతంగా తన ప్రతిపాదనల్లో పొందుపరిచింది. కేపిటల్ అడెక్వసీ రేషియో 13.23 శాతంగా నమోదైనట్లు తెలిపింది.

English summary

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా..లాభాల పంట పండిందిగా: రూ.వేలకోట్ల ప్రాఫిట్ | State Bank of India reported 62% jump in net profit at Rs 8,432 crore for the Q3

Largest public sector lender State Bank of India on Saturday reported 62% jump in net profit at Rs 8,432 crore for the quarter ending December, 2021. It reported net profit of Rs 5,196 crore a year ago.
Story first published: Saturday, February 5, 2022, 15:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X