For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటాల నుండి రూ.1.75 లక్షల కోట్లు రావాలి: షాపూర్‌జీ పల్లోంజీ, TCS నుండి లక్ష కోట్లకు పైగా!

|

టాటా గ్రూప్‌తో 7 దశాబ్దాల బంధానికి ముగింపు పలికేందుకు తాము సిద్ధమని, తమకు రూ.1.75 లక్షల కోట్లు రావాల్సి ఉంటుందని షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ గురువారం తెలిపింది. ఈ మేరకు టాటా గ్రూప్‌తో కలిసి ఉన్న ఆస్తులు, వాటాల విభజన ప్రణాళికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. 28 అక్టోబర్ 2016లో సైరస్ మిస్త్రీని చైర్మన్ బాధ్యతల నుండి సాగనంపిన తర్వాత రెండు కంపెనీల మధ్య లీగల్ బాటిల్ నడుస్తోంది. షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్(SPG) తమ వాటాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా, టాటాలు కూడా కొనుగోలుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

టాటా గ్రూప్-ఎస్పీ గ్రూప్ మధ్య లీగల్ వార్!

తమ వాటా రూ.1.75 లక్షల కోట్లు

తమ వాటా రూ.1.75 లక్షల కోట్లు

తాజాగా SPG గ్రూప్ విభజన ప్రణాళికను భారత అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. టాటా సన్స్‌ను రెండు గ్రూప్‌లు కలిగిన కంపెనీగా చెప్పవచ్చునని, 81.6 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్, టాటా కుటుంబ సభ్యులు, టాటా కంపెనీలతో కూడిన టాటా గ్రూప్ అని, రెండోది 18.37 శాతం వాటా కలిగిన మిస్త్రీ కుటుంబానిదని తెలిపింది. టాటా సన్స్‌లో తమ వాటా వ్యాల్యూ రూ.1.75 లక్షల కోట్లుగా లెక్కగట్టినట్లు తెలిపింది.

ఇలా వాటా ఇవ్వండి

ఇలా వాటా ఇవ్వండి

2016 అక్టోబర్ 28న సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ పదవి నుంచి తొలగించడంతో ఈ రెండు గ్రూపుల మధ్య న్యాయపోరాటం ప్రారంభమైంది. గ్రూప్‌లో వాటాలకు విలువ కట్టడంపై నెలకొన్న వివాదాల్ని పరిష్కరించేందుకు లిస్టెడ్ ఆస్తుల్ని, బ్రాండ్ వాటాను దామాషా ప్రకారం విభజించాలని, అన్‌లిస్టెడ్ ఆస్తులకు తటస్థ థర్డ్ పార్టీతో విలువ కట్టించి నికర అప్పులకు సర్దుబాటు చేయాలని SPG పేర్కొంది. అలాగే టాటా సన్స్‌కు వాటాలు ఉన్న లిస్టెడ్ టాటా సంస్థల్లో తమకు నాన్ క్యాష్ సెటిల్మెంట్ కింద దామాషా ప్రకారం వాటాలు ఇవ్వాలని కోరింది.

టీసీఎస్‌లో భారీ వాటా!

టీసీఎస్‌లో భారీ వాటా!

నగదేతర సెటిల్మెంట్ చేయాలని ఎస్పీజీ కోరుతోంది. టాటా సన్స్‌కు లిస్టెడ్ కంపెనీల్లో ఉన్న వాటా ప్రకారం ప్రో-రేటా షేర్లను కోరుతోంది. ఉదాహరణకు టీసీఎస్‌లో 72 శాతం వాటా టాటా సన్స్‌కు ఉంది. టాటా సన్స్‌లో ఎస్పీ గ్రూప్ వాటా 18.37 శాతం. ఈ లెక్కన టీసీఎస్‌లో 13.22 శాతం వాటా లభిస్తుంది. ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఇది రూ.1.35 లక్షలు. బ్రాండ్ వ్యాల్యూలో ప్రో-రేటా వాటాను నికర అప్పులతో సర్దుబాటు చేశాక నగదును షేర్ల రూపంలో ఇవ్వవచ్చు.

English summary

టాటాల నుండి రూ.1.75 లక్షల కోట్లు రావాలి: షాపూర్‌జీ పల్లోంజీ, TCS నుండి లక్ష కోట్లకు పైగా! | SP Group submits plan to Supreme Court for separation from Tata Group

The Shapoorji Pallonji Group on Thursday said it has submitted a plan to Supreme Court to end its seven decades-old association with the Tata Group. The Mistrys have valued their holding in the Tatas at Rs 1.75 lakh crore, it informed the apex court, which is hearing the long-drawn legal battle between the two groups that began after the Tatas in a boardroom coup on October 28, 2016 sacked Cyrus Mistry as the Chairman.
Story first published: Friday, October 30, 2020, 7:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X