For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెక్మా బ్యాలెన్స్ రిపోర్టు 2021: అగ్రస్థానంలో ప్రముఖ మీడియా ఏజెన్సీ స్టార్‌కామ్ ఇండియా

|

ముంబై: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా ఏజెన్సీస్ పనితీరును సర్వే చేసి రిపోర్టు ఇచ్చే రెక్మా (RECMA's) సంస్థ 2021కి సంబంధించి కొత్త నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం పబ్లిసిస్ గ్రూప్స్‌కు చెందిన స్టార్ కామ్ ఇండియా తొలి స్థానం సొంతం చేసుకుంది. కన్జ్యూమర్ ప్రాడక్ట్స్, న్యూ ఏజ్, యాప్ ఎకానమీ విభాగాల్లో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది స్టార్‌కామ్ ఇండియా. ప్రపంచ వ్యాప్తంగా స్టార్‌కామ్‌కు పలు ప్రతిష్టాత్మక రంగాల్లో క్లయింట్స్ ఉన్నారు. ఆటో రంగం, డీ2సీ, ఫిన్‌టెక్,ఈ-కామర్స్,గేమింగ్ మొదలగు రంగాలకు చెందిన క్లయింట్స్ స్టార్‌కామ్‌తో జతకట్టారు. ఇక భారత్‌లో డాబర్,ఫార్మ్ ఈజీ,స్టెలాంటిస్, వీసా, యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, నైకా, ఫ్రెష్‌ టూ హోమ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు స్టార్‌కామ్‌కు క్లయింట్స్‌గా ఉన్నాయి.

ఆయా ఏజెన్సీలకు ఉన్న వనరులు, ఆ ఏజెన్సీలకున్న క్లయింట్లు, వేగవంతమైన సేవలు అనే అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులను విడుదల చేయడం జరిగింది. ప్రతిష్టాత్మకమైన రెక్మా రిపోర్టు 2021‌లో స్టార్‌కామ్ తొలి స్థానాన్ని సొంతం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆ సంస్థ సీఈఓ రతి గంగప్ప. వినియోగదారుల అవసరాలను అర్థంచేసుకుని, వారికి కావాల్సిన సమాచారం, సమగ్ర నైపుణ్యత, సామర్థ్యం వంటి అంశాలే తమ సంస్థను తొలిస్థానంలో నిల్చొబెట్టాయని రతి గంగప్ప చెప్పారు. ఈ పనితీరును ఇలాగే కొనసాగిస్తూ నూతన ఒరవడిని సృష్టిస్తామని రతి చెప్పారు.

Starcom India stands first in the newly business Balance report 2021released by RECMA

ఇక రెక్మా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ఏజెన్సీల పనితీరును సర్వే చేసి ఒక నివేదికను అందజేస్తుంది. 90 దేశాల్లోని 1400 మీడియా ఏజెన్సీలకు సంబంధించిన సమాచారంను సేకరించి దాన్ని విశ్లేషించి ర్యాంకులను ఇస్తుంది. ఇక జూన్ 2020 వరకు ఆయా ఏజెన్సీల వద్ద ఉన్న బ్యాలన్స్‌ను కూడా రెక్మా రిపోర్ట్ చేసింది. ఇందులో స్టార్ కామ్ 139 మిలియన్ డాలర్ల బ్యాలన్స్‌తో ఉంది. ఇక రెండో స్థానంలో 116 మిలియన్ డాలర్లతో హవాస్ మీడియా నిలిచింది.

Starcom India stands first in the newly business Balance report 2021released by RECMA

గ్లోబల్ హోల్డింగ్ కంపెనీ స్టార్‌కామ్‌ 2000వ సంవత్సరంలో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం షికాగోలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 110 కార్యాలయాలున్నాయి. మొత్తం 8వేల మంది ఈ సంస్థలో ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు.

English summary

రెక్మా బ్యాలెన్స్ రిపోర్టు 2021: అగ్రస్థానంలో ప్రముఖ మీడియా ఏజెన్సీ స్టార్‌కామ్ ఇండియా | Starcom India stands first in the newly business Balance report 2021released by RECMA

Starcom India, part of Publicis Groupe India, has ranked #1 in new business in RECMA’s New Business Balance Report for 2021
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X